సబ్ ఫీచర్

ఫలిస్తున్న భారత్ దౌత్యనీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ క్రియాశీల దౌత్యం కారణంగా క్రమంగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నది. ఆగస్టు 3,4 తేదీల్లో ఆ దేశంలో జరిగిన దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ ఏడవ సమావేశం ఈ అంశాన్ని స్ప ష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశంలో పాల్గొన్న మన హోంశాఖమంత్రి రాజనాధ్‌సింగ్ ఎంతో దృఢం గా, స్పష్టంగా పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల అనుసరిస్తున్న నేరపూరిత ధోరణిని ఆ దేశం గడ్డమీదే ఖండించారు. పైగా అటువంటి ధోరణులను అన్ని దేశాలు ఖండించాలని కూడా పిలుపునిచ్చారు. గతంలో భారత నాయకులెవరూ అంతర్జాతీయ వేదికలపైనుండి ఇంత కటువుగా పాకిస్తాన్‌ను వేలెత్తి చూపలేదు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని ప్రముఖ దినపత్రిక దిన్యూస్ పతాక శీర్షికలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్, అఫ్గాని స్థాన్, బంగ్లాదేశ్‌లు చేతులు కలిపినట్టు పేర్కొనడం గమనార్హం. 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరిగినప్పుడు కేవలం భారత్ మాత్రమే పాక్‌కు వ్యతిరేకంగా గొంతెత్తింది. ఇప్పుడు మరో రెండు దేశాలు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లు బహిరంగంగా పాకిస్తాన్ ధోరణుల పట్ల నిరసన వ్యక్తం చేయగా మిగిలిన దేశాలైన నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, భూ టాన్‌లు సైతం ఆ దేశంతో అంతగా ఏకాభిప్రాయంతో లేవు.
‘ఉగ్రవాదులను మృతవీరులుగా కీర్తించరాదు. ఉగ్రవాదంలో మంచి-చెడు ఉగ్రవాదం అంటూ లేదు. ఉగ్రవాదం ఉగ్రవాదమే’ అంటూ ఈ సమావేశంలో రాజనాథ్‌సింగ్ స్పష్టంచేసారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసి రావాలని మిగిలిన సార్క్ సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్ పేరును ఆ యన స్పష్టంగా ఉదహరించకపోయినప్పటికీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలన్నారో అక్కడున్న వారందరికీ తెలుసు. కశ్మీర్‌లో గత నెల భారత్ భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెం దిన కరుడుగట్టిన ఉగ్రవాది బుర్హన్‌వనిని ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి ఆయన కరకుగా ఈ వ్యాఖ్యలు చేసారని అంతా గ్రహించారు. అయితే నేరుగా రాజనాధ్‌సింగ్ వ్యాఖ్యలను ఖండించకపోయినా స్వా తంత్య్ర పోరాటానికి ఉగ్రవాదానికి మధ్య తేడా వుంది అంటూ తమ దేశ వైఖరిని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చౌదరి నిస్సార్ అలీఖాన్ సమర్ధించుకున్నారు. ‘కాశ్మీర్‌లో అమాయక ప్రజలకు వ్యతిరేకంగా జరుపుతున్న హింస ఉగ్రవాదానికి దారితీస్తున్నది’ అంటూ నిర్లజ్జగా తమ దేశ వైఖరిని వ్యక్తం చేసారు.
తన ప్రసంగం పూర్తి కాగానే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనానికి హాజరుకాకుండానే అనుకున్న దానికన్నా ముందుగా రాజనాధ్‌సింగ్ ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. విందు ఏర్పాటు చేసినా ఆయన హాజరు కాకపోవడాన్ని గమనిస్తే రాజనాధ్‌సింగ్ హాజరై వుంటే అవమానం జరిగేదని అర్ధమవుతున్నది. ఇటీవలి చరిత్రలో పాకిస్తాన్ ఈ సార్క్ సమావేశంలో ఏకాకి అయినట్టు మరెక్కడా కాలేదని పాకిస్తాన్ టుడే పత్రిక సంపాదకత్వంలో తెలిపింది. పాకిస్తాన్- అఫ్గానిస్థాన్‌ల మధ్య అప్రకటిత యుద్ధం జరుగుతున్నట్టు ఆదేశ రాయబారి ప్రకటించారు. ఢాకాలో జమాయితే ఇస్లామీ నాయకులను ఉరి తీయడాన్ని పాకిస్తాన్ నేషనల్ అ సెంబ్లీ ఖం డిస్తూ తీర్మానం ఆమోదించినప్పటినుండీ పాకిస్తాన్-బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయ. ఈ సదస్సుకు తమ హై కమిషనర్‌ను మాత్రమే పంపడం ద్వారా పాకిస్తాన్ పట్ల తమ విముఖతను బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. మరోవంక అంతర్జాతీయంగా కీలకమైన ఇరాన్, అమెరికాతో సైతం పాకిస్తాన్ సంబంధాలు బెడిసికొడుతున్నాయి. పాకిస్తాన్‌కు అందచేయగలనని ఇచ్చిన హామీలను సైతం అమెరికా కుదిస్తున్నది. సార్క్ సదస్సు ప్రారంభమైన రోజుననే తీవ్రవాదులను కట్టడి చేయడంలో పాకిస్తాన్ తగు కృషి చేయడం లేదంటూ 300 మిలియన్ల డాలర్ల సహాయాన్ని నిలిపి వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దాదాపుగా అన్ని పొరుగు దేశాలతో పాకిస్తాన్‌కు సంబంధాలు సవ్యంగా లేవని ఈ సందర్భంగా వార్తా కథనాలు వస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలోని అఫ్గానిస్థాన్-పాకిస్తాన్‌లు పరస్పరం తరచు ఆరోపణలకు దిగుతున్నాయి. ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేసిన అనంతరం ఆ దేశంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి పాకిస్తాన్ చెప్పుకోదగిన ప్రయత్నాలు చేయడం లేదు.
ప్రస్తుతం పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కలిగి వున్న ఏకైక దేశం చైనా మాత్రమే అని చెప్పవచ్చు. అయితే ఆ దేశంతో కూడా సంబంధాలు స్థిరంగా, సమాన హోదాలో లేవన్నది స్ప ష్టం. కేవలం భారత్‌పై వత్తిడి పెంచడం కోసం, పాకిస్తాన్ అమెరికా సైనిక స్థావరంగా మారకుండా నిరోధించడం కోసం చైనా వ్యూహాత్మకంగా ఆ దేశాన్ని దువ్వే ప్రయత్నం చేస్తున్నది. సార్క్ సదస్సుకు ఏ దేశం కూడా సీనియర్ మంత్రులను తమ ప్రతినిధిగా పంపలేదు. కేవలం రాజ్‌నాధ్‌సింగ్ మాత్రమే హాజరైన సీనియర్ మంత్రి. సదస్సుకు పది కిలో మీటర్ల దూరంలో భార త్ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా పేర్కొన్నవారి నాయకత్వంలో రాజ్‌నాధ్‌సింగ్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. ఆయ న పాకిస్తాన్ పర్యటనకు వస్తే జాగ్రత్త అనే హెచ్చరికలు జారీ చేసారు. పాకిస్తాన్ ప్రభుత్వ సైనిక మద్దతుతోనే ఈ విధంగా బహిరంగంగా ఉగ్రవాదులు భారత్‌వ్యతిరేక ప్రదర్శనలు చేసారని అందరికీ తెలిసిందే. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులలో రాజనాధ్‌సింగ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం సముచితం కాదని పలువురు సూచించారు. ఆయన పర్యటనను రద్దు చేసుకోవాలని కూడా కోరారు. అయినా ఆయన తన పర్యటనను కొనసాగించడమే కాకుండా పాకిస్తాన్ గడ్డపై ఆ దేశం ఉగ్రవాదంపట్ల అనుసరిస్తున్న అభ్యంతరకర వైఖరిని స్పష్టంగా ఖండించి వచ్చారు. ఒకవిధంగా ఆయన పర్యటన సాహసోపేత యాత్రగా పేర్కొనవచ్చు. ఇదే సమయంలో నలుగురు ఉద్యోగ విరమణ చేసిన పాకిస్తాన్ సైనిక అధికారులు, ఒక రష్యా పైలట్ ప్రయాణిస్తున్న ఎం-17 యుద్ధ హెలికాప్టర్ అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆధీనంలో వున్న భూభాగంలో కూలిపోయింది. ఈ హెలికాప్టర్‌లో పాకిస్తాన్ సైన్యాధిపతి రషీల్ బంధువు ఒకరు వున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయ. అయితే పాకిస్తాన్ సైన్యం ఆ కథనాలను ఖండించి అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్తాన్‌ల మీదుగా రష్యా విమానం వెడుతుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నది. పాకిస్తాన్ బ్లాక్‌లిస్టులో వుంచిన అమెరికాకు చెందిన ఎఫ్‌ఐబి అధికారి మాథ్యూ క్రెయిగ్ బారెట్‌ను ఇస్లామాబాద్‌లోని ఒక అతిథి గృహం నుండి అరెస్టు చేసినట్టు పాక్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ఇదే సమయంలో ప్రకటించారు. పాకిస్తాన్‌లో కీలక ప్రదేశాలలో అనుమానాస్పదంగా సం చరిస్తున్న ఆయన్ను 2011లో బ్లాక్‌లిస్టులో చేర్చి దేశంనుండి పంపివేసారు. అయితే ఇప్పుడు నకిలీ అనుమతి పత్రాలతో దేశంలోకి ప్రవేశించినట్టు చెబుతున్నారు.
ఇలావుండగా నేపాల్‌లో ప్రచండగా పేరొందిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్) నాయకుడు పుష్పకమల్ దహల్ తిరిగి ప్రధానమంత్రి కావడం కూడా సార్క్ సద స్సు జరుగుతున్న సమయంలోనే జరిగింది. ఈ పరిణామం పాకిస్తాన్‌కు కొంచెం సానుకూల సంకేతాలు పంపే అవకాశం కలిగిస్తున్నది. ఆయన చైనాకు సన్నిహితుడు కావడమే అందుకు కారణం. ఇదివరలో ఆగస్టు 2008 నుండి మే 2009 వరకు నేపాల్ ప్రధానమంత్రిగా వున్న ఆయన సైన్యాధిపతిని తొలగించడంలో ఏర్పడిన వివాదంతో పదవిని కోల్పోయారు. తనను పదవి నుండి దించి వేయడం కోసం భారత్ కుట్ర పన్నిందని ఆయన అప్పట్లో ఆరోపణలు చేసారు. అయితే 2014లో భారత ప్రధాని మోదీ నేపాల్‌లో జరిపిన పర్యటనను చారిత్రాత్మకమైనదిగా ఆయన కొనియాడారు. నేపాల్ ప్రజల హృదయాలను మోదీ కదిలించివేసారని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆయన భారత్‌తో ఏవిధంగా వ్యవహరిస్తారనేది పాకిస్తాన్‌కు కూడా ఆతృత కలిగిస్తున్న అంశం.
బంగ్లాదేశ్ ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తుండడం ఉగ్రవాదులకు ఆశ్రయం వనరులను కల్పిస్తున్న పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తున్నది. జూలై 1న ఢాకాలోని ఒక హోటల్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి కారకులైన తమిన్ అహ్మద్ చౌదరి, దేశంలో లౌకిక భావాలు గల రచయిలు, మేధావులపై దాడులు జరుపుతున్న మాజీ సైనిక మేజర్ సయ్యద్ మహ్మద్ జియావుల్ హక్‌లను పట్టి ఇచ్చిన వారికి 25 వేల డాలర్ల బహుమతులను బంగ్లాదేశ్‌ప్రభుత్వం ప్రకటించింది. ఢాకాలో ఉగ్రవాద దాడిని తామే చేసామని ఐఎస్ ప్రకటించినా ఇది స్థానిక ఉగ్రవాదుల పని అని బంగ్లాదేశ్ స్పష్టం చేయడం గమనార్హం.
మయన్మార్‌లో భారత్ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఆర్థిక మండలి చైనా ఏర్పాటు చేయనున్న మండలికి 80 కిమీ దూరం లో కావడంతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. ఇక భారత్ అభ్యంతరం చెప్పడంతో 1.4 బిలియన్ డాలర్లతో ఓడరేవు నిర్మాణం కోసం చైనా కంపెనీకి ఉచితంగా కేటాయించిన 30 ఎకాల భూమిని శ్రీలంక వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలు సార్క్ దేశలలో పెరుగుతున్న భారత సహకార ప్రాభవాన్ని వెల్లడి చేస్తుండగా పాకిస్తాన్ ఏకాకి అవుతోంది. కాశ్మీర్‌లోయలో ఎంతగా యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా స్థానిక యువకులు ఉగ్రవాదులుగా మారకపోతుండడంతో పాకిస్తాన్‌నుండి ఉగ్రవాద చర్యలకు యువతను పంపించాల్సి వస్తున్నది. ఉగ్రవాదం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమమవుతున్న సమయంలో ఫ్రభుత్వ అండదండలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద బృందాలు బహిరంగంగా సంచరిస్తుండడంతో అంతర్జాతీయ సమాజం ముందు ఆ దేశం దోషిగా నిలబడవలసి వస్తున్నది. ఈ విషయమై భారత్ అనుసరిస్తున్న స్పష్టమైన దౌత్యనీతి విశేష ఫలితాలను ఇస్తున్నది. ఈ విషయా న్ని సార్క్ సదస్సు స్పష్టం చేసింది.

-చలసాని నరేంద్ర