సబ్ ఫీచర్

ఆత్మవిశ్వాసంతో అందలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్లు లేవు..
పుట్టుకతోనే వైకల్యం..
లేచి నిలబడటమే కష్టం..
కానీ ఆ చిన్నారి నడవటమే కాదు.. ఏకంగా మోడలింగ్ చేస్తోంది. ఆ చిన్నారి పేరు డెయిసీ మే దిమిత్రి. దిమిత్రికి పుట్టుకతోనే వైకల్యం. కాలి ఎముకలను అరుదైన వ్యాధి కబళించింది. 18 నెలల వయసుకే రెండు కాళ్ళనూ కోల్పోయింది. అయితే కొండంత ఆత్మస్థైర్యం తనకు అండగా నిలిచింది. కృత్రిమ కాళ్లతో నడుస్తూ మోడల్‌గా రాణించేలా ముందుకు నడిపించింది. ఇది తొమ్మిది సంవత్సరాల డెయిసీ మే దిమిత్రి స్ఫూర్తిగాథ.
దిమిత్రి స్వస్థలం బ్రిటన్‌లోని బర్మింగ్హమ్. పుట్టుకతోనే తనకు ఫిబ్యులర్ హెమిమెలియా సోకింది. ఈ వ్యాధి వల్ల కాలి ఎముకలో కొంత భాగం లేదా పూర్తిగా కనుమరుగవుతుంది. 50 వేలమందిలో ఒకరిని మాత్రమే ఇలాంటి లోపం కలుగుతుంది.
పద్దెనిమిది నెలలు వచ్చేసరికి దిమిత్రి లోపం మరింత తీవ్రమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు అలెక్స్, క్లెయిర్ దిమిత్రి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మోకాలిపై వరకూ రెండు కాళ్లూ తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్‌కు వారు అంగీకరించారు. దీంతో కృత్రిమ కాళ్లే దిమిత్రికి శరణ్యమయ్యాయి. వైకల్యం ఏనాడూ దిమిత్రికి అవరోధం కాలేదు. చదువుతోపాటు జిమ్నాస్టిక్స్‌లోనూ తను ప్రావీణ్యం సాధించింది. అంతేకాదు.. ఎనిమిది సంవత్సరాల వయసులోనే రివర్ ఐలాండ్ బ్రాండ్‌కు మోడలింగ్‌తో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బ్రిటన్‌లోని దిగ్గజ వస్త్ర విక్రయ సంస్థ బోడెన్‌కు మోడల్‌గానూ పనిచేస్తోంది. నైకీ, మ్యాటలాన్ వంటి బ్రాండ్లను తను ప్రయోట్ చేసింది. సెప్టెంబర్ 8న దిమిత్రి మోడలింగ్ కెరియర్‌లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించబోతోంది. ప్రఖ్యాత న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తను తళుకులీనింది. ప్రఖ్యాత మోడల్స్ వాక్ చేయాలనుకునే ర్యాంప్‌పై రెండు కాళ్లూ లేని చిన్నారి దిమిత్రి ర్యాంప్ వాక్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఆ చిన్నారి ర్యాంప్‌పై నడవడం మాకెంతో గర్వకారణం అని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ప్రకటించింది. మరోవైపు ప్రఖ్యాత పారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ దిమిత్రి మెరవబోతోంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌పై సెప్టెంబర్ 27న ఈ షో జరగబోతోంది. చిన్నారుల ఫ్యాషన్ బ్రాండ్ ‘లూలూ ఎట్ జిజి’ను దిమిత్రి ప్రమోట్ చేయబోతోంది.
లండన్‌లోని ఓ ఫ్యాషన్ షోలో దిమిత్రిని ‘లూలూ ఎట్ జిజి’ ఫౌండర్ ఎని హెజెడస్ బ్యూరస్ చూశారు. ఆత్మవిశ్వాసంతో దిమిత్రి వేస్తున్న అడుగులను చూసి ఆమె మంత్రముగ్ధులయ్యారు. న్యూయార్ ఫ్యాషన్ వీక్‌లో దిమిత్రి మెరవకముందే.. మెరవబోతుందనే వార్తలే దిమిత్రికి పారిస్ అవకాశాలన్ని తెచ్చిపెట్టాయని దిమిత్రి తండ్రి అలెక్స్ చెప్పాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో నడిచిన దిమిత్రి.. పారిస్‌లో ర్యాంప్ వాక్ చేసేందుకు అవసరమైన కృషిని ఇప్పటికే మొదలుపెట్టింది. ఆ పాపను చూసినవాళ్లు జాలిపడరు. ‘అద్భుతం.. మేమూ ఆమెలా అవ్వాలి’ అనుకుంటారు. తనలోని ఆత్మవిశ్వాసం, ఉత్సాహం అలాంటిది. దిమిత్రి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తను చేసే పనిని ఎంతగానో ప్రేమిస్తుంది. అంతకంటే ఎక్కువగా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై అడుగులు వేస్తూ ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తోంది.