సబ్ ఫీచర్

అంతరించిపోతున్న ఆచారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి. మన సనాతన ఆచారాలు, విశ్వాసాలు గాలిలో దీపంలా రెపరెపలాడుతున్నాయని చెప్పక తప్పదు. ఏదో అక్కడక్కడా పాతతరం వాళ్ళు వున్న ఇళ్ళల్లో తప్పితే ఎక్కడా కానరావడంలేదు. ఈనాటి కొత్తతరం వాళ్ళు పాత ఆచారాలను, సనాతన ధర్మాలను మూఢ నమ్మకాలుగా పాత చింతకాయ పచ్చడిగా భావిస్తూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.
ఉదాహరణకు పండగలకు పబ్బాలకు చేసుకునే వంటకాలను ఇంట్లో వండి వార్చుకొనక వాటిని బయటనుండి తెప్పించుకుని గడుపుకుంటున్నారు చాలామంది. ఈ ఆనవాయితీ చాలాకాలంనుంచి ఉంది. ఏదైనా అంటే మాకు ఓపిక లేదు, టైము లేదని అంటారు. భక్త్భివం కొరవడింది. దైవభీతి సన్నగిల్లిందని చెప్పడం బాధాకరంగా వుంది.
ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రొద్దెక్కిన తరువాత తీరిగ్గా లేచి ఏ హోటలుకో వెళ్లి తమకు నచ్చినవి తెప్పించుకుని తిని పండగ అయిందనిపించుకుంటారు కాబోలు.
ఇక వేషాధారణకు వస్తే చిరుగులు పట్టిన బట్టలను ఫ్యాషన్ పేరిట ధరించే దౌర్భాగ్యం కలగటం. ఆడపిల్లలు సైతం భుజాల దగ్గర, అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడిన బట్టలను ధరించడం. చీలికలు పీలికలుగా కన్పించే డ్రెస్సులలో ఎబ్బెట్టుగా కన్పించటం విడ్డూరంగా వుంది. ఆడపిల్లల్లో సిగ్గు బిడియాలు కూడా మృగ్యమయ్యాయి. సిగ్గు, బిడియాలు వారికి పెట్టని ఆభరణాలు.
సాంప్రదాయాల పేరిట ఆడపిల్లలను అణగద్రొక్కేస్తున్నారని చాలామంది వాపోతుంటారు. కానీ ఆ సంప్రదాయాలను ధిక్కరించినవారి జీవితాలు ఎలా నాశనమయ్యాయో పరిశీలించుకోవాలి.
నేడు మన పిల్లల్లో పెద్దలపట్ల గౌరవ మర్యాదలు లేవు. ఉమ్మడి కుటుంబాలు అంతరించి చిన్న కుటుంబాలు ఏర్పడటమే దీనికి కారణం.
భక్త్భివం, సంప్రదాలపట్ల గౌరవ భావం లేకపోవటానికి కారణాలు చిన్నప్పట్నుంచే ఇంగ్లీషు చదువులకు పంపడం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన స్మార్ట్ఫోన్లు వినియోగం ఎక్కువ కావటం, రాత్రింబవళ్ళు వాటితోనే గడపడంతో మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం, జీవితాన్ని విలాసంగా గడపడమే తమ ధ్యేయంగా భావిస్తున్నారు. డబ్బు విలువ అస్సలు తెలియటంలేదు. మొదట్లో సమాజానికి భయపడి అయినా మసలుకునేవారు. తమ అలవాట్లను పద్ధతులను హద్దుమీరకుండా జాగ్రత్తపడేవారు.
కాని ఇపుడు కాలం మారింది. ఎవరిదారి వారిది. ఇతరులను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. వారి దగ్గర సమయం లేదు. స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత మరీ అధ్వాన్నంగా తయారయింది పరిస్థితి. ప్రక్కవారి గురించి పట్టించుకునే సమయం గాని ఆసక్తిగాని లేకపోయింది. తప్పు చేస్తున్నవాళ్ళని నియంత్రించలేకపోతున్నారు.
ఈ పరంపర ఇలాగే కొనసాగితే మున్ముందు మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాబోయే తరాలు కూడా మన సత్ సాంప్రదాయాలను కొనసాగించాలి. భక్త్భివాన్ని దైవభీతిని అలవర్చుకోవాలి. అప్పుడే సమాజంలో నీతి నియమాలు, నైతిక విలువలు పెంపొందిస్తాయి.

-పి.షహనాజ్ 9849229786