సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవ్వడు సంపూర్ణముగా భగవానున కాత్మార్పణ మొనర్చుకొనునో వానినే భగవానుడు రక్షించును.
యశోద: రాధ
1082. ఒకప్పుడు గోపాలుని క్షేమసమాచార మేమియు దనకు దెలియనందున యశోద రాధకడకు వెడలి, ‘‘గోపాలుని సమాచారమేమైన నీకు దెలియునా?’’యని యడిగెను. ఆ సమయమున రాధ దివ్యభావ పరవశురాలై యుండెను; అందుచే యశోద మాటలామెకు వినబడలేదు. రాధ మఱల బాహ్యస్మృతి నొందిన పిమ్మట నందుని రాణియగు యశోద తన యెదుటనుండుటగాంచి, వెంటనే యామెకు వందన మాచరించి రాకకు గారణమరసెను. యశోద కారణమును దెలుప రాధయిట్లనియెను: ‘‘తల్లీ! కన్నులుమూసికొని గోపాలుని రూపమును ధ్యానింపుము. నీవాతని జూడగలవు.’’ యశోద కన్నులు మూసికొనినంతనే స్వయముగా దివ్యభావ స్వరూపిణియగు రాధ తన యలౌకిక శక్తిచే నామెకఖండ పారవశ్యమును గల్గించెను. తోడనే యశోద తన గోపాలునిగాంచెను. అంతనామె రాధ నిట్లువేడుకొనెను: ‘‘అమ్మా! రాధా! నేను కన్నులు మూసికొనునప్పుడెల్ల నాముద్దు గోపాలుని గాంచగల్గునట్లు వరమిమ్ము.’’
శ్రీరామచంద్రుడు: మండూకము
1088. శ్రీరామచంద్రుడరణ్యములందు సంచరించుచు నొక సమయమున వింటిని బాణము నేలలోగ్రుచ్చి, నీరు త్రాగుటకై పంపా సరోవరమున దిగెను. పిమ్మట బయటికివచ్చి చూడగా, దన వింటి తాకునకు శరీరమంతయు రక్తమయమైయున్న యొక కప్పయచట పడియుండెను. శ్రీరామచంద్రుడు మిక్కిలి విచారించి యాకప్పతో నిట్లనియెను: ‘‘అయ్యో! ఏమైన కొంచెము చప్పుడు చేయగూడదా? నీవిక్కడ నున్నట్లు నాకెట్లు తెలియును? చప్పుడు చేసియున్న పక్షమున నీకీ విపత్తు రాకుండెడిదిగదా!’’ అందులకు మండూకమిట్లు విన్నవించెను: ‘‘నా కాపద వచ్చినప్పుడు, ఓ రామా! నన్ను రక్షింపుము అని నిన్ను స్మరింతును. నీవే నన్ను జంపుచుండగా నిక నేనెవరిని వేడుకొందుదు?’’
వినయ విధేయతలుగల సేవకుడు
1084. ఒక శ్రీమంతుని సేవకుడాతని యింటికి వచ్చి, వినయ విధేయతలతో నొకమూల నొదిగి నిలుచుండియుండెను. వాని చేతిలో నేదియో గుడ్డతో గప్పబడియుండెను. యజమానుడు వానిని గాంచి, ‘‘నీ చేతిలోనున్న దే’’మని ప్రశ్నించెను. అంత సేవకుడు తన బట్టచాటుననున్న యొక సీతాఫలమును దీసి, కడునమ్రతతో యజమానుని ముందుబెట్టి, యజమానుడు దానిని రుచి చూచునెడల గృతార్థుడనగుదునని భావింపసాగెను. యజమానుడు సేవకుని భక్తిశ్రద్ధలకును వినయవర్తనమునకును మెచ్చి, యాతడు తెచ్చినది యల్పపు కానుకయైనను నత్యాదరముతో గ్రహించి, ‘‘ఆహా! ఇది యెంత చక్కని పండు! దీనినెక్కడి సంపాదించివి?’’అనుచు నెంతయో యానందించెను.ఈ విధముగనే భగవంతుడు భక్తుని యంతరంగమును బరిగణించును. వాని వైభవమనంతమై వెలయునదైనను భక్తిశ్రద్ధలకు భగవంతుడు వశుడగుచుండును.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది