సబ్ ఫీచర్

ఆనందం అద్భుత వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా ఒక విషయాన్ని, ఒక లక్ష్యాన్ని సాధించినపుడు మాత్రమే సంతోషించే అలవాటును మనం మానుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. జీవితంలో ప్రతిక్షణం నుండి, మీరు చేసే చిన్న చిన్న పనులనుండి, ఆటంకాన్ని అధిగమించడం నుండి సంతోషాన్ని పొందడం అలవర్చుకోవాలి. మీకు లేని వాటి గురించి ఆలోచించేకంటే ఉన్నవాటి పట్ల సంతృప్తిపడాలి. సంతోషాన్ని వాటితో ముడిపెడితే అది మనకు ఎప్పుడూ దొరకదు.
బట్టలు, నగలు, ఫర్నిచర్, లేటెస్ట్ మోడల్స్ పేరుతో మొబైల్స్, వెహికల్స్ లాంటి వాటికి మీరే కొన్ని హద్దులు పెట్టుకోవాలి. కోరికలు తగ్గినపుడు ఉన్నవాటి మీద మన దృష్టి మళ్ళించడానికి అవకాశం ఉంటుంది.
మనం వర్తమానంలో జీవించాలి. ఇప్పటికిప్పుడు పది నిమిషాల్లో మీరేమి ఆలోచించి వుంటారు. ఒకసారి గుర్తుతెచ్చుకోండి. అది జరిగిపోయిన విషయమైనా వుంటుంది. మిమ్మల్ని ఎవరు ఎన్నిసార్లు అవమానించారు లాంటివి లేదా భవిష్యత్తులో ఏమి జరుగుతుందోననే ఆందోళన, ఉద్యోగం పోతుందేమో, కొడుక్కి మంచి కాలేజీలో సీటు దొరకదేమో లాంటివి అయి వుంటాయి. ఇటువంటి ఆలోచనలు మనల్ని విపరీతమైన ఆందోళనకు, ఒత్తిడికి గురిచేస్తాయి. ఇవి ప్రస్తుత విషయాలనుండి మన దృష్టిని మళ్ళిస్తాయి. ప్రస్తుతంలో వుండే ఆనందాన్ని కూడా మనకు అందకుండా చేస్తాయి. మన చేతుల్లో వుండేది వర్తమానం ఒక్కటే. వర్తమానంలో మాత్రమే మనం మార్పులు చేసుకోగలం. ఇప్పుడు ఈ క్షణం దీనిమీదే దృష్టిపెట్టడం నేర్చుకోండి.
ఒకవేళ మీ ఆలోచనలు గతంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంటే- స్టాపిట్ అని మీకుమీరే గట్టిగా ఫుల్‌స్టాప్ పెట్టుకోండి. రోజూ ఒకేలా బతకడం విసుగు కలిగిస్తుంది. రోజువారి దినచర్యలో మీకు సాధ్యమైన మార్పులు చేసుకోండి. స్నేహితులతో కలసి పిక్నిక్‌కు వెళ్ళడం, చిన్న పార్టీలు చేసుకోవడం అలవాటు లేకపోయినా మార్నింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఆప్తులు అనుకున్నవారికి నచ్చిన బహుమతులు ఇచ్చి ఆనందపరచడం లాంటివి జీవితానికి ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తాయి.
చాలామంది చేసే పని ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడితే మనం సాధించింది చాలా తక్కువ అనిపిస్తుంది. మీ విజయాల పట్ల మీకు అసంతృప్తివుంటే ఇంకా మీరు బాగా కష్టపడాలి. అనుకున్నది సాధించాలి. అంతేగాని, పోలికలు ససేమిరా అవసరం లేదు. పోల్చుకున్నకొద్దీ కోపం, ఒత్తిడి, ఈర్ష్యాసుయలు పెరిగి ఆత్మన్యూనతకు గురవుతారు. మళ్ళీ ఇలాంటి ఆలోచనలు కలిగినపుడు ఇక చాలు, ఈ ఆలోచనలు తర్వాత చేద్దాం అని మిమ్మల్నిమీరు గట్టిగా నియంత్రించుకోండి. ఏది ఏమైనా, ఏది జరిగినా అందులో మంచిని చూడడానికి ప్రయత్నించండి. ఆశావాదమంటే నల్లని మబ్బులు పట్టినపుడు వాటికున్న వెండి అంచుని చూడగలడు.
వాయిదా మనస్తత్వం మనలో చాలామందికి వుంటుంది. పనులు చేయడానికి బద్దకంవేసో, కొన్ని పనులు చేసేందుకు ఇష్టపడకో, భయపడో, అన్నింటికి తిధులు, నక్షత్రాలు, రాహుకాలాలు చూసుకుంటేనో వాయిదా వేస్తుంటారు. ఇవి తప్పని పరిస్థితి వచ్చినపుడు మనల్ని విపరీతమైన టెన్షన్‌లో పడవేస్తాయి. భవిష్యత్తులో నిర్వహించాల్సిన భారంలా అవి కనబడుతుంటే ప్రస్తుతంలో ఆనందం దొరకదు. అందుకే, ఎప్పటి పనిని అప్పుడే చేసుకోండి. ‘రేపు’అనే మాటను దరిదాపుల్లోకి రానీయకండి.
మనసు అశాంతిగా ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి. వినోదాన్ని పొందండి. మనల్ని సంతోషపరిచే వ్యక్తుల్ని మరువకండి.
స్నేహితులుగానీ, బంధువులు గానీ, ఆప్తులనుకున్న వారిని తలచుకోండి. అప్పుడప్పుడూ చరవాణి, మాధ్యమాల్లో మాట్లాడుకోండి. అలాగని నిరంతరం కాదు. నా అనుకున్న వారితో సన్నిహితంగా ఉండడం అనేది నచ్చిన పనిచేయడమే అవుతుంది. సంతృప్తి, ఆనందం సదా కలిగివుండాలంటే ఇవన్నీ పాటించాల్సిందే. అప్పుడే ఆనందం అందని ఆకాశం అవదు. అవలీలగా దొరికే అద్భుతవరం అవుతుంది. సంతోషం సగం బలం.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660