సబ్ ఫీచర్

అన్యోన్యత పెరగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఉరుకుల, పరుగుల యుగంలో కాలంతో పరుగెట్టడం ప్రతి ఒక్కరికీ తప్పట్లేదు. ఇక భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే.. అంతేసంగతులు! మామూలు డే షిఫ్ట్ ఉద్యోగాలైతే ఫర్వాలేదు.. కనీసం రాత్రివేళ ఓ గంట సమయమైనా దొరుకుతుంది మాట్లాడుకోవడానికి.. అదే ఇద్దరికీ వేరు వేరు షిఫ్ట్‌లైతే.. ఇక అంతే.. కనీసం వారి మధ్య పలకరింపులు కూడా ఉండటం లేదు. బంధాల్లో యాంత్రికత, ఒత్తిడీ పెరిగిపోతోంది. ఫలితంగా అపార్థాలు, అభద్రతా, అపోహలూ.. అంతమించి వాదనలు.. ఇవన్నీ భార్యాభర్తల జీవితాన్ని నిస్సారంగా మార్చేస్తున్నాయి. దీన్నుంచి బయటపడాలంటే భార్యాభర్తల మధ్య బంధం కేవలం పడకగదికే పరిమితం కాదు.. మాటల్లోనూ, చేతల్లోనే ఒకరిపై మరొకరు అభిమానం చూపించుకోవాలి. కొందరు తమ భావాలను నేరుగా వ్యక్తపరచలేరు. అందుకని ఉన్న సమయంలో భాగస్వామిలోని సానుకూలతల్ని గమనించాలి. వాటిని వారికి మనస్ఫూర్తిగా చెప్పాలి. అప్పుడే అవతలివారి నుంచి స్పందన వస్తుంది.. కొద్దిగా ఆలస్యమవ్వచ్చు.. కానీ ప్రయత్నించాలి.
* ఇద్దరూ వేర్వేరు షిఫ్టుల్లో విధులకు వెళతారు. ఇంటికి అలసిపోయి వస్తారు. అప్పుడిక పనిచేసే తీరిక, ఓపికా ఉండదు. ఇలాంటప్పుడు ఒకరిపై ఒకరు పనులు చేయలేదు అని ఆరోపణలకు దిగొద్దు. వాదనలొద్దు.. ఇలాకాకుండా ఇంటి బాధ్యతల్ని ఇద్దరూ సమానంగా పంచుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. ఒకవేళ ఏదైనా కారణాలతో ఒకరు ఆ పనిని పూర్తిచేయలేకపోయినా ‘నువ్వు బిజీగా ఉన్నావేమో.. పనిచేసుకోండి’ అని చేదోడుగా ఉండాలి. అప్పుడే మీరు వారిపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అవతలివారికి అర్థం అవుతుంది.
* ఒక్కోసారి మీరు రోజంతా పని ఒత్తిడి, అలసటతో సతమతమవుతూ ఉంటే.. మీ భాగస్వామికేమో ‘నేను కనీసం ఒక్కసారైనా గుర్తు రాలేదా? నాతో ప్రేమగా మాట్లాడలేడా?’ అనిపిస్తుంది. ఈ సమయంలో ఇద్దరి వాదనా నిజమే కానీ.. ఎంత పనిలో ఉన్నా ఒక్క సెకను ఖాళీ చేసుకుని మీ పరిస్థితిని అవతలివారికి తెలియజేస్తే అర్థం చేసుకోగలుగుతారు. మాట్లాడలేకపోయినా ‘్భజనం చేశావా?’ అన్న చిన్న చిన్న సందేశాల మాటలు చాలు.. అవతలివారిలో అభద్రతా భావాన్ని తగ్గించడానికి, మీపై ప్రేమను పెంచడానికి..
* భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తుంటే.. వారాంతపు సెలవుని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటారు. రోజంతటినీ విశ్రాంతితోనే గడిపేయకుండా దాన్ని మధురంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. సెలవుని ఫోను, టీవీలు మింగేస్తాయి. ఫలితంగా ఎటువంటి మార్పులూ ఉండవు. అలాకాకుండా.. సాయంత్రానికల్లా ఇద్దరూ కలిపి కాసేపు పార్కుకో, ఇష్టమైన ప్రదేశానికి వెళ్లాలి. అక్కడ సేద తీరడమే కాదు.. ఒకరి భావాలను మరొకరు పంచుకునేందుకు చక్కని ఆహ్లాదకర వాతావరణం కూడా తోడవుతుంది. మెదడూ తేలికపడుతుంది. ఒత్తిడి దగ్గిపోతుంది. భార్యాభర్తలిద్దరి మధ్యలో ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోయి.. ప్రేమ పెరుగుతుంది. ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటే ఆ సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.