సబ్ ఫీచర్

కాయకల్ప యోగతో సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగా ప్రక్రియలో కాయకల్ప యోగ అత్యంత ప్రశంసనీయమైనది. నాడి, జీవక్రియలను మెరుగు పరచటంతో బాటు శరీరానికి యవ్వనాన్ని తెచ్చిపెట్టటం దీని ప్రత్యేకత. ఇది శారీరక పుష్టితో బాటు ఆధ్యాత్మక సిద్ధినీ అందిస్తుంది. ఈ యోగాన్ని మొదట గురువు పర్యవేక్షణలోనే చేయాలి. కాయకల్ప యోగా పలు విధానాల సమ్మేళనం. ముక్కుతో గాలి పీల్చి, నెమ్మదిగా నోటితో వదలటం, భస్తిక అంటే.. ముక్కు ఒక రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని ఆ రంధ్రాన్ని మూసేసి రంధ్రం నుండి శ్వాసను వదలటం, మర్ధన, మూలికా చికిత్సల వంటి పలు సాధనలు ఉన్నాయి.
* కాయకల్ప యోగ జీవితకాలాన్ని పెంచటమే కాక వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది.
* శరీరపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* వ్యసనాలు, అనారోగ్య కారక అలవాట్లను వదిలిపోయేలా చేసేందుకు దోహదపడుతుంది.
* వంశానుగతంగా వచ్చే అనారోగ్య సమస్యల కట్టడం, ప్రతికూల స్వభావాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
* మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బలోపేతమై సంతానం కలుగుతుంది. రుతు సమస్యలు తొలగిపోతాయి.
* ఉబ్బసం, మధుమేహం, ఆర్శ మొలలు, చర్మ సంబంధ వ్యాధుల తీవ్రత తగ్గిపోతుంది.
* నాడీ వ్యవస్థ, మెదడు కణాలను చురుకుగా ఉంచి పనితీరు పెరిగేలా చేస్తుంది.
* అతి భావోద్వేగాలను అదుపుచేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక భావనలను కలిగిస్తుంది.
* బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.
జలంధర బంధం
గడ్డం భాగాన్ని ముడుచుకొనేలా చేసే ఆసనం గనుక దీన్ని జలంధర బంధం అంటారు. ఈ ఆసనం వేయడానికి ముందు పద్మాసనంలో కూర్చోవాలి. వెన్ను, మెడ నిటారుగా ఉండాలి. అరచేతులను మోకాళ్ళపై ఉంచాలి. ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకోవాలి. ఆ శ్వాసను లోపలే ఆపి తలను కిందికి వచ్చి గెడ్డాన్ని ఛాతీకి అదిమి ఉంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తల ఎత్తి యథాస్థితికి రావాలి. తొలిసారి చేసేవారు ఐదు సెకన్లు శ్వాస నిలిపి సమయాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. ఇలా రెండు లేదా మూడు సార్లు చేయవచ్చు. గాలి పీల్చి బిగబట్టినప్పుడు చేతులు కూడా కాస్త చాచుకోవచ్చు. శ్వాసను లోపల నింపి చేసినట్లే శ్వాసను బయటకు వదిలి కూడా చేయవచ్చు.
* థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.
* జీవక్రియలు వేగం పుంజుకొంటాయి.
* ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.
* గొంతు సమస్యలు రాకుండా చూస్తుంది.
* మనస్సు తేలిక పడుతుంది. కోపం, ఒత్తిడి వదిలిపోతాయి.
* ముఖ కండరాలకు శక్తిని చేకూర్చి, అందంగా కనిపించేలా చేస్తుంది.
శలభాసనం
శలభం అంటే మిడత. ఈ ఆసనపు భంగిమ మిడత ఆకారంలో ఉంటుంది. గనుక దీనికి శలభాసనం అని పేరు. ఈ ఆసనం రెండు రకాలు. ఈ ఆసనాన్ని ఒక కాలుతో చేస్తే ఏకపాద శలభాసనం అనీ, రెండు కాళ్ళతో చేస్తే దాన్ని పూర్ణ శలభాసనం అనీ అంటారు. ఇప్పుడిప్పుడే ఆసనాలు సాధన చేసేవారు ముందుగా రెండు రోజుల పాటు ఏకపాద శలభాసనం సాధన చేసి పూర్ణ శలభాసనం వేయడం మంచిది. నడుము, వెన్ను సమస్యలకు ఈ ఆసనం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఏకపాద శలభాసనం
ముందుగా సమతలంగా ఉన్న నేలపై బోర్లా పడుకుని గడ్డాన్ని నేలకు ఆనించాలి. చేతులు శరీరానికి సమాంతరంగా చాచి ఉంచాలి. శరీర బరువు భుజాలు, ఛాతి, పొట్టపై నిలిపి నెమ్మదిగా గాలి పీలుస్తూ ముందుగా కుడికాలును వీలున్నంతపైకి లేపాలి. కాలు నిటారుగా ఉంచాలి. ఇలా సుమారు ఐదు నుంచి పది సెకన్ల పాటు అదే భంగిమలో ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ కాలుని మునుపటి భంగిమకు తీసుకురావాలి. ఇలా మూడుసార్లు చేసిన తర్వాత ఇలాగే ఎడమకాలితో కూడా చేయాలి.
పూర్ణ శలభాసనం
ముందుగా సమతలంగా ఉన్న నేలపై బోర్లా పడుకుని గడ్డాన్ని నేలకు ఆనించాలి. చేతులు శరీరానికి సమాంతరంగా చాచి ఉంచాలి. భుఝాలు, ఛాతీ, పొట్ట పూర్తిగా నేలకు తాకుతూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చి రెండు కాళ్ళను ఒకేసారి పైకి ఎత్తాలి. మొదట్లో కష్టంగా ఉన్నా సాధన చేసే కొద్దీ నడుము, పొట్ట దగ్గర కండరాలు బలోపేతమై ఎక్కువ సమయం పాటు, ఎక్కువ ఎత్తులో కాళ్ళు నిలపడం సాధ్యపడుతుంది.
* పిక్కలు, పిరుదులు, కాలి కండరాలు బలపడతాయి.
* మహిళల్లో రుతు సంబంధమైన సమస్యలు నయం అవుతాయి.
* వెనె్నముక దృఢంగా మారుతుంది. సయాటికా నొప్పి తగ్గుతుంది.
* అజీర్తి, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి ఉదరకోశ సమస్యలు దూరమవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
* మూత్రకోశ సమస్యలు తగ్గుతాయి.
* కాన్పు అనంతరం వచ్చే నడుము నొప్పి నివారణకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
* మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది.
* మొలల సమస్య ఉపశమిస్తుంది.
* దెబ్బతిన్న కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.