సబ్ ఫీచర్

చిన్న గదులే పెద్దవిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరి ఇళ్లు ఉండడానికి చిన్నవే కానీ చూసేందుకు చాలా పెద్దగా కనిపిస్తాయి. అలాగే మన ఇల్లు కూడా చిన్నదే అయితే పెద్దగా కనిపించడానికి ఇంటీరియర్ విషయంలో జాగ్రత్తపడితే సరిపోతుంది అంటున్నారు డిజైనర్లు. చిన్న గది అనగానే లైట్ కలర్ వాడితే సరిపోతుంది అనుకుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే.. ఆ గదిని మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి కలర్‌ను ఎంపిక చేసుకోవాలి. అది బెడ్‌రూమ్ అయితే వామ్ కలర్స్, బాత్‌రూమ్ అయితే కూల్ షేడ్స్ వాడాలి. పడకగది అయితే ముదురు నీలం రంగు వేస్తే హాయిగా అనిపిస్తుంది. గోడలకు పెయింట్ వేసేటప్పుడు సీలింగ్‌కు పది సెంటీమీటర్లు కింద నుంచి వేయాలి. వదిలేసిన దానికి తెలుపు రంగును వేయాలి. ఇలా తెలుపు రంగును వాడటం వల్ల సీలింగ్ ఎత్తుగా అనిపిస్తుంది. దాంతో గది పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది. క్రిస్ప్ వైట్ కలర్‌కి తగ్గట్టుగానే టీల్ టోన్స్ అంటే బ్లూ, గ్రీన్ రంగుల మిశ్రమాన్ని వాడితే చాలా బాగుంటుంది. సన్నగా ఉన్న కారిడార్ గోడలకి ఇరు చివరలా ముదురు రంగులు వాడితే విశాలంగా ఉన్న లుక్ వస్తుంది. డ్రమాటిక్ లుక్ కావాలంటే రిచ్ రెడ్ వేస్తే మరింత బాగుంటుంది. గదుల్లో వాడే ఫ్యాబ్రిక్, ఫర్నిచర్‌లకు దగ్గరి రంగులనే గోడలకు పెయింట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చూడగానే ప్రశాంతమైన భావన కలుగుతుంది. గది కూడా ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఇందుకు గ్రీన్ కలర్ షేడ్స్ బాగుంటాయి. చిన్న గదికి ఉడ్‌వర్క్, వౌల్డింగ్స్ చేయించుకునేటప్పుడు అవి గోడ రంగు కంటే ఒక షేడ్ డార్క్ ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా చేయడం వల్ల కాంట్రాస్ట్‌గా ఉండి గది పెద్దదిగా కనిపిస్తుంది. లేత బూడిద రంగు గోడలకు, ముదురు బూడిద రంగు ఉడ్‌వర్క్ చేయిస్తే అధునాతనంగా ఉంటుంది. గోడలకు పెయింట్ చేశాక పెద్ద పెద్ద అద్లా పెట్టడం వల్ల ఆ గది వైశాల్యం రెండింతలు పెరిగినట్లు అనిపించి ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది.
గదిలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ‘లాఫ్టెన్ డిజైన్’ చక్కని మార్గం. దీనివల్ల గదులు అధునాతనంగా కనిపించడమే కాదు.. ఇంట్లోని ఖాళీ ప్రదేశాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి, గదిలో ఆహ్లాదాన్ని సృష్టించడానికి పలు మార్గాలను చూపుతుంది. గదులకు విలాసవంతమైన డిజైనింగ్ చేయటంలో గోడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఫ్యాబ్రిక్, త్రీడీ బోర్డ్, రకరకాల చిత్రాలతోనూ లేదా మెటల్, మార్బుల్ పలకలతోనూ గోడల ఉపరితలాన్ని కవర్ చేయటం ద్వారా విలాసవంతంగా కనిపిస్తాయి. గదిలో ఉండే స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే వివిధ రకాల ఆకృతులు, ఫీచర్లతో ఉండే వస్తువులను ఉపయోగించుకోవాలి. దీనికి అలమరాలు చక్కగా ఉపయోగపడతాయి. వాడడం సులభం, శుభ్రంగా ఉంచితే గదికి కొత్త అందాలు అద్దుతాయి. సాధారణంగా లైట్లు అనగానే కాంతికోసం అనే దృష్టితోనే చూస్తారు కానీ, గది వాతావరణానికి వీటితో లగ్జరీ లుక్ తీసుకురావచ్చు. రకరకిత లైట్లను వాడటం ద్వారా గదిలో రకరకాల వేరియంట్స్‌ను సృష్టించవచ్చు. గోడలకు ఎక్కువ సంఖ్యలో అద్దాలు అమర్చటం వల్ల గది విశాలంగా కనిపిస్తుంది. గదిని బట్టి కూడా అద్దాలను ఏర్పాటుచేసుకోవచ్చు. చేంజింగ్ రూమ్ అయితే హృదయాకారం, నక్షత్రాల ఆకారంలో ఉండే అద్దాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల ఆ గది అందం రెట్టింపు అవుతుంది. వాల్‌పేపర్లు గదిలో ఉండే స్థలానికి మంచి లుక్‌ను తెస్తాయి. ఇందుకోసం మీకు బాగా ఇష్టమైన డిజైన్‌ను ఎంచుకోండి. గదిని చూడగానే కలిగే ఫీల్‌పై బ్యాగ్రౌండ్ కలర్ ప్రభావం ఉల్లాసపరిచే లగ్జరీ లుక్ కోసం గదుల్లో ఫర్నిచర్‌ను వాడొచ్చు. రోజువారీ ఫర్నిచర్‌తోనే గదిలో ప్రదేశానికి కొత్త రంగులు అద్దొచ్చు. సరైన విధానంలో చేయాలేగానీ బెడ్ లేదా దివాన్‌కు ఉండే దిండు, పరుపులతోనే విలాసవంతమైన లుక్‌ను తీసుకురావచ్చు. అవకాశాన్ని బట్టి కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. పోర్షన్‌లో కొంత భాగానికి ఎల్‌సీడీ రూఫ్ ప్యానెల్‌ను పైకప్పుగా వాడొచ్చు. ఇది చూడటానికి అందంగా ఉండటమే కాదు పగలు గదిలో చక్కగా వెలుతురు పరుచుకుంటుంది. రాత్రిళ్లు నక్షత్రాలు కనువిందు చేస్తారు. మీ వస్తువుల కోసం కొంచెం స్థలాన్ని ప్రత్యేకంగా అట్టిపెట్టుకోవాలి. అవసరమైతే చదువుకోవటానికి, పనిచేసుకోవటానికి ఏకాంతం కోసం ఆ స్థలాన్ని వాడుకోవచ్చు.