సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని యిది భయపడి గొఱ్ఱెవలె అతి దీనముగా నఱవసాగినది. కాని క్రొత్త పులి దీనినెట్లో యొక చెఱువు కడకు లాగికొనిపోయి నీటిలో తమ యిరువురి ప్రతిబింబమును చూపి యిట్లు ఘోషించెను: ‘‘చూడు, చూడు, నీ రూపు నారూపువలెనే యున్నది. నీవు నావలెనే పులివే. ఇదిగో, ఈ మాంసము తినుము.’’ ఇట్లనుచు బలవంతముగా దాని నోటిలో మాంసము గ్రుక్కినది. కాని రుూ ‘గొఱ్ఱెపులి’ మాంసము తినదయ్యె. దీనముగా నరచుచు దాను గొఱ్ఱెనని తెలుప మొదలిడెను.
ఐనను కొంచెము రక్తము రుచి చూడగనే దానియందణగియున్న వ్యాఘ్ర సంస్కారములు మొలకెత్తినవి. అంతనది మాంసము తిననారంభించెను. అపుడు క్రొత్తపులి దానిని జూచి యిట్లు గాండ్రించెను; ‘‘నావలెనే నీవును బులివని యిప్పుడైనను బోధపడినదా? ఛీఛీ! ఇన్నాళ్లు నీవీగొఱ్ఱెలతో మెలగుచు గడ్డిమేయుచుంటివి గదా! సిగ్గుసిగ్గు! అడవికి రమ్ము, పోదము.’’
గడ్డిమేయుట యనగా కామకాంచనములతో తృప్తిపడి యుండుట. గొఱ్ఱెవలె పరుగెత్తుటయనగా అల్పజనులవలె వ్యవహరించుట. క్రొత్త పులివెంట పోవుట యనగా హృదయమును వికసింపజేయగలుగు గురుని పదములను శరణుజొచ్చి యతని నాత్మీయునిగా గ్రహించుటయని యర్థము. నీళ్లలో దనప్రతిబింబమును జూచుటయనగా స్వస్వరూపమును గనుగొనుట. (గురుకటాక్షము లభించినచో ఆత్మలాభము గలుగునని భావం.)
రాజసందర్శనము
1113. ఆత్మవిచారము చేయుచు రాగా, మనస్సు పరిపూర్ణ ప్రశాంతి నొందును; అంత బ్రహ్మసాక్షాత్కారమగును.
ఒకడు (తన స్నేహితునితోగూడి) రాజసందర్శనము చేయునెంచెను. సప్తద్వారములకవ్వల అంతఃపురములో రాజుండెను. ఆ మనుష్యుడు మొదటి ద్వారముకడకువచ్చి యచట నాడంబరమైన దుస్తులతో గొందఱు భటులతో గూడుకొనియున్న యొకనిని జూచి, తన స్నేహితునితో, ‘‘ఇతడేనా రాజు?’’అని యడిగెను. స్నేహితుడు నవ్వి, ‘‘కాదు’’ అనెను. తరువాతనాతడు క్రమముగా మిగిలిన ద్వారములను దాటిపోవుచు ప్రతి ద్వారముకడను వైభవమున నొకరిని మించిన యొకరిని గాంచసాగెను.
ఆతడు రాచనగరులోనికి బోయిన కొలదియు దనకు గాన వచ్చిన జనుల వైభవము హెచ్చిపోవుచుండెను. ప్రతిద్వారము కడను దనకు గాన్పించినవాడు రాజేయని తలచి యాతడు తన స్నేహితుని ప్రశ్నింపసాగెను. కాని యాతడు ఏడవ ద్వారమునుదాటి రాజును ముఖాముఖిని జూచినప్పుడిక, ‘‘ఇతడేనా రాజు?’’అని తన మిత్రునడుగ నవసరమే లేకపోయినది. అఖండైశ్వర్యముతో విలసిల్లుచున్న రాజును గాంచగనే తాను నరేంద్రుని సమక్షమున నిలువబడియున్నట్లు వానికి సహజముగనే తోచినది.
బ్రహ్మసాక్షాత్కారము
బంగారు మురుగులను ధరించిన వితంతువు
1114. పతివ్రతము మహాభక్తురాలునునగు నొక స్ర్తి తన భర్తకును బిడ్డలకు నుపచారములుచేయుచు, సదా తన చిత్తమును భగవదాయత్తము చేసి గృహస్థ్ధర్మమును నిర్వర్తించుచుండెను. కొంత కాలమునకామెపతి గతించెను.

- ఇంకాఉంది