సబ్ ఫీచర్

కితకితలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్సిల్ -పెన్ నేమ్. పార్థసారధి -పేరు. రెండూ కలిపి -పెన్సిల్ పార్థసారథి. రాసిన ఎన్నో పుస్తకాలు అమ్ముడుపోకున్నా -పెద్ద రైటర్‌నన్న ఫీలింగ్ వాడిది. ట్రైలర్‌లో కామెడీ కొసరే చశారు. సినిమాకి రండి, అసలు చూస్తారు’ అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం -నానీస్ గ్యాంగ్‌లీడర్. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మాతలు. టీజర్, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన సినిమా -ఇటీవల
విడుదలైన ప్రమోషనల్ సాంగ్‌తో బజ్ సృష్టించుకుంది. సెప్టెంబర్ 13న సినిమా విడుదలవుతున్న
సందర్భంలో నానితో ఇంటర్వ్యూ.
*
ఎలా మొదలైంది?
కథ గురించి విక్రమ్, నేను చాలా రోజులుగా ఆలోచనలు చేస్తున్న టైంలో -ఒకరోజు సడెన్‌గా ఈ పాయింట్ చెప్పాడు. అప్పటికి జెర్సీ షూటింగ్ మొదలైంది. షూటింగ్ పూర్తయ్యేలోపు కథను డెవలప్ చేయమన్నా. అలా జెర్సీ తరువాత గ్యాంగ్‌లీడర్ మొదలైంది.
విక్రమ్ స్క్రీన్‌ప్లే కాంప్లికేటెడ్ కదా?
-విక్రమ్ చేసిన అన్ని సినిమాల్లో లెస్ కాంప్లికేటెడ్ ఇదే అనుకుంటున్నా. ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉన్నా -కాంప్లికేటెడ్ అనిపించవు. బహుశ, విక్రమ్ అన్ని సినిమాల్లోకీ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సినిమా కూడా ఇదే కావొచ్చు.
టైటిల్ సజెస్ట్ చేసిందెవరు?
-అది విక్రమే. నేను జెర్సీ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నపుడు ఓసారి కలిశాడు. ఒక టైటిల్ అనుకుంటున్నా అన్నాడు. సహజంగానే ఏంటి? అంటూ ఆసక్తి చూపించా. గ్యాంగ్‌లీడర్ అన్నాడు. ఎగ్జైటింగ్‌గా అన్పించింది. ఓకె అనేశాను.
ఎగ్జయిట్ చేసే పాయింట్లు..?
-చాలా సినిమాల్లో రివేంజ్ కానె్సప్ట్ వైలెంట్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగులూ, ఫైట్స్ కామన్‌గా ఉంటాయి. అదే రివేంజ్ కానె్సప్ట్‌ని ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పడమే ఎగ్జయిటింగ్ పాయింట్ అనిపించింది. పైగా -ఐదుగురు ఆడాళ్లకి రివేంజ్ రైటర్‌గా ఉండటం. ఇలాంటి పాయింట్లే నాలో ఆసక్తి కలిగించాయి. రేపు మిమ్మల్నీ థియేటర్‌లో మరింత ఎగ్జైట్‌కు గురి చేస్తాయి.
కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు?
విక్రమ్ స్టోరీ నేరేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. కథ వింటున్నపుడు నాకు కలిగిన ఎంజాయ్‌మెంట్లో సగం ఆడియన్స్‌ని రీచ్ అయినా, సినిమా సూపర్ హిట్టు ఖాయం.
ప్రొడక్షన్స్ వాల్యూస్?
-మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం ఉంటుంది. ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన అనుభవం వాళ్లది. ఈ ప్రాజెక్టు విషయంలోనూ బడ్జెట్ కాంప్రమైజేషన్ లేదు. బెస్ట్ అవుట్‌పుట్ కోసమే అంతా కష్టపడ్డాం.
సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి పాత్ర..?
సినిమాలో లక్ష్మి, శరణ్య అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తారు. కొన్ని సన్నివేశాల్లో నా కామెడీ టైమింగ్‌కి, వాళ్ల కామెడీ టైమింగ్‌కి భలే సింకైంది. నిజానికి వాళ్లే నాకు స్ట్రెంగ్త్. ఆ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
కార్తికేయ నెగెటివ్ రోల్..?
సినిమాలో కార్తికేయ క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముందు తను చేస్తాడా? లేదా? అనుకున్నా. కాని విక్రమ్ వెళ్లి స్క్రిప్ట్ చెప్పగానే కార్తికేయ ఓకె అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అది. ఎవరైనా హీరో చేస్తేనే బాగుంటుందన్న ఆలోచన మాది. సినిమా చూశాక, ఆ పాత్ర గురంచే ఎక్కువ మాట్లాడతారు.
అనిరుధ్ మ్యూజిక్?
-అనిరుధ్ మ్యూజిక్‌లో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు అతన్ని తీసుకున్నాం. పైగా విక్రం కూడా అనిరుధ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడట. జెర్సీకి అనిరుథ్ కరెక్టేనా అని ఆలోచించాం. కానీ ఈ సినిమాకు పెద్దగా డిస్కస్ చేయకుండానే ఫైనల్ చేసేశాం.
జెర్సీ సక్సెస్‌తో హ్యాపీగా ఉన్నారా?
జెర్సీ విషయంలో నేను ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. తెలుగు సినిమాకున్న కొన్ని పరిధులు దాటి మేము చేసిన ప్రయోగమది. వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రైట్స్ 30 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అది. ఇపుడు అన్ని భాషల్లో రీమేక్ అవుతోంది. మరోపక్క చైనాలో విడుదలవుతోంది. ఇలా మేకర్స్‌కు ప్రాఫిటబుల్ సినిమా.
బైలింగ్వల్ చేస్తారా?
-ఇంతకుముందు నేను బైలింగ్వల్ చేయడానికి ప్రయత్నించినపుడు ఏంజరిగిందో తెలుసు. అందుకే నాకు బైలింగ్వల్ అంటే భయం. అదిరిపోయే స్క్రిప్ట్‌తో మంచి సెటప్ కుదిరి, అలాగే రెండు రాష్ట్రాలకూ బాగుంటుంది.. అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయంటే బైలింగ్వల్ సినిమా చేస్తా. అంతేకాని ఇంకోచోట కలెక్షన్స్ వస్తాయి కదా అని బైలింగ్వల్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్.
జెర్సీ, గ్యాంగ్‌లీడర్. ఏది కష్టమైంది?
జెర్సీ కోసం మానసికంగా, శారీరకంగా కష్టపడాల్సి వచ్చింది. గ్యాంగ్‌లీడర్ విషయంలో అలా కాదు. విక్రమ్‌కుమార్ కారణంగా సినిమా షూటింగ్ స్మూత్‌గా హ్యాపీగా గడిచిపోయింది.
11 ఏళ్ల కెరీర్. జర్నీ ఎలావుంది?
-అంత టైమ్ అయ్యిందా? అనిపించేలా కాలం తెలీకుండానే గడిచిపోతుంది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇనే్నళ్లుగా నన్ను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు.
తరువాతి ప్రాజెక్టులు..?
- ‘వి’ సినిమా రెండో షెడ్యూల్ 15నుంచి థాయిలాండ్‌లో మొదలవుంతుంది. నెక్స్ట్ మూడు సినిమాలు లైన్‌లో వున్నాయి. అందులో నెక్స్ట్ ఏదనేది ఇంకా ఫిక్సవ్వలేదు. ‘వి’ తరువాతే వాటి గురించి ఆలోచిస్తా.

-మహాదేవ