సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్డిలోను ప్రాణముండుటవలన నాతడు పచ్చిగానుండు గడ్డినైనను దినసహింపక, యెండి నిర్జీవమైయున్న గడ్డిని మాత్రమే తిని ప్రాణముల నిలుపుకొనుచుండెను- ఐనను ఖడ్గ్ధారియై యున్నాడే! ఈ వైపరీత్యముగాంచి, యర్జునుడు వింతపడి, శ్రీకృష్ణునితో నిట్లు పలికెను: ‘‘ఇదేమి వింత! తుదకు గడ్డిపోచకైనను హింసచేయనొల్లని యహింసావ్రతుడైన రుూతడు మృత్యుచిహ్నమును ద్వేష నిలయమునగు ఖడ్గమును ధరించి యున్నాడు!’’ ‘‘ఆతని నీవే యడిగి తెలిసికొనుము’’అని భగవానుడు పలికెను. అర్జునుడంతట బ్రాహ్మణుని సమీపించి, ‘‘స్వామీ! నీవేజీవిని హింసింపబోవు. ఎండు గడ్డిని దిని ప్రాణము నిలుపుకొనుచున్నావు! అట్టి నీ వీకఱకు కత్తిని బూనియుంటివేల?’’ అని యడిగినాడు.
బ్రాహ్మణుడు: నాకంటబడిరేని నలుగురిని శిక్షింపనెంచి దీనిని బూనియున్నాను.
అర్జునుడు: వారెవరెవరు?
బ్రాహ్మ: మొదటివాడానీచుడు నారదుడు.
అర్జు.: ఏల? ఆయన యేమిచేసెను?
బ్రాహ్మ: ఏమిచేసెనా? వాని దుండగము చూడు. సదా తన కీర్తనలతో, సంగీతముతో, నా స్వామికి నిద్రలేకుండ చేయుచుండును. స్వామి సుఖమును లేశమైనను గమనింపనక్కఱలేదా? రాత్రి యనక, పగలనక, సర్వకాల సర్వావస్థలయందును స్తోత్రములను ప్రార్థనలను జేయుచు స్వామికేమియు దోపనీయడు.
అర్జు.: రెండవ వారెవరు?
బ్రాహ్మ.: ఆ తెలివితక్కువ ద్రౌపది.
అర్జు.: ఆమె నేరమేమి?
బ్రాహ్మ.: దాని యవివేకమును సాహసమునుజూడు! నా స్వామి సరిగా భోజనమునకు గూర్చుండువేళ బొబ్బలిడసాగినది. నా స్వామి తినబోవుచున్న యన్నమును విడిచి, వడివడిగా కామ్యక వనమునకు బరుగెత్తి, దుర్వాసుని శాపమునుండి పాండవులను రక్షింపవలసి వచ్చినది. ఇంకను దాని న్వాతిశయమునేమని చెప్పను? తాను దినగా మిగిలిన యెంగిలి కూడును నా స్వామిచే దినిపించినది!
అర్జు.: మూడవ వ్యక్తి యెవరు?
బ్రాహ్మ.: అనిర్దయుడు ప్రహ్లాదుడు. ఏమి వాని క్రౌర్యము! జంకు, గొంకు లేకుండ నా స్వామిని బిలిచి సలసలగాగుచున్న నూనె కాగులో దింపినాడు; మదపుటేనుగుల పాదముల క్రింద ద్రొక్కించినాడు; వజ్రతుల్యమైన స్తంభమును బగులగొట్టుకొని వచ్చునట్లు చేసినాడు.
అర్జు.: నాలుగవవారెవరు?
బ్రాహ్మ.: ఉన్నాడొక నిర్భాగ్యుడు, అర్జునుడు.
అర్జు: ఏమి, ఆతడేమి పాపము చేసినాడు?
బ్రాహ్మ: చూడు, వానిదుండగము! నాజగన్నాథుని దీనికొనిపోయి కురుక్షేత్రయుద్ధమున నీచమైన తన సారథ్యమును వహింపజేసినాడు. ఇది మహాపరాధముకాదా?
అర్జునుడు ఆ పేదబాపని భక్తియెంత గాఢమైనదో గ్రహించి నిశే్చష్టుడైనాడు. ఆ క్షణమునుండి వానిగర్వమంతరించినది; తానే భగవద్భక్తులలో మేటిననుకొనుట మానివేసినాడు.
‘అంతయు రామేచ్ఛ’యని నమ్మిన సాలె
1096. ఒకానొక యూరిలో పుణ్యాత్ముడగు నొకసాలెయుండెను. వాని భక్తిని పవిత్ర హృదయమును జూచి యెల్లరును వానిని నమ్మి ప్రేమించెవారు.

- ఇంకాఉంది