సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాప మాసన్న్యాసి స్మృతి తప్పి పడిపోవువఱకు నామదాంధుడు వానిపై బడి మోదినాడు. ఈ సన్న్యాసి యొక్క యవస్థను జూచిన మఱియొక మనుష్యుడు మఠమునకు బరుగెత్తిపోయి జరిగిన సంగతి నంతయు దెల్పెను. తోడి సన్న్యాసులీతడు పడియున్న తావునకు బరుగెత్తుకొని వచ్చిరి. వారాతని తమ భుజములపై నెత్తుకొని మఠమునకు దీసికొని వచ్చి యొక గదిలో బరుండబెట్టిరి. ఎంతసేపైనను నాతనికి స్మృతి రాకుండెను. చాల విచారించుచు నా సోదరులు వానికి విసరుచు, జల్లని నీటిని ముఖమున జల్లుచు, గొంచెము కొంచెముగా బాలను నోట బోయుచు వాని కుపచారములు చేయసాగిరి. క్రమముగా నాతడు తేఱుకొనెను. ఆ మహనీయుడు కండ్లు తెఱచి తన చుట్టు నున్న వారివైపు చూచినంతనే యాతడు తమ్ము గుర్తింపగలడో, లేడో తెలిసికొందమని యొక సన్న్యాసి, ‘‘స్వామిజీ! మీకు బాలుపోయుచున్నవారెవరో గుర్తింపగలరా?’’ అని బిగ్గఱగా నడిగెను. ఆ సాధుపుంగవుడు హీన స్వరమున నిట్లు పలికెను: ‘‘అన్నా గు-ర్తిం-ప-కే-మి? నన్ను గొట్టినవాడెవడో వాడే నాకు బాలుపోయుచున్నాడు!’’
జీవబ్రహ్మైక్యమును బొంది సమస్త శుభాశుభములకును, ధర్మాధర్మములకును అతీతుడైన వానికి గాని యిట్టి యద్వైత భావమలవడజాలదు.
పద్దయ్య దేవతార్చన
1121. ఒక గ్రామమున బద్మలోచనుడను నొక బాలుడుండెడివాడు. ఆయూరి వారందఱును వానిని ‘పద్దయ్య’ యని పిలిచెడివారు. ఆ యూరిలో బాడుపడిన యొక దేవాలయముండెను. దానిలో దేవతా విగ్రహమైనను లేదు. ఆలయము నిండ జెట్లు, చేమలు మొలచినవి. అది గుడ్లగూబలకును, గబ్బిలములకును ననుకూలమైన నివాసస్థలమైనది. ఒకనాడు సాయంకాలము హఠాత్తుగా నాపాడుపడిన గుడినుండి జేగంట మ్రోతలు, శంఖధ్వనులు జనులకు వినవచ్చినవి. ఎవరో భక్తుడు దానిలో దేవతావిగ్రహమును ప్రతిష్ఠించి యారాత్రికమును జరుపుచున్నాడు కాబోలు నని జనులాబాలగోపాలముత్సాహముతో నచటకి బరుగెత్తిరి.
వారందఱును జేతులు జోడించుకొని యాపవిత్ర ధ్వానములను వినుచు, దేవతా విగ్రహమును జూచుటకై గుడియెదుట నిరీక్షించుకొని యుండిరి. వారిలోనొకడు సాహసించి, లోన నేమి జరుగుచున్నదో తెలిసికొందమను తమకమున, దలుపుసందులో నుండి తొంగి చూచెను. గుడిలోపల పద్దయ్య జేగంట వాయించుచు, శంఖము నూదుచుండుట చూచి యతడాశ్చర్యపడినాడు. గుడిలో నేలయంతయు నెప్పటివలెనే యసహ్యముగా నుండెను. పూజకు దేవతావిగ్రహమా, ముందే లేదు. అంతనాతడిట్లు కేకవేసి చెప్పెను:
‘‘ఓ పద్దయ్యా! నీ గుడిలో బరమేశ్వర విగ్రహమా, లేదు! పెంటలను దొలగించి గుడిని శుభ్రము చేయనైనను జేయవైతివి! పదునొకండు గబ్బిలములును నందు జేరి దివారాత్రములు గీఱుగాఱుమనుచున్నవి.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి