సబ్ ఫీచర్

డెల్టా.. కృష్ణ కృష్ణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: పనె్నండేళ్ల తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాలు అటు భక్తుల్ని, ఇటు రైతుల్ని నిరాశకు గురిచేస్తున్నాయ. ఇటు స్నానాలకు, అటు పంటలకు నీరు అందకపోవడమే దీనికి కారణం. ప్రశాశం బ్యారేజీ నుండి కృష్ణానది నీరు విడుదలచేసి పుణ్యస్నానాలకు అవకాశం కల్పిస్తారని భావించిన భక్తులకు తుదకు నిరాశే మిగిలింది. పుష్కర ఘాట్లవద్ద పుణ్యస్నానాల నిమిత్తం కుంటలు, షవర్ బాత్‌ను ఏర్పాటు చేయటంతో భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పుష్కరాల పుణ్యమా అని డెల్టాలో రైతులు వేసిన లక్షల ఎకరాల వరిపంట సాగునీరు అందక ఎండిపోతుందంటూ అన్నదాతలు హాహాకారాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... కృష్ణా పశ్చిమ డెల్టా కింద తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లెమండలాల పరిధిలో 62 పుష్కర ఘాట్లు, అందుకు వీలుగా రహదార్లు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. తుదకు పనులు సక్రమంగా జరగక కొన్ని ఘాట్లను మూసివేయగా ఉన్న ఘాట్లవద్దకు ప్రకాశం బ్యారేజీ నుండి నీరు విడుదల చేసినా నీరు అందే అవకాశం లేకపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో షవర్‌బాత్‌లను, నదిలోని కుంటలవద్ద పుణ్యస్నానాలుచేసే విధంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. డెల్టాలో ప్రసిద్ధిగాంచిన కొండూరు, వల్లభాపురం, ఓలేరు, చిలుమూరు, పెనుమూడి వంటి పెద్ద ఘాట్ల వద్దకు కూడా కృష్ణాజలం అందని పరిస్థితుల్లో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఏవిధమైన సౌకర్యాలు అందించాలో అర్థంగాని అధికారులు షవర్‌బాత్‌లను ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారంటూ భక్తులు వెదవి విరుస్తున్నారు. ఇక రహదార్ల పరిస్థితైతే మరీ దారుణంగా మారింది. ఘాట్లవరకు వేయాల్సిన రహదారి పనులు గురువారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. అలాగే ముఖ్యమైన ఘాట్లవద్ద కూడా సాయంత్రం వరకు కూలీలు రంగులు వేస్తూనే కూలీలు కనిపించారు. ఇటువంటి పరిస్థితుల్లో పుణ్యస్నానాలు సాధ్యం కావని భక్తులు భావిస్తున్నారు.
లక్షల ఎకరాల్లో ఎండిపోతున్న
వరి నారుమళ్ళు, పంటలు
కృష్ణా పశ్చిమ డెల్టాకింద సుమారు 5లక్షల ఎకరాలకు మించిన సాగుభూమి ఉండగా అందులో ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో రైతులు వ్యవసాయం ప్రారంభించారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్టానదికి రప్పించి డెల్టాను సస్యశ్యామలం చేస్తామంటూ ప్రకటించటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ఆశగా లక్షల ఎకరాల్లో వరినారుమళ్ళు, వెద పద్ధతిన పంటలు వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల పేరుతో కొంతమేరకు విడుదల చేసిన సాగునీటి సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో రైతులు నారుమళ్ళు, పంటలకు నీరులేక నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఉన్న పంట ఎండుముఖం పట్టిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.