సబ్ ఫీచర్

అరుదైన అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త విషయాలను తెలుసుకోవాలన తపన, జిజ్ఞాస, గురువుల ప్రోత్సాహం ఓ తెలుగు విద్యార్థికి అరుదైన అవకాశాన్ని కలిగించాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 తుది అంకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పించాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా తలసముద్రం అనే మారుమూల గ్రామానికి చెందిన ప్రగడ కాంచన బాలశ్రీ వాసవికి ఈ అవకాశం అంత తేలిగ్గా మాత్రం లభించలేదు. వేలాదిమంది విద్యార్థులతో పోటీపడి ఈ ఘనత సాధించిందీ అమ్మాయి. చంద్రయాన్-2 ప్రయోగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇస్రో ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. చంద్రయాన్-2 సాఫ్ట్ లాంచింగ్‌ను దేశ ప్రధానితో కలిసి వీక్షించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తూ ఇటీవల ఒక క్విజ్ ప్రోగ్రామ్‌ను పెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించింది. ఆగస్టు 10 నుండి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ క్విజ్ ప్రోగ్రామ్‌కు ఎనిమిది నుంచి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులుగా పేర్కొంది. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నుంచి క్విజ్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేశారు. ఇలా ఎంపికైన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఈదులవలస గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న కాంచన ఈ పోటీలో విజయం సాధించింది. ఆమె చదువుతున్న స్కూలు నుంచి దాదాపు 50 మంది ఆ క్విజ్‌లో పాల్గొన్నారు. పది నిముషాల వ్యవధిలోనే దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. లేదంటే వెబ్‌సైట్ లాగౌట్ అవుతుంది. క్విజ్‌లో చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయి. కానీ కాంచన వాటన్నింటికీ సమాధానం ఇవ్వగలిగింది. చిన్నప్పటి నుంచి అంతరిక్షం, విశ్వరహస్యాలను తెలుసుకోవాలనే కోరిక వల్లే కాంచన ఈ ప్రోగ్రామ్‌లో విజయవంతంగా పాల్గొంది. ఆగస్టు 15న ఈ స్కూల్లో మైల్‌స్టోన్ ఆఫ్ ఇండియా ఇన్ స్పేస్ ప్రోగ్రాం అనే అంశంపై డిబేట్ పెట్టారు. దానిలో పాల్గొనేందుకు కాంచన చాలా శ్రమించింది. జులై 22న చంద్రయాన్ ప్రయోగం మొదలుపెట్టినప్పుడు ఆ స్కూల్లో ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులందరికీ చూపించారు. అప్పుడే చంద్రయాన్‌పై కాంచనకు బాగా ఆసక్తి కలిగిందట. అప్పటి నుంచి దాని గురించి చదవడం మొదలుపెట్టింది. డిబేట్‌లో కూడా పాల్గొనడంతో ఆమెకు చంద్రయాన్‌పై పూర్తి అవగాహన ఏర్పడింది. ఫలితంగా క్విజ్‌లో పాల్గొనడం ఆమెకు తేలికైంది. ఈ క్విజ్‌లో చాలామంది పోటీపడ్డారు. ఇందులో కాంచన తాను పాల్గొన్నప్పుడు తాను గెలుస్తానని అనుకోలేదట. ఆ అమ్మాయి ఎంపికైనట్లు ఇస్రో నుంచి కాంచన తల్లికి ఫోన్ వచ్చింది. ఈ విషయం తెలియగానే కాంచనను అందరూ అభినందించారు. ఈ నెల 7న బెంగళూరులో ప్రధాని మోదీతో కలిసి చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించబోతోంది కాంచన. భవిష్యత్తులో తాను ఇంజినీర్‌గా స్థిరపడాలనుకుంటున్నదట. కాంచన తండ్రి ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. తల్లే కాంచనను, ఆమె చెల్లెల్ని కష్టపడి పెంచుతోంది.