సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుసేతులు కట్టివేసి వీని నిక్కడ విడిచి పోవుదము’’ అనెను. అంత వారతని కాలుసేతులు బంధించి యక్కడ విడిచిపోయిరి. వారు కొంతదూరము వెడలిన పిమ్మట మూడవ దొంగ తిరిగివచ్చి, ‘అయ్యో! పాపము! నీవెంత సంకట పడితివోకద! క్షణములో నిన్ను విడిచిపెట్టెదను’ అని కట్లు విప్పివేసి, ‘‘నాతో రమ్ము. నీకు దారిచూపెదను’’ అనెను. వారిరువురు నటుల జాలదూరము నడచిన పిమ్మట రాజవీధి కాన్పించినది. అంతట, ఆ దొంగ ‘‘అదిగో, నీ యిల్లు. ఈ త్రోవను బొమ్ము, ఇల్లు చేరెదవు’’అనెను.
ఆ మనుష్యుడు తన కృతజ్ఞతను సూచించుచు నిట్లు పలికెను: ‘‘అయ్యా! నీవు నాకు మహోపకారము చేసినావు. నేను నీ మేలు మఱువను. నాతోగూడ మా యింటికి రావా?’’అందులకు దొంగ యిట్లు సమాధానము చెప్పెను: ‘‘వలనుపడదు, నేనక్కడకు రాజాలను. వచ్చిన పక్షమున బోలీసువారు నన్ను బట్టుకొనగలరు.’’
ఈ సంసారమే అడవి. ప్రకృతి గుణములగు సత్త్వరజస్తమోగుణములే ముగ్గురు దొంగలు. జీవుడే యాత్రికుడు. ఆత్మజ్ఞానమే వానిసొత్తు. తమోగుణము వానిని సంసారమను సంకెలలచే బద్ధుని జేయుచున్నది, కాని సత్త్వగుణము వానిని రజస్తమస్సుల బారినుండి రక్షించును. సత్త్వగుణము నాశ్రయించి జీవుడు రజస్తమోగుణ సంజనితములగు కామక్రోధాదులనుండి విడివడును; సత్త్వగుణమిట్లు జీవుని సంసారబంధ విముక్తుని జేయును. కాని సత్త్వగుణము సైతము దొంగయే. ఐనను, అది జీవునకు పరమాత్మను జేరుమార్గమును జూపి, ‘‘అదిగో, నీ యిల్లు’’అని తెలుపును. అంతట, అదియు సదృశ్యమగును. ఈ సత్త్వగుణము సైతము పరమాత్మ సామ్రాజ్యములోనికి బోజాలదు.
పురోహితుడు: వాని సేవకుడు
1110. ఒక పురోహితుడు తన శిష్యుడున్న యొక యూరికి బోవుచుండెను. తనయొద్ద నెవ్వరును పరిచారకులు లేకుండుటచే దారిలో నొక మాదిగ కాన్పింపగా నాతడు వానితో నిట్లనియెను. ‘‘ఓరుూ! నీవు నా సేవకుడుగానుండి నాతో వచ్చెదవా? నీకు మంచి తిండి దొరకును, నిన్ను జక్కగా పోషించెదను, రమ్ము.’’ అందులకు మాదిగ యిట్లనెను: ‘‘స్వామీ, నేను కడజాతివాడను. మీ సేవకుడనని యెట్లు చెప్పుకొనగలను?’’ అంతట పురోహితుడు వానికిట్లు ధైర్యము చెప్పెను:
‘‘ఫరవా’లేదు. నీవెవ్వడవో యెవ్వరికిని జెప్పకుము. ఎవరితోడను మాటాడకుము. ఎవరి పరిచయము కలుగజేసికొనకుము.’’ మాదిగ ఒడంబడినాడు. సాయంకాలమా పురోహితుడు తన శిష్యునింటిలో సంధ్యావందనము చేసికొనుచుండగా మఱియొక బ్రాహ్మణుడు వచ్చి, పురోహితుని సేవకుని జూచి, ‘‘ఓరుూ! నా చెప్పుల నక్కడ వదలితిని, పోయి తీసికొని రమ్ము’’అనెను. ఈ సేవకుడు తన యజమానుని యుపదేశముననుసరించి మాటాడ లేదు- కదల లేదు. బ్రాహ్మణుడు మఱియొకసారి చెప్పినాడు. అప్పుడును, నాతడూరకుండెను. బ్రాహ్మణుడు పదే పదే చెప్పినను, ఆ సేవకుడు కదలడయ్యెను. చివరకు బ్రాహ్మణుడు కోపముపట్టజాలక,
‘‘ఓరీ! నీవు బ్రాహ్మణుని యాజ్ఞను తిరస్కరింప సాహసించితివిగా! నీ పేరేమి? నీవు చండాలుడవాయేమి? నిజము చెప్పుము’’అనగా మాదిగ గజగజ వణకుడు, మొగము తేలవేసి, పురోహితుని వంక జూచి, యిట్లు మొఱపెట్టెను:

- ఇంకాఉంది