సబ్ ఫీచర్

వడ్డీలపై కోత వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీగారు అభివృద్ధి చెందిన దేశాలలో కంటే మన దేశంలో బ్యాంకు, పోస్టల్ పొదుపుపై వడ్డీ ఎక్కువని పొదుపుపై వడ్డీలు తగ్గిస్తే పరిశ్రమలకు ప్రయోజనమని అభిప్రాయపడ్డారు. కాని అభివృద్ధి చెందిన దేశాల సగటు ఆదాయంలో మనకు పదోవంతు లేదు. సంస్కరణల అమలు వల్ల కొన్నివర్గాల ఆదాయం పెరుగుతున్నా అత్యధిక శాతం ప్రజల ఆదాయం పెరగటం లేదు. (ఉదా.పౌష్టికాహార లోపంలో మన దేశం పొరుగున వున్న దేశాలకంటే కూడ దిగువ నున్నది).
మన బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో పొదుపుచేసుకునే వారిలో (అంటే రుణదాతల్లో) అత్యధికులు స్విస్ బ్యాంకుల్లో వలె కోటీశ్వరులు కాదు. ఏ వ్యాపారాలు తెలియని, స్థిరాదాయం లేని సామాన్యులు, పెన్షన్ సౌకర్యం లేని అసంఘటిత రంగ రిటైర్డ్ ఉద్యోగుల వంటివారు, ప్రశాంతంగా జీవించవచ్చని 10-15 ఏళ్ల సర్వీసు వదులుకొని వచ్చిన, పెన్షన్ సౌకర్యం లేని లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు కూడా వున్నారు. (ఒకప్పడు 12% వరకు బ్యాంకు వడ్డీ లభించేది). నేటి ప్రభుత్వాల హయాంలోకూడా గత ప్రభుత్వంలోవలే నిత్యావసర వస్తువుల ధరలు యధేచ్ఛగా పెరిగిపోతుంటే ప్రభుత్వాలేమో వౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకోటానికి అధిక వడ్డీల ఆశతో కొన్ని ప్రైవేటు సంస్థల్లో పొదుపుచేసి మోసపోతున్న లక్షలాది మందిని చూస్తున్నాం. శ్రీమంతుడైన, ఆర్థికవేత్త జైట్లీగారు ఇక్కడ జనుల జీవన స్థాయి, పెరిగిన సామాజిక అసమానతల గురించి కూడ ఆలోచించాలి.
ఇక రుణగ్రహీతల విషయానికొస్తే ఉత్పత్తి రంగమైన వ్యవసాయం, పేద రైతులు, పర్యావరణానికి మేలుచేసే సౌర, వాయు విద్యుత్ వంటి పరిశ్రమలకు చౌక రుణాలిస్తే మంచిదే. కాని బడా పారిశ్రామికవేత్తలకు కాదు. 5 లక్షల కోట్ల మొండి బాకీల్లో నిత్యం కార్లు, విమానాల్లో విహరిస్తూ ఆకాశహర్మ్యాల్లో నివసించే బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు చెల్లించ వలసినదే అధికమట. అప్పులుచేసిన వారు ఆనందంగా వుంటే పొదుపుచేసుకున్న సామాన్యులు అవస్థలు పడుతున్నారు. విదేశాల్లోని నల్లధనం కంటే ముందు ఈ వ్యాపారవేత్తలనుండి వసూలుచేస్తే, డిపాజిట్లపై వడ్డీలు పెంచినా లాభాలు వస్తాయి. పరిశ్రమల అధిపతులు, తాము తీసుకునే కోట్లాది రూపాయల పారితోషికాలు, ఉద్యోగులకిచ్చే లక్షలాది రూపాయల జీతాలు, విలాసాలు నియంత్రించుకుంటే నష్టాలొచ్చే పరిశ్రమలు కూడా లాభాలబాట పడతాయి. ఇతర దేశాల్లో బ్యాంకు రుణాలు ఎగవేస్తే ప్రజాప్రతినిధిగా కూడ పోటీ చేయకూడదట. పూర్తి మెజార్టీవున్న మోదీగారి ప్రభుత్వం తక్షణమే అటువంటి చట్టం తీసుకురావాలి. కార్లు, కంప్యూటర్, మొబైల్ వంటి కాలుష్యకారక పరిశ్రమలకు ఇచ్చే ‘కారు’చౌక రుణాల రాయితీలవల్ల పర్యావరణానికి ముప్పువస్తుందని శాస్తవ్రేత్తలు భయం వెలిబుచ్చుతున్నారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు అక్కడ ఉత్పత్తులకు మనవలె భారీ రాయితీలు ఇవ్వటం లేదు.
నిత్యావసర వస్త్ధురలు పెంచుతూ, ప్రభుత్వాలు పన్నులతో పీడిస్తుంటే ప్రజల స్థితి పెనంపైనుండి పొయ్యిలో పడ్టట్లుంది. ఏ ప్రభుత్వమైతేనేమి పళ్ళూడగొట్టుకోటానికి అని ప్రజలు భావించే ప్రమాదముంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతున్నవి ప్రభుత్వ పొదుపు పథకాలే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలంటే ప్రజలకోసం, ప్రజలవల్ల అని ప్రభుత్వ సంస్థలంటే లాభనష్టాలు బేరీజువేసుకునే ప్రైవేటు సంస్థలుకాదని మన మంత్రులు గ్రహించాలి. కనుక పర్యావరణానికి మేలు చేసే సౌర, వాయువిద్యుత్ వంటి పరిశ్రమలకు వడ్డీరేట్లు తగ్గించినా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని పొదుపు డిపాజిట్లపై కొంత వరకైనా వడ్డీలు పెంచాలి.

- తిరుమలశెట్టి సాంబశివరావు