సబ్ ఫీచర్

ఘాట్లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కృష్ణాపుష్కరాలకు సంబంధించి ప్రధానంగా అన్ని ఘాట్లు చిన్నచిన్న పనుల మినహా సిద్ధమయ్యాయి. నగరంలోని అతిముఖ్యమైన పద్మావతి, కృష్ణవేణి, దుర్గా, పున్నమి, భవానీ ఘాట్లతో పాటు వేదాద్రి, గుడిమెట్ల, పవిత్రసంగమం ఘాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరానికి చేరుకున్న వివిధ జిల్లాల సిబ్బంది వారికి కేటాయించిన ఘాట్లలో విధుల్లో నిమగ్నమయ్యారు. పోలీస్ సిబ్బంది ప్రధానంగా ట్రాఫిక్ మళ్ళింపుతో పాటు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద విధుల్లోకి చేరారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఘాట్లకు నీరు చేరుకోవడంతో గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉన్నారు.
పద్మావతి ఘాట్
ఈ ఘాట్ పరిధిలో రోజుకు లక్షకు పైగా యాత్రికులు పుష్కరస్నానం చేసే అవకాశం ఉంది. అదే ఘాట్‌ను గణాంకాల సేకరణకు, ఇతర సమాచార సౌలభ్యం కోసం ఎ, బి, సి, డి, ఇలుగా కేటాయించారు. ఈ ఘాట్ పరిధిలో తొమ్మిది పుష్కరనగర్‌లు ఉన్నాయి.
కృష్ణవేణి, దుర్గా ఘాట్‌లే ప్రధానం
ఈ ఘాట్‌ల పరిధిలో రోజుకు లక్షకు పైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించే అవకాశం ఉంది. కృష్ణవేణిలో ఎ, బి, సి విభాగాలు దుర్గా ఘాట్‌లో ఎ, బి విభాగాలను కేటాయించారు. రెండు పుష్కర నగర్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దుర్గా ఘాట్‌లో కంట్రోలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘాట్‌లో విఐపిలతోపాటు వివిఐపిలు వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పున్నమి ఘాట్
ఈ ఘాట్‌కు రోజుకు లక్షకు పైగా వచ్చే అవకాశం ఉంది. దీని పరిధిలో నాలుగు పుష్కరనగర్‌లు, 12 బ్లాకులు ఉన్నాయి.
భవానీ ఘాట్
ఈ ఘాట్ పరిధిలో రోజుకు లక్షకు పైగా యాత్రికులు వచ్చే అవకాశం ఉంది. ఎ, బిలుగా రెండు భాగాలుగా విభజించారు. నాలుగు పుష్కరనగర్‌లు అందుబాటులో ఉన్నాయి.
పవిత్ర సంగమం ఘాట్
ఈ ఘాట్ పరిధిలో రోజుకు లక్షకు పైగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఘాట్‌లో ఎ,బి విభాగాలు నది పరివహ ప్రాంతం వైపు, సి విభాగంలో పుష్కర హరతి కార్యక్రమం నిర్వహించనున్నారు. డి విభాగంలో బుడమేరు వైపు ఉంటుంది. దీని పరిధిలో ఆరు పుష్కర నగర్‌లు అందుబాటులో ఉన్నాయి.
గుడిమెట్ల ఘాట్
చందర్లపాడు ప్రాంతంలో ఈ ఘాట్ ఉంది. దీని పరిధిలో పదివేల నుండి యాబైవేలు మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉంది. రెండు పుష్కరనగర్ ఉన్నాయి.
వేదాద్రి ఘాట్
జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్న ఈ ఘాట్‌లో రోజుకు సుమారు యాబైవేల నుండి లక్షమంది పుష్కరస్నానం చేసే వెసలుబాటు ఉంది.
అమరావతి ఘాట్
అమరావతి ప్రాంతంలో 1.35 కిలోమీటర్లు పొడవుతో ఉన్న ఈఘాట్‌లో 2లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. రెండు పుష్కర నగర్‌లు అందుబాటులో ఉన్నాయి.
సీతానగరం ఘాట్
ప్రకాశం బ్యారెజీ అవతల ప్రక్కల ఉన్న సీతానగరం ఘాట్‌లో రోజుకు లక్షమంది పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా. ఆరు పుష్కరనగర్‌లు అందుబాటులో ఉన్నాయి.

చిత్రం.. కృష్ణా పుష్కరాల సంరంభం మొదలైంది. భక్తుల రాక కోసం ఘాట్లు ఆహ్వానం పలుకుతున్నాయ. పుణ్యస్నానాల కోసం వచ్చే లక్షలాది భక్తుల కోసం ముస్తాబైన పద్మావతి ఘాట్