సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండమీది గుడిసె: గాలివాన
1085. శ్రీగురుదేవుడు (ప్రతాపచంద్ర మజుందారునితో): నీవు విద్యావంతుడవు, బుద్ధిశాలివి, జిజ్ఞాసాపరుడవు కూడను. కేశవుడును నీవును గౌరనితాయిల (గౌరాంగ నిత్యానందుల)వలె (సోదరులవలె) నున్నారు. సాంసారిక విషయముల ననుభవింపవలసినంత యనుభవించితివి- ఉపన్యాసములు, వాదోపవాదములు, మత భేదములు, అంతఃకలహములు-
ఓ! జరుగవలసినన్ని జరిగినవి. ఇంకను వీనినన్నిటిని లక్షింతువా? (నానా విషయములందు) చెదరిన నీ మనస్సును గూడగట్టుకొని రుూపాటికి భగవంతునిపై ద్రిప్పుట మేలుసుమీ. పరబ్రహ్మ సాగరమున నిమగ్నుడవు కమ్ము.
మజుందారుడు: మహాశయా? నిజము. నేనటుల జేయవలసినదే- ఆ విషయములో సందేహము లేదు. కాని నాకీప్రాకులాటయంతయు కేశవుని పేరుప్రతిష్ఠలను నిలువబెట్టుటకే.
శ్రీరామకృష్ణుడు(నవ్వుచు): నేనొక కథ చెప్పెదను, వినుము. ఒకడొక కొండమీద గుడిసె కట్టినాడు. అందులకై చాల కష్టపడినాడు. చాల సొమ్ము ఖర్చుపెట్టినాడు. కొలది దినములకే గాలివాన వచ్చి యాగుడిసెను నుఱ్ఱూతలూగింపసాగినది. దానినెటులైన సంరక్షించుకొనవలయునని, ‘‘ఓ దేవా! ఈ గుడిసెను నాశనము చేయకుము, నా మొఱనాలకింపుము’’ అని వాయుదేవుని ప్రార్థించినాడు.
కాని వాయుదేవుడు వినలేదు. ఆతడు మఱల ప్రార్థించినాడు, కాని గుడిసె ఊగులాడుచునే యుండెను. అప్పుడాతడు వేఱొక యుపాయము నాలోచించినాడు. ‘పురాణములలో హనుమంతుడు వాయుపుత్త్రుడని చెప్పబడియున్నది కదా!
ఇక నాతనిపేర ప్రార్థింతమని గొంతెత్తి యిట్లఱచినాడు: ‘‘ఓ దేవా! ఈ గుడిసెను కాపాడుము, ఇది నీ తనయుడగు హనుమంతునిది.’’ ఐనను వాయుదేవుడు వినిపించుకొనలేదు. అంతనాతడు, ‘‘దేవా! ఈ గుడిసె హనుమంతుని స్వామియగు శ్రీరామచంద్ర ప్రభువునిది; కావున దీనిని గాపాడుము’’అని యఱిచినాడు.
అప్పుడును వాయుదేవుడు లక్ష్యపెట్టలేదు. అంతట గుడిసె కూలిపోవుచుండుట గని, తన ప్రాణరక్షణార్థమై యాతడీవలకు దూకి, యిట్లు శాపాలాపము లారంభించినాడు: ‘‘ఈ ‘ముష్టిగుడిసె’కూలిపోనీ! దానివలన నాకేమి?’’
నీవిపుడు కేశవుని పేరు నిలుపుటకై తాపత్రయపడవచ్చును. ఐన నీశ్వర సంకల్పమువలననే కేశవునితో సంబంధించిన ఈ పారమార్థికోద్యమము-
ఈ సంప్రదాయము- బయల్వెడలినదనియు, నది యొకానొకప్పుడు మంచిదశ ననుభవించిన పక్షమున నదియు నీశ్వర సంకల్పమేయనియు మదిలో నుంచుకొనుము- మనస్సమాధానము నొందుము. కాబట్టి యమృతసాగరమున నిమగ్నుడవు కమ్ము.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి