సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణుడొక చిన్న బాలుని రూపుదాల్చి వచ్చి, ‘‘తమ్ముడా! వచ్చితిని. నీకు నేనుండగా భయమెందుకు? నాతో రమ్ము! నేను నిన్ను బడికి దీసికొనిపోయెదను’’ అనెను. అటులాబాలుని బడిదగ్గఱ విడిచి, ‘‘నీవు నన్ను బిలిచినపుడెల్ల నేను వచ్చెదను, భయపడకుము’’అని కృష్ణుడు అభయమొసగెను.
నిజమైన నమ్మిక యొక్కయు భగవత్పరితాపము యొక్కయు మహిమ ఇట్టిది.
భక్తురాలగు గొల్లత: బ్రాహ్మణుడు
1093. ఒక గొల్లపడు చేటికావలి యొడ్డుననుండు నొక బ్రాహ్మణునకు వాడుకగా బాలు తీసికొనిపోయి యమ్ముచుండెడిది. నావ రాకపోకలు సరిగా లేని కారణమున నామె ప్రతిదినము సకాలమునకు బాలందీయకుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు చీవాట్లుపెట్టగా నాదీనురా లిట్లు పలికెను: ‘‘నేనేమి చేయుదును, బాబూ! ఇంటికడనుండి పెందలకడనే బయలుదేఱుదును. ఏటి యొడ్డున బల్లెవానికోసమును, ఏఱుదాటువారందఱు వచ్చి చేరుటకోసమును గనిపెట్టుకొని యుండవలసి వచ్చుచున్నది.’’ అంత నాయర్చకుడిట్లనియెను: ‘‘వెఱ్ఱి దానా! భగవన్నామోచ్చారణముచేసి సంసార సాగరమునే దాటవచ్చునే, నీవీ చిన్న యేటిని దాటలేవా?’’ అమాయకురాలగు నా గొల్లత యేటిని దాటు నీ సులభోపాయమునుగూర్చి విని చాలాయానందించెను. మఱునాటి నుండియు నుదయముననే యామె బ్రాహ్మణునకు బాలందించుచుండెను. ఒకనాడాతడామె నిట్లడిగెను: ‘‘నీవీమధ్య చాలబెందలకడనే వచ్చుచున్నావు, ఎట్లు?’’ ఆమె యిట్లు సమాధానించెను: ‘‘బాబూ! మీరు చెప్పినటుల దేవుని పేరు తలచుకొనుచు నేఱు దాటివచ్చుచున్నాను. ఇక నాకు నావ యవసరములేకున్నది.’’ బ్రాహ్మణుడు ఆ పలుకులు నమ్మజాలక, ‘‘సరియే కాని, నీ వేఱెట్లు దాటెదవో నాకు జూపెదవా?’’ యనియెను. ఆమె, ‘‘చూపెద’’నని బ్రాహ్మణుని దనతోగూడ దీసికొనిపోయి నీటిమీదినుండి నడచిపోసాగెను. కొంతసేపటికి వెనుకకు దిరిగి చూచి యామె బ్రాహ్మణుని దురవస్థను గనుగొని యిట్లనియెను: ‘‘అదేమి, బాబూ! నోటితో దేవుని పేరు పలుకుచు, చేతితో బట్టపైకెత్తి పట్టుకొనుచున్నావు? నీవు పూర్తిగా దేవుని నమ్మనట్లు కనబడుచున్నది.’’
భగవంతునకు సంపూర్ణమైన యాత్మార్పణము, వానియందు స్థిరమైన నమ్మిక-ఇవియే యద్భుత కార్యములన్నిటికిని మూలము.
నారదుని నరకానుభవము
1094. దైవానుగ్రహమునకును జీవుని స్వాతంత్య్రమునకును సమన్వయము కుదురక, యిరువురు శిష్యులు పరిష్కారార్థము శ్రీ గురుదేవుని సమీపించిరి. గురుదేవుడిట్లు పలికెను: ‘‘స్వాతంత్య్రము: స్వాతంత్య్రము:: సర్వము నీశ్వర సంకల్పముపై నాధారపడియున్నది. మన స్వాతంత్య్రము (లేదా మనయిచ్ఛ) ఈశ్వర సంకల్పముతో నావుగింజకు గట్టబడినటుల బంధింపబడియున్నది. ఐనను నొక నిర్ణీత వలయములో నావునకు గొంత స్వాతంత్య్రమున్నట్లు మనకును గొంత స్వతంత్రత యున్నమాట నిజమే. కాబట్టి మానవుడు తాను స్వతంత్రుడననుకొనుచుండును. కాని వాని స్వాతంత్య్రమును నిచ్ఛయునీశ్వరేచ్ఛకు లోబడి యుండునవేయని గ్రహింపుడు.

- ఇంకాఉంది