సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిష్యులు: అటులైనచో జపతపములు మున్నగు సాధనల యవసరము లేదా? ఏలన, ‘అంతయు నీశ్వరేచ్ఛయే! ఏమి జరిగినను వాని సంకల్పమువలననే జరుగుచున్నది!’అని ప్రతి వ్యక్తియు గాళ్లుచాచుకొని కూర్చుడవచ్చును.
శ్రీరామకృష్ణుడు: ఓహో! ఎంతవఱకామాట? నీ పూరక నోటిమాటగా ననిన జాలునా? ముండ్లకంపమీద జేయివేసి, ‘‘ముండ్లులేవు ముండ్లు లేవు’’ అనుకొనిన ముండ్లు గ్రుచ్చుకొనుట మానునా? పారమార్థిక సాధనలు చేయుట పూర్తిగా దన యధీనములోనేయున్న పక్షమున ప్రతి వ్యక్తియు నటుల చేసియుండెడివాడే! ఐనను ప్రతి వ్యక్తియు జేయజాలు, ఎందుచేత?- కాని ఒక విషయము గమనింపవలసియున్నది.
భగవంతుడు నీకిచ్చిన శక్తిని సద్వినియోగము చేసిన గాని నీకాయన యధికముగా నియడు. అందుచేతనే పురుషప్రయత్నముయొక్క అక్కఱ. కాబట్టి భగవదనుగ్రహము పొందుటకైనను ప్రతి వ్యక్తియు శ్రమపడి కృషిచేయవలసి యున్నది. అట్టి పురుష కారమువలనను వాని యనుగ్రహమువలనను ననేక జన్మములలో ననుభవింపవలసిన కష్టములును దుఃఖములును నొక్క జన్మములోనే తీఱిపోవుచుండును. ఏమైనను కొంత పురుష ప్రయత్నమత్యావశక్యము. ఒక కథ చెప్పెదను, వినుడు:
గోలోకాధిపతి యగు విష్ణు వొకప్పుడు నారదుని,‘‘నీవు నరకమున బడిపోవుదువుగాక’’యని శపించెను. నారదుడు చాల వ్యాకులపడి కీర్తనలు పాడుచు నరక మెచటనుండునో, తానచటికి బోవుటెట్లో తెలుపుమని భగవంతుని వేడుకొనసాగెను. విష్ణుమూర్తి యంతట సుద్దముక్కతో నేలమీద ప్రపంచముయొక్క పటము గీచి, స్వర్గ నరకములు సరిగా నెచటనుండునో సూచించెను. నారదుడంతట నరకమని చూపబడిన తావును జూపి, ‘‘ఇదేనా, ఇదేనా, నరకము!’’అనుచు నా తావున బడి దొరలి, ‘‘స్వామీ! నేను నరక బాధలనన్నిటిననుభవించినాను’’ అని పలికెను. విష్ణుమూర్తి చిఱునవ్వు నవ్వి. ‘‘అదెట్లు?’’అని యడుగనారదుడిట్లు పలికెను. ‘‘స్వామీ! ఏల? స్వర్గనరకములు నీవు సృష్టించినవేకావా? నీవే రుూ పటమున రచించితివి. అందు నరకమును జూపితివి. ఇకనది నరకమేకదా? నేనందుబడి దొరలినప్పుడు నా బాధ చెప్ప నలవిగాకుండెను. అందుచే నరకమున నా శిక్షననుభవించినానని చెప్పినాను.’’ నారదుడు మనఃపూర్వకముగా నిట్లుచెప్పుటచే విష్ణుమూర్తి యాతని మాటలనంగీకరించెను.
అర్జున గర్వభంగము
1095. శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన యర్జునుని హృదయము నొకప్పుడు గర్వమావేశించినది. భగవానుడును తన మిత్రుడునైన శ్రీకృష్ణుని యెడల భక్తివిశ్వాసములు గలవారిలో తనతో సమానులు లేరని యర్జునుడు భావింపసాగెను. సర్వజ్ఞుడగు శ్రీకృష్ణ్భగవానుడర్జునుని మనోభావమును గ్రహించి యొకనాడు విహారార్థము తనతోగూడ దీసికొనిపోయెను. వారు చాలదూరము పోకమునుపే వట్టి గడ్డిని దినుచున్నయొక విచిత్ర బ్రాహ్మణుడర్జునకు గాన్పించెను. ఐనను వాని మొలనుండి యొక ఖడ్గము వ్రేలాడుచుండెను. వానిని జూడగనే యాతడే జీవికిని హింస చేయనొల్లని యహింసావ్రతుడైన పరమ భాగవతోత్తముడై యుండునని యర్జునుడు గ్రహించెను.
- ఇంకాఉంది