సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక యువతి భిక్ష పెట్టుటకై రాగా నామె స్తనయుగ్మమును జూచి ‘‘నీకేమైన ఱొమ్మున వ్రణములు లేచినవా’’యని ప్రశ్నించినాడు.
ఆమాట లా యువతి తల్లి విని ‘‘లేదు లేదు, నాయనా! అని వ్రణములు కావు. త్వరలోనే ఆమె కొక బిడ్డ కలుగనున్నది. ఆ బిడ్డకు పాలిచ్చు నిమిత్తము ముందుగనే భగవంతుడామెకు రెండుస్తనములననుగ్రహించినాడు. బిడ్డ పుట్టినపుడాస్తనములనుండి పాలుత్రాగగలదు’’ అని సమాధానించెను. ఈ పలుకు లాలకింపగనే యా బాలసన్న్యాసి యిట్లు పలికెను.‘‘ఇక నేను తిండికై యింటింటదిరుగును. నాఱు పోసినవాడు నీరు పోయడా? పుట్టించిన యా భగవంతుడే నన్ను పోషించును.’’ యని అక్కడ నుంచి వెడలెను.
విరక్తులగు దంపతులు
1100. భార్యాభర్తలిఱువురు సంసార త్యాగము చేసి తీర్థయాత్రలు చేయమొదలిడిరి. అటుల వెడలుచుండగా భార్యకంటె గొంచెము ముందు నడచుచున్న భర్త కొకప్పుడు త్రోవలో నొక వజ్రము కనబడినది. దానిని భార్య చూచిన పక్షమున ఒక వేళ నాశచే మోసితురాలై త్యాగ ఫలమును బోగొట్టుకొనునేమో యనుభయముచే నాత డా వజ్రమును నేలలో గప్పి పెట్ట నెంచి కాలితో మట్టి పెల్లగింపనారంభించెను. ఇంతలో భార్య సమీపించి ‘‘ఏమి చేయుచున్నా’’రని యడిగెను. అతడేమేమో చెప్పి తప్పించుకొనజూచెను. ఇంతలో నామె వజ్రమును గాంచి భర్త యుద్దేశమును గ్రహించి యిట్లు పలికెను. ‘‘ ఆవజ్రమునకును మట్టి పెల్లకును మీకింకను భేదము స్ఫురించున్న పక్షమున మీరు సంసారమును పరిత్యజింపనేల?’’
ఒక్కుమ్మడి సన్న్యాసియైన సంసారి
1101 మానవునకు వైరాగ్యమెట్లబ్బును. తన భర్తతో నొక యువతి యిట్లు పలికెను. ‘‘మాయన్న విషయమై చాలా బెంగ పెట్టుకొని యున్నాను. వారముదినములనుండి యాతడు సన్న్యసింపవలయునని చూచుచున్నాడు. క్రమ క్రమముగా గోరికలన్నీ విడనాడుచున్నాడు’’ అందులకు ఆ భర్త యిట్లు సమాధానించెను. ‘‘వెఱ్ఱిదానా! మీ యన్న విషయమై నీవెంత మాత్రము బెంగ పెట్టుకొన నక్కఱలేదు. అతడెన్నటికిని సన్న్యాసి కాజాలడు. ‘‘ఇక సన్న్యాసి యగు విధమేది’’ యని భార్య యడిగినది. ‘‘అది రుూ విధముగా జరుగువలయును’’అని చెప్పుచూ అతడు తటాలున దన వస్తమ్రులను బేలికలుగా జింపివైచి అందొక పేలికను గోచిగా ధరించి, యిట్లు పలికెను. ‘‘చూడు నేటి నుండి నీవును, నీ స్ర్తి జాతి యంతయు నాకు దల్లులు సుమీ!’’ అతడిల్లు విడిచి మఱల గాన్పింపడయ్యెను.
ఇద్దఱు వ్యవసాయులు
1102. ‘క్రమక్రమముగా పూర్తిచేయుదును,’ ‘ఇదిగో, ఆరంభంచుచున్నాను. ‘నేను దీనిని అవలంబింపనున్నాను’- ఇది యంతయు నశ్రద్ధయొక్క లక్షణము, మందవైరాగ్య ధోరణి. వైరాగ్యాగ్ని యెవ్వని హృదయమున ప్రజ్వలించునో, బిడ్డకొఱకై తల్లివలె నెవ్వడు భగవంతునికోసము పరితపించునో- యట్టివాడు భగవానుని దప్ప నితరమును లక్షింపడు. సంసారము వానికి ప్రాకారము లేని ఘోర కొపమువలె గాన్పించును, ఎప్పుడందు పడిపోవుదునోయని సదా బహుజాగరూకుడై మెలగుచుండును. ఇతరులవలె ‘‘ముందు సంసార పరిస్థితులను జక్కబెట్టుకొని యటుపిమ్మట భగవద్ధ్యానము చేయుద’’మని యాతడెన్నడును తలపోయడు.

- ఇంకాఉంది