సబ్ ఫీచర్

ఇడ్లీ బామ్మకు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ‘రూపాయికి ఇడ్లీ’ అమ్ముతున్న బామ్మ గురించి మీడియా ద్వారా వినే ఉంటారు. సాధారణంగా హోటల్లో ఇడ్లీ 30 నుండి 60 రూపాయల వరకు ఉంటుంది. ప్రభుత్వ భోజన పథకాల్లో తప్ప ఎక్కడా ఇడ్లీ రూపాయికి దొరకదు. కానీ 80 సంవత్సరాల బామ్మ మాత్రం ఒక్క రూపాయికే ఇడ్లీని పెడుతూ అందరి కడుపు నింపుతోంది. ఈ ఇడ్లీకి ఎలాంటి జీఎస్టీ లేదు. ఇప్పుడు ఈ అవ్వే సోషల్ మీడియాలో సెనే్సషన్ అయ్యింది.
ఆనంద్ మహీంద్ర సాయం
రూపాయికే ఇడ్లీలను విక్రయిస్తూ పేదల కడుపు నింపుతున్న బామ్మగారి లైఫ్‌స్టైల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమాచారం మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రకు కూడా చేరింది. ముదిమి వయస్సులోనూ కష్టపడి వ్యాపారం చేస్తున్న ఈ బామ్మగారిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కట్టెల పొయ్యిపైనే ఆమె ఇడ్లీలు వేస్తున్న ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన బామ్మ వీడియోను ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్‌పై ‘ఇండియన్ ఆయిల్’ సంస్థ కూడా స్పందించింది. ఇండియన్ ఆయిల్ దేశానికి ఏ స్ఫూర్తితో సేవలను అందిస్తుందో.. అలాగే ఈ బామ్మ కూడా సమాజానికి సేవ చేస్తోంది. అలాంటి వారికి మా మద్దతు ఉంటుంది. ఆ అవ్వకు ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందిస్తాం అని తెలిపింది.
బామ్మ గురించి..
బామ్మ పేరు కమలతాళ్. తమిళనాడులోని వడివేలంపాల్యంలో నివసిస్తున్న కె. కమలతాళ్ 30 సంవత్సరాల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. కమలతాళ్ ఉమ్మడి కుటుంబంలో జీవించేది. అప్పట్లో ఇంట్లో అందరికీ కమలతాళే వంటలు చేసేది. కుటుంబ సభ్యులంతా ఉపాధి పనుల కోసం వేర్వేరు గ్రామాలు, పట్టణాలకు తరలిపోవడంతో కమలతాళ్ తన ఊరిలోనే ఇడ్లీలు విక్రయిస్తూ జీవిస్తోంది. 80 సంవత్సరాల వయస్సులోనూ ఆమె ఉదయానే్న నిద్రలేచి పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నమవుతుంది. పది సంవత్సరాల క్రితం ఆమె ఒక్కో ఇడ్లీ 50 పైసలకు మాత్రమే అమ్మేది. అయితే, 50 పైసల చెలామణి తగ్గడంతో ఆమెకు ఇడ్లీ ధరను రూ. 1కి పెంచక తప్పలేదు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఇడ్లీ ధర పెంచాలని చాలామంది సూచించారు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. ఇడ్లీ ధరలు పెంచితే ఆమెకు మంచి ఆదాయమే వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న పేదలు రూ. 15 నుంచి రూ. 20 చెల్లించడం కష్టమని, వారి కోసమే తక్కువ ధరకు ఇడ్లీలను విక్రయిస్తున్నామని ఆమె తెలిపింది. పదిరూపాయలతో అయితే కూలీలు కడుపునిండా ఇడ్లీలు తిని వెళ్లొచ్చు. కొన్నిసార్లు డబ్బులు లేకున్నా కూడా ఈ బామ్మ ఇడ్లీలను పెడుతుంది. ఇక్కడ ఇడ్లీలు ఒకసారి తింటే.. జేబులో ఎంత డబ్బులున్నా సరే.. ఈ బామ్మ దగ్గరే ఇడ్లీలు తింటారు. అంటే అవి ఎంత రుచిగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ బామ్మ ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు నిద్రలేస్తుంది. చట్నీ, సాంబారు చేస్తుంది. అందరిలా చట్నీని మిక్సీలో వెయ్యదు. రోటిలో రుబ్బుతుంది. ఉదయం ఆరు గంటలకల్లా కట్టెల పొయ్యి వెలిగిస్తుంది. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతుంది. బియ్యం, పప్పు, కొబ్బరి, నూనె, ఇతర సామాగ్రికి రోజుకు రూ. 300 దాకా ఖర్చు అవుతుందట. రోజూ ఇడ్లీలు అమ్మగా ఇతర ఖర్చులు పోను.. రూ. 200 లాభం ఉంటుందట. ఇడ్లీ పిండికి కానీ, చట్నీకి కానీ ఈ బామ్మ మిక్సీ వాడదు. రుబ్బురోలు వాడుతుంది. ఇంత పెద్ద వయస్సులోనూ పని బాగా చేస్తున్నారు అని ఆమెను అడిగితే.. ‘నా ఆహారపు అలవాట్లే నా ఆరోగ్యానికి కారణం’ అని చెబుతుంది కమలతాళ్. కమలతాళ్ రోజూ రాగి జావ తాగుతుంది. ఆమె అన్నం తినదట. కారణం బియ్యంలో సరైన పోషకాలు ఉండవని చెబుతుంది ఆమె. ఇలాంటి ఆహారం తినడం వల్లే ఆమె ఇప్పటికీ పనిచేయగలుగుతున్నాను అని చెబుతుంది కమలతాళ్. అంతేకాదు ఆమె చనిపోయేదాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతుందట.. ఎప్పటికీ ధర పెంచను అని కూడా చెప్పింది కమలతాళ్.