సబ్ ఫీచర్

‘విభజన’కు అతీతం.. వేద సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరతవర్షంలోని ‘భరతఖండం’ సంస్కృతిపరంగా, రాజ్యాంగపరంగా ఒకటిగా వికసించిన దేశం. ఈ భరత ఖండం దాదాపు నాలుగువేల సంవత్సరాల నుండి విభజనకు గురవుతోంది. అఖండ భారత్ విభజన 1947 ఆగస్టు 15వ తేదీ వరకూ కొనసాగింది. రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థల నుండి భిన్నఖండాలుగా విభజించబడినప్పటికీ భారతీయ సంస్కృతి మాత్రం ఒక్కటే. అది సనాతన సంస్కృతి- వేద సంస్కృతి.
భరతవర్షం ఇప్పుడు పశ్చిమాసియాగా పిలుస్తున్న ప్రాంతం నుండి దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలవరకు, తూర్పు ఆసియాలోని అనేక దేశాలవరకు విస్తరించి ఉన్న భూ భాగం. భరతవర్షం కలియుగం ప్రారంభం నాటికి ఇప్పటి ఇరాన్, ఇరాక్, మధ్య ఆసియానుండి ఇప్పటి ఇండోనేషియావరకు విస్తరించి ఉండి ఒకే సంస్కృతిగా కొనసాగుతుండేది. ఇదే సమయంలో ఇప్పటి భారత్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్, భూటాన్, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతమంతా ఒకే కేంద్రీయ రాజకీయ సామ్రాజ్యంగా ఉండేవి. ఈ ప్రాంతమంతా ఒకే సంస్కృతిగా కొనసాగిన ‘అఖండ భారత ఖండం’ రాజకీయ, రాజ్యాంగం పరంగా ఖండితమైన వేల సంవత్సరాల కాలంలో భారత వర్షంలో సనాతన సంస్కృతి- వేద సంస్కృతి సన్నగిల్లుతూ వచ్చింది.
ఇప్పటికీ ‘్థయ్‌లాండ్’లో రామాయణం జాతీయ గ్రంథంగా కొనసాగుతుంది. మలేషియా పార్లమెంట్ భవ నం ముందు ‘మనువు’ విగ్రహం కనువిందు చేస్తుంది. ‘ఇండోనేషియా’లో పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారతంలోని విషయాలను బోధిస్తున్నారు. అంతేకాదు వారి విమానాశ్రయం పేరు ‘గరుడ’. అమెరికాలోని వీరి రాయబార కార్యాలయం ఎదుట 9 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొన్నారు. ఇప్పటికీ అనేక దేశాలలో వేల సంవత్సరాల క్రిందటి హిందువుల దేవీదేవతల విగ్రహాలు బయటపడుతున్నాయి.
అఖండ భారత ఖండం భూభాగం విస్తీర్ణం 27,47,115 చదరపు మైళ్ళుగా ఉండేది. క్రీ.పూ. పదిహేనవ శతాబ్దిలో వౌర్యవంశ రాజులు ‘మగధ’లోని ‘గిరివ్రజం’ రాజధానిగా అఖండ భారతదేశాన్ని పాలించే నాటికి ‘టిబెట్’ సామంత రాజ్యంగా ఉండేది. క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దం నుండి నాలుగవ శతాబ్ది ప్రారంభం వరకు ‘గిరివ్రజం’ కేంద్రంగా చేసికొని అఖండ భారతదేశాన్ని పాలించిన ‘ఆంధ్ర శాతవాహను’ల కాలంలో ‘టిబెట్’ స్వతంత్ర దేశమైంది. ఇదే అఖండ భారత్ తొలి విభజన. అఖండ భారత్ 4,72,000 చదరపు మైళ్ళ భూభాగం కోల్పోయింది. టిబెట్‌ను 1959లో చైనా దురాక్రమించింది. 2,61,000 చదరపు మైళ్ళ భూభాగం గల బర్మా క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దిలో అఖండ భారత్ నుండి రాజకీయంగా దూరమైంది. ఉత్తర భారతమంతా విదేశీ జిహాదీల వశమైనప్పటికీ నేపాల్, భూటాన్, బర్మా, ఈశాన్య ప్రాంతాలు, శ్రీలంక స్వతంత్ర దేశాలుగా కొనసాగినందువల్ల అఖండ భారత భూభాగానికి దూరమయ్యాయి. క్రీ.శ.1885 తరువాత బర్మా బ్రిటన్‌వారి పాలనలోనికి వచ్చింది. బర్మా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా బ్రిటన్ ప్రభుత్వం 1937లో అఖండ భారత భూభాగం నుండి వేరుచేశారు.
క్రీ.శ.12వ శతాబ్దిలో అఖండ భారత్‌లో చొరబడిన ఇస్లాం జిహాదీలు భారతీయ మతాలను ధ్వంసం చేశారు. క్రీ.శ.1796లో బ్రిటన్‌వారు మాల్‌దీవులను ఆక్రమించారు. 1965లో మాల్‌దీవులు స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాయి. అ ఖండ భారత్ 27,48,115 చదరపు మైళ్ళ విస్తారంగా ఉన్న భూభాగం. టిబెట్ 4,72,000 చ.మై. భూటాన్ 18,000 చ.మై, నేపాల్ 57,000 చ.మై., ఆప్ఘనిస్తాన్, 2,51,000 మాల్‌దీవులు 115 చ.మై. శ్రీలంక 25,000 చ.మై. బర్మా 2,61,000 చ.మై. పాకిస్తాన్ 3,07,000 చ.మై, బంగ్లాదేశ్ 57,000 చ.మై. భూ భాగం విడిపోయి సనాతన సమగ్ర భరతమాత క్షతగాత్రమైపోయినది. వర్తమాన ఖండిత భారత్ కేవలం 13,00,000 చ.మై.కు అంటే సగానికి తక్కువై మరుగుజ్జుగా మారినది.
మన దేశానికి వ్యాపార మిషతో వచ్చిన బ్రిటన్‌వారు ఇస్లాం జిహాదీల నుండి చేజిక్కించుకుని భారతదేశ పాలకులైనారు. 75 శాతం జనాభాగల 55 శాతం భూభాగాన్ని స్వంత పాలనలో పంచుకున్నారు. వారి పాలనకు రాజులు, నవాబులు అడ్డురాకుండా ఉండడానికి 25 శాతం జనాభాగల 45 శాతం భూభాగాన్ని రాజులకు, నవాబులకు కప్పం చెల్లించి పాలించుకొనేందుకు అవకాశం కల్పించారు. రాజులు, నవాబులు పాలించిన భూభాగాలే సంస్థానాలు. దాదాపు 565 సంస్థానాధీశులుగా స్వతంత్ర పాలకులైన వీరందరూ బ్రిటన్ పరిపాలకులకు బానిసలే. భారతదేశాన్ని బ్రిటన్ పాలకుల కబంధ హస్తాలనుండి విముక్తిచేయాలనే స్వాభిమానులైన దేశభక్తులు ఆలోచిస్తున్న సమయంలో 1857 సంవత్సరంలో బ్రిటన్ సైన్యంలోని సైనికుడైన మంగళ్ పాండే బ్రిటన్ అధికారిపై కాల్పులు జరిపి స్వాతంత్య్ర సమరజ్వాలను రగిలించి మాతృభూమి రక్షణకై ఉరికంబమెక్కి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాంది పలికాడు. దీనినే బ్రిటన్‌వారు ‘సిపాయిల తిరుగుబాటు’గా చరిత్రలో చొప్పించారు. దీనినే ఈనాటికీ మనం చరిత్ర పాఠాలలో చదువవలసి వస్తుంది. వేల సంఖ్యలో దేశభక్తులు దేశ స్వతంత్య్రం కోసం సమిధలైనారు. 1943 అక్టోబర్ 21న సుభాష్‌చంద్ర బోస్ నేతృత్వంలో భారతదేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడినది. డిసెంబర్ 30న సుభాస్ చంద్రబోస్ ప్రధానిగా ప్రకటించబడినాడు. జాతీయ కరెన్సీ, జాతీయ రేడియో, జాతీయ సైన్యాన్ని కూడా ఏర్పాటుచేసినాడు.
బ్రిటన్ పాలకుల కుతంత్రాలకు లోనైన గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూలు పెద్దమనుషుల ముసుగులో భారత ప్రజల ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి మత ప్రాతిపదికన ఈ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. సర్దార్ వల్లభభాయి పటేల్ భారతదేశ ప్రధాని కావాలని ఆశిస్తున్న ప్రజల మనోభావాలను తుంగలో తొక్కారు. మోతీలాల్ నెహ్రూ కోరిక మేరకు జవహర్‌లాల్ నెహ్రూను భారత ప్రధానిగా గాంధీజీ సమర్థించారు. జవహల్‌లాల్ నెహ్రూకు అత్యంత ఆత్మీయుడైన జిన్నా పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి. ‘నేను భారత్‌కు ప్రధానినైతే షేక్ అబ్దుల్లా కూడా ప్రధానమంత్రి కావాలి’ అన్నది నెహ్రూ ఆలోచన. బ్రిటన్ వారు సుభాష్ చంద్రబోస్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలివెళ్ళవలసి వచ్చినందున వారి కుట్రలు, కుతంత్రాలతో మతప్రాతిపదికన భారతదేశాన్ని రెండు ముక్కలు చేసినప్పటికీ, స్వతంత్ర భారతదేశం నిరంతర పోరాటాలతో కొనసాగాలన్నదే వారి ఆకాంక్ష.
బ్రిటన్‌వారి ఆకాంక్ష మేరకు వారు నేరుగా పాలించిన భూభాగానికి మాత్రమే స్వతంత్య్రాన్ని ప్రకటించినారు. మిగిలిన ప్రాంతాన్ని సంస్థానాధీశుల అభీష్టం మేరకు వదిలిపెట్టారు. దాదాపు 565 సంస్థానాలను సంయుక్త భారత్‌లో విలీనం చేయకుంటే భారతదేశ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని దూరదృష్టిగల ఆనాటి హోం మంత్రి సర్దార్ పటేల్ సంస్థానాలన్నింటినీ తన శక్తియుక్తులతో భారత్‌లో విలీనం చేశాడు. కాని గుజరాత్‌లోని జూనాగఢ్, కేరళలోని ట్రావన్కోర్, నిజాం సంస్థానమైన హైద్రాబాద్, హరిసింగ్ పాలనలోని కాశ్మీర్ మాత్రం భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించలేదు. అయినా పటేల్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించాడు. భేదంతో జునాగఢ్, ట్రావన్కోర్, దండోపాయంతో హైదరాబాద్ సంస్థానాలను సంయుక్త భారత్‌లో విలీనం చేశాడు.
మిగిలింది జమ్మూ కశ్మీర్ సంస్థానం. కశ్మీర్ రాజు హరిసింగ్‌ను ఒప్పించేందుకు ‘రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్’ ద్వితీయ సర్ సంఘచాలక్ అయిన గురూజీ- మాధవరావు సదాశివ గోళ్వల్కర్‌ను భారత ప్రతినిధిగా పటేల్ ప్రత్యేక విమానంలో కశ్మీర్‌కు పంపించాడు. హరిసింగ్‌తో గురూజీ జరిపిన చర్చల కారణంగా కశ్మీర్‌ను భారత్‌లోనే కలపడం సముచితమని గుర్తించిన హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. షేక్ అబ్దుల్లాకు కశ్మీర్ ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టాలన్న ధ్యేయంతో జవహర్‌లాల్ నెహ్రూ కుటిల నీతితో కశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానని చెప్పి, పటేల్‌ను పక్కకు తప్పించినాడు. బ్రిటన్ దొరల అభీష్టాన్ని నెరవేర్చేందుకు, షేక్ అబ్దుల్లాను ప్రధానమంత్రిని చేయాలనే పట్టుదలతో- భారత్‌లో కశ్మీర్ విలీనం కావడానికి సమస్యలున్నట్టు ప్రచారం చేసి, ఆ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నెహ్రూ ప్రస్తావించాడు. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉంటే కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి 370, 35ఏ ఆర్టికల్స్ ద్వారా ఆ అసెంబ్లీకి ఎన్నికల కాలపరిమితి ఆరు సంవత్సరాలుగా చేశారు. భారత రాజ్యాంగానికి అతీతంగా కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, జెండా, ప్రధానమంత్రి పదవిని అంటగట్టారు. జమ్మూ కశ్మీర్ విషయంలో జరిగిన ప్రతి తప్పిదం జవహర్‌లాల్ నెహ్రూ వౌంట్‌బాటన్‌ను సంతోష పెట్టడానికి ఉద్దేశ పూర్వకంగా చేసినవే.
జనసంఘ్ స్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ చొరవ వల్ల షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రి పదవి కొద్దికాలానికే పరిమితమైంది. జవహర్‌లాల్ నెహ్రూ అసమర్థత వల్ల కశ్మీర్‌లో 3వ వంతు భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొన్నది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సాహసం అభినందనీయమే కాని ఆక్రమిత కశ్మీర్ విషయంలో చొరవ తీసుకోకుండా మన ఆధీనంలోకి వచ్చిన తొంభై వేల మంది పాక్ సైనికులను ఆ దేశానికి అప్పగించారు. 1972 సిమ్లా ఒప్పందం వల్ల కశ్మీర్ సమస్య ‘్భద్రతా మండలి’ నుంచి బయటపడింది. కాని దాదాపు ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్లను మాతృభూమికి దూరం చేశారు. తీవ్రవాదం, ఏర్పాటువాదం మాత్రం పెల్లుబికింది.
ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రతుల్యమైన మనస్సుకల వంద మంది యువకులు నావెంట ఉంటే భారతదేశం రూపురేఖలనే మార్చుతానని చెప్పిన వివేకానందస్వామి సంకల్పం ఈ ఏడాది ఆగస్టు 5,6,10 తేదీలలో కొంతమేరకు నెరవేరింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370, 35ఏ ఆర్టికల్స్‌ను రద్దుచేస్తూ, జమ్మూ కశ్మీర్, లడక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చుతూ చట్టం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తీసుకున్న చొరవ, సాహసాన్ని దేశ విదేశాల్లోని భారతీయులంతా ప్రశంసించారు. ‘ముమ్మారు తలాక్’ను రద్దుచేయడం ఇస్లాం మత స్ర్తిలను భారతీయ జీవన స్రవంతిలో కలపడం అభినందనీయం.
స్వామి వివేకానంద ఆశించిన ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రతుల్యమైన మనస్సు నరేంద్ర మోదీ, అమిత్‌షా, అజిత్ దోవల్‌కు సంపూర్ణంగా ఉన్నట్టు దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ ముగ్గురితో సాధ్యం కానిదేదీ లేదని ప్రజలకు ప్రగాఢ విశ్వాసం. ఆక్రమిత కశ్మీర్, అయోధ్య వివాదం, ఉమ్మడి పౌరసత్వం, అవినీతిపరుల ఆటలు కట్టించడం, ఉగ్రవాదుల పీచమణచడం, ఏర్పాటువాదులను ఏరివేయడం, జాతీయ భాషగా సంస్కృతం అమలు చేయడం వంటివి అతి త్వరలోనే కార్యరూపం దాల్చాలన్నదే దేశ ప్రజల ఆకాంక్ష.

-బలుసా జగతయ్య 90004 43379