సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరయోగం
మృత్యోర్మా అమృతంగమయ
శ్రీ రామప్రభువు మాయా మానుషరూపంలో అవతరించిన వేద ధర్మం. ఆనంద స్వరూపం. మీరా ధర్మస్వరూపునియందు ఆత్మానుసంధానం చేయాలి. మీ నైతిక జీవితానికి ప్రేరణకావాలి ఆయన అనుసరించిన ధర్మం.
రాముడు లేనిచోటు లేదు. మనందరిలో ఆయన ఆత్మారాముడుగా వెలుగొందుతున్నాడు. ఆయన శాశ్వతుడు. రాముడంటే ఆయన నడిచిన బాట. ఆయన పాటించిన ఆదర్శాలు, ఆయన నిర్దేశించిన లక్ష్యాలు. జనం ఆయన పేరును జపిస్తారు. ఆయన రూపును పూజిస్తారు కాని, ఆయన ఆదేశాలను ఉపేక్షిస్తారు. ఆయన పాటించిన సత్యాన్నీ, ధర్మాన్నీ, క్రమశిక్షణను పాటించనప్పుడు రుూ జపాలూ పూజలూ కేవలం నాటకాలుగా భాసిస్తాయి. శుష్క కలాపాలుగా మారతాయి.
భగవంతుడు ప్రసాదించిన మీ అమూల్య జీవిత కాలాన్ని విందులూ, వినోదాలతో, సినిమాలూ, షికార్లతో, పోటీలూ, పందాలతో వృథా చేయకండి! భగవత్తత్వాన్ని గురించి శ్రద్ధగా మననం చేయండి!
అమృతత్వానికి తోవ చూపటానికే అనంతుడు అవతరించాడు అని మరవకండి! నాడూ, నేడూ ఇదే నిజం!
సహస్ర పాద్
భగవంతుడు విశ్వవిరాట్స్వరూపుడు. ఆయనను వేదాలు
3సహస్ర శీర్షా పురుషః
సహస్రాక్షః సహస్రపాద్2
అని కీర్తించాయి. ఇక్కడకు వచ్చిన వేలాది శిరస్సులూ, చేతులూ, కాళ్ళూ ఆయనవే. ఆయనను భజించు, నీవూ ఆయనా వేరుకాదు.
అణువణువూ ఆయనే
ప్రపంచం మనముందుంది. దానిని తెలుసుకోవచ్చు. అనుభవించవచ్చు. కాని దేవుడో? కనిపించడు. ఆయన సృష్టినిబట్టి ఆయన ఉనికిని గ్రహించాలి.
సంఘసేవ చేస్తున్నావు. సంఘం ఎక్కడుంది? మనం కలుస్తున్నది వ్యక్తులనే కాని సంఘాన్ని కాదే! కాని వ్యక్తులనుబట్టి సంఘం ఉనికిని గ్రహిస్తున్నాము. అలాగే సృష్టినిబట్టి సృష్టికర్తను గ్రహించు.

ఈ సృష్టిలో అణువణువూ ఆయన శక్తితో, ఆయన బలంతో, ఆయన ప్రశస్తితో నిండి వుంది. ప్రతి వ్యక్తీ. ప్రతి ప్రాణీ సుందరుడూ. సురుచిరుడూ అయిన ఆయన అనుగ్రహానికి నోచుకున్నవారే!
అంతటా ఆయనే
భగవంతుడెక్కడ వున్నాడు? పిల్లలు చేసే అల్లరిలో ఆయనే వున్నాడు. పక్షులు చేసే సందడిలో ఆయనే వున్నాడు. మనుషుల గుసగుసల్లో ఆయనే వున్నాడు. ఆకుల రెపరెపల్లో ఆయనే వున్నాడు. కొండలు చేసే ప్రతిధ్వనిలో ఆయనే వున్నాడు. అంతటా నిండివున్న ఓం కారంలోనూ ఆయనే వున్నాడు. ఆయన లేనిదెక్కడ? ఆయన అంతటా వున్నాడు. ఆయన అంతటా వున్నా, ఒకంతట చిక్కడు. ఆయనను గుర్తించటానికి ఋషులు అనేక మార్గాలు చెప్పారు. అయినా, ఆయనను కనుగొనటం ఏ కొద్దిమందికోమాత్రమే సాధ్యం. అన్నీ అనుగ్రహించేది ఆయనే.
ఊపిరి తెలిపే పాఠం
ఈ దేహంలో వున్నదెవరు? ఈ దేహానికి చైతన్యం యిస్తున్నదెవరు? నీవు వూపిరి పీల్చుకొనేటప్పుడు శ్రద్ధగా గమనిస్తే చాలు. దీనికి జవాబు దొరుకుతుంది. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో 3సోహం2(ఆయనే నేను) అని పలుకుతూ వుంది. నీవు వినిపించుకొన్నా, వినిపించుకోకపోయినా సరే, అది వినిపిస్తూనే వుంటుంది. నీవు మేలుకొన్నా, నిద్రపోయినా సరే, ఆ నాదం ఆగదు. ఇరవై నాలుగు గంటలూ ఈ సత్యాన్ని బోధిస్తూనే వుంటుంది నీ వూపిరి. ఊపిరి చెప్పే ఈ చిన్న పాఠాన్ని నీవు గ్రహించట్లేదు. దానినిబట్టి నీ గమ్యమేదో అర్థం చేసుకోవట్లేదు. ఇక శాస్త్రాలు చదివి సత్యాన్ని ఏం గ్రహిస్తావు?

ఇంకా ఉంది