సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోహం
తపస్సుచేసి తమ మనసులను పవిత్రంగా మలచుకొన్న ఋషుల నోట వెలువడ్డ మాట 3సోహం? సత్యదర్శనం చేసిన మహర్షులు శివోహం, 3సోహం2-అంటారు. 3నేనే శివుడను2 - అని దానర్థం. ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని రూపాలతో కన్పించినా, సత్యం ఒకటే(ఏకమే వా ద్వితీయం- అది ఒక్కటే. రెండు కాదు)అదే శివం. అందరిలోనూ గూఢంగా వున్నది అదే!
సంవత్సరాయ నమః
సంవత్సరమంటే ఏమిటి? భగవంతుని 3సంవత్సరాయ నమః2అని ఒక పేరున్నది. అనగా ప్రతి క్షణ స్వరూపుడు భగవంతుడే. సంవత్సర స్వరూపుడుగా రూపొందాడు. కాలం ఆయన రూపమే. కాలాతీతుడూ ఆయనే!
శివం
3సోహం2అన్న నాదం శ్వాసగా వెలువడుతూ వుండటమే జీవిత పరమార్థం. ఆ నాదం ఆగితే, ఈ దేహమే కళేబరం, అంటే 3శవ2వౌతుంది. దివ్య పరిమళాలను వెదజల్లేటప్పుడు అదే మందిరం, అంటే 3శివ2వౌతుంది.
చక్షోసూర్యో అజాయత
సూర్య కిరణలేశం ప్రతిఫలించి కంటిపైన పడినప్పుడు కన్ను చూడగలుగుతూ వుంది. అందుకే 3చక్షో సూర్యో అజాయత2అన్నారు పెద్దలు. సూర్యుడు కంటినుండే కలుగుతున్నాడు అని దాని అర్థం. ఆత్మ అన్ని యింద్రియాలనూ చైతన్యవంతం చేస్తుంది. దృష్టి సరిగాలేకపోతే కన్నుండి ఏంలాభం? సమం అంటే బ్రహ్మమే. సమదృష్టి అంటే కేవలం బ్రహ్మనే దర్శించటం. అన్నిచోట్లా, అన్నివేళలా బ్రహ్మాన్ని దర్శించగలగటం. ఏకత్వమే వౌలిక సత్యం. మిగిలిన అనుభవాలన్నీ పాక్షికం. వక్రం, అసత్యం.
బంధువర్గం
ఈ శరీరం పాంచభౌతికం (పంచభూతాలతో తయారయింది). అదే ప్రకృతి. నీవు పరమాత్మ స్వరూపం. ప్రకృతిలో చుట్టూ వస్తువులెన్నో వున్నాయి. అన్నీ పంచభూతాలనుండే ఏర్పడ్డాయి. వాటిల్లో నీ శరీరంకూడా ఒకటి. కనుక నీతోటి మానవులే కాదు, ప్రకృతిలోని వస్తువులన్నీ నీ దేహానికి చుట్టాలే.
అధి దైవతం ఈశ్వరుడు. జీవాత్మయే పురుషుడు. దేహమే ప్రకృతి.
ప్రకృతి-పురుషుడు
ప్రకృతి, పురుషుడు; సృష్టి, సృష్టకర్త- యివి పప్పుబద్దల వంటివి. రెంటి మధ్యనుంచే విత్తు మొలకెత్తుతుంది.
పరిపూర్ణత
జీవాత్మే పరమాత్మ. ఆ సంగతి గ్రహిస్తే మనిషి పరిపూర్ణమానవుడవుతాడు. దైవత్వం సంతరించుకుంటాడు. నైతిక, సామాజిక, భౌతిక, సాంకేతిక, ఆధ్యాత్మిక రంగాలలో ప్రగతిని కుంటుపరచే గందరగోళం, ఘర్షణలను నివారించుకోగల్గుతాడు.
బ్రహ్మం
బ్రహ్మం కారణం అయితే ప్రకృతి కార్యం. ప్రకృతి బ్రహ్మంయొక్క వికృతే. దానినే లీలా విభూతి అంటారు. బ్రహ్మంయొక్క భాగంగా లీలను చూస్తే అది అసంపూర్ణంగా వుంటుంది. 3బ్రహ్మమే అంతా2అని, బహువిధాలుగా వున్న సృష్టి అంతటా వున్నది ఒకే బ్రహ్మమనీ గుర్తించాలి. సృష్టి నశ్వరం. బ్రహ్మం శాశ్వతం. అదే నిత్య విభూతి. (నిత్యం అంటే ఎప్పటికీ వుండేది) లీలా విభూతినే మాయ అంటారు. అది బహువిధాలుగా కనిపిస్తూ నిన్ను లోబరచుకో చూస్తుంది. అదే అవిద్య.
కన్నుల్లో కరెంట్
కన్నులు చూస్తున్నాయి. కాని కన్నులా చూచేది, కాదు, కాదు... ఈ కన్నులలో ఉండే దివ్యశక్తియే ఈ కన్నుల ద్వారా చూస్తున్నది. చెవులా వింటున్నది? కాదు. కాదు... లోపల ఉన్న దివ్యశక్తియే చెవుల ద్వారా వింటున్నది. ఈ చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్. కన్నులు కేవలం బల్బ్స్ వంటివి. కాని లోపల ఈ కరెంటే లేకపోతే చెవులు వినగలవా? కన్నులు చూడగలవా? ఆ కరెంటే శక్తిస్వరూపము, అదియే ఎనర్జీ.
జ్ఞాన గంధం
ఏది తీసుకున్నా, పదార్థం అంతా ఒకటే. సముద్రపు నీరు ఒక చుక్క నోట్లో వేసుకున్నా ఉప్పగానే వుంటుంది. పీపాలకొద్దీ తాగినా ఉప్పగానే వుంటుంది కాని రుచి మారుతుందా? అలాగే భగవంతుడు ఈ సృష్టి అంతటా, బయటా ఆవరించి వున్నాడు. అణువణువునా ఆయనను దర్శించవచ్చు. మిత్రునిలోనూ, శత్రునిలోనూ, సూక్ష్మక్రిమిలోనూ, బ్రహ్మాండంలోనూ ఆయన ఉనికిని గ్రహించవచ్చు. ఈ ఎరుకయే ఆత్మదర్శనం. ఇదే ముక్తి. ఇదే జ్ఞానం. ఇదే ఆత్మసాక్షాత్కారం. 3సర్వం విష్ణుమయం జగత్2 3ఈ జగత్తంతా విష్ణుమయం2అన్న గ్రహింపు కావాలి. ఆ ఎరుక కలిగిననాడు అంతటా బ్రహ్మమే కనిపిస్తాడు.
ఇంకా ఉంది