సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత వానికొక రాగి గని కాన్పించినది. తాను మోయగలిగినంత రాగిని దీసికొని పోయి యంగడిలో విక్రయించి చాల ధనము సంపాదించెను. సాధువు యొక్క ఉపదేశముననుసరించి యాతడంతటితో నాగక, మఱునాడు మఱింత దూరము వనములోనికి బోగా వానికొక వెండి గని గాన్పించినది. తాను మోయగలిగినంత వెండిని దీసికొనిపోయి విక్రయించి యాతడు మఱింత ధనము సంపాదించినాడు. ఈ విధముగా నానాడు ముందునకు సాగిపోగా, బంగారు గనులును వజ్రపు గనులును లభించుటచే నా కట్టెలమ్మువాడు తుదకు కోటీశ్వరుడయ్యెను.
బ్రహ్మజ్ఞానము బొందగోరువాని విషయము కూడ నిట్టిదే. ఏ కొలదిపాటి సిద్ధులనో, మహిమలనో సంపాదింపగనే తాను సర్వము సాధించితిననుకొనక పూనికతో సాధనను సాగించు నెడల తుదకు శాశ్వత బ్రహ్మానంద లాభమును బొందితీరును.
అక్బరు: పకీరు
1106. అక్బరు రాజ్యము చేయుచుండ, డిల్లీ సమీపమున నొక వనములో నొక పకీరు నివసించుచుండెను. ఆ పకీరు గొప్ప మహనీయుడు. అనేకులాతని కుటీరమునకు బోయియాతని సందర్శించువారు. కాని వారినాదరించుటకు దనయొద్ద నేమియు లేమి ధన సాహాయ్యము కోరి పకీరక్బరునొద్దకు వెడలెను. అక్బరు సాధువులయెడ భక్తికలవాడని పేరుపొందియుండెను. పాదుషా యాసమయమున నమాజు చేయుచుండ, పకీరు వాని ప్రక్కన నుచితాసనమున గూర్చుండియుండెను. అంతట పకీరునకు అక్బరిట్లు ప్రార్థించుచుండుట వినవచ్చెను: ‘‘ప్రభూ, నాకధిక సంపద నిమ్ము. అధిక శక్తి సామర్థ్యములను, అధికారము నిమ్ము, నా రాజ్యమును విస్తరింపజేయుము!’’ తత్‌క్షణమే పకీరు లేచి పోబోవుచుండగా, అక్బరు చూచి, కూర్చుండుడని సైగ చేసెను.
ప్రార్థనానంతరము పాదుషా పకీరుతోనిట్లనెను: ‘‘అయ్యా, మీరు నన్ను జూడవచ్చితిరే, నాతోనేమియు జెప్పకుండగనే వెడలి పోబోయితిరేమి?’’ పకీరిట్లు సమాధానము చెప్పెను: ‘‘ఏలిన వారిని జూడవచ్చిన పనియా?... ఎందుకు లెండు, మిమ్ము బాధింపను.’’ ‘‘కాదు, మీకేమి కావలయునో సెలవిండు’’ అని అక్బరు పదే పదే నొక్కి యడుగగా,పకీరు తుదకిట్లు చెప్పెను: ‘‘ప్రభూ! నాకడకనేకులు బోధకొఱకై వత్తురు. ధనాభావముచే నేను వారి నాదరింపజాలకున్నాను. అందుచే మీ సాయము నర్థించుట మంచిదనుకొంటిని.’’

- ఇంకాఉంది