సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే ఆత్మ!
జగత్తు మిథ్యా? సత్యమా? ఈ ప్రశ్న అన్ని దేశాలలో, అన్ని కాలాలలోనూ తలెత్తుతూనే వున్నది. యథార్థవాదులూ, ఆదర్శవాదులూ తమకు తోచిన వివరణలు యిస్తూనే వున్నారు. శాస్తజ్ఞ్రులు ఈ విశ్వమంతా అణు సముదాయంతో నిండి వుందని చెబుతారు. అణువుల కలయికలలో వచ్చే భేదాలనుబట్టి రకరకాల పదార్థాలు ఏర్పడుతున్నాయని వారంటున్నారు. అటు భౌతికవాదులూ, యిటు విజ్ఞానవాదులూ ఒక అంశం అంగీకరిస్తున్నారు. అదేమంటే, ఈ రకరకాల మార్పులు జరగటానికి ఏదోవొక స్థిరమైన ప్రాతిపదిక ఉండాలి అని. కుండ చేయాలంటే మట్టి వుండాలి. అలాగే విశ్వం తయారీకి ఉపయోగపడే ఏదో ఒక శక్తి ఉండాలి. అదే ఆత్మ! పరమాత్మ!
జగత్తు
జగత్, జగత్ అంటే అర్థమేమిటి? ‘జ’రావటం, ‘గత్’అంటే పోవటం. రావటం పోవటమే. ఏదీ శాశ్వతం కాదు. దైవత్వమొక్కటే శాశ్వతం.
సృష్టిని కాదు, దృష్టిని మార్చు!
జగత్తును చూస్తున్నాము. కాని ఎట్లా చూస్తున్నాము? జగత్‌భావన దృష్టితో చూస్తున్నాము. ఈ జగత్ భావన దృష్టిని దూరంచేసి విశ్వభావంతో చూడు. విశ్వము, విష్ణువు రెండూ ఒక్కటైపోతాయి. దృష్టిని మార్చుకోవాలి మనం. కాని ఈనాటి మానవుడు తన దృష్టిని తాను మార్చుకొనక సృష్టిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. సృష్టిని మార్చడం ఎవ్వరి తరమూ కాదు. మన దృష్టిని మార్చుకోవాలి. సర్వమూ మనకు ఏకంగా కన్పించాలంటే ఏకాత్మభావమనే అద్దాలు మనం ధరించాలి. అట్టి ఏకాత్మ భావమనే అద్దములు ధరించక, ప్రకృతికి భిన్నమైన అద్దములను మనం ధరించినప్పుడు జగత్తంతా భిన్నరూపంగానే కనిపిస్తుంది.
నిజమైన మిత్రుడు
‘సుహృత్...సుహృత్... సుహృత్...’అని చెప్పినది గీత సుహృత్ అంటే మిత్రుడు. స్వార్థ రహితుడైనవాడెవరు? ప్రతిఫలాపేక్ష లేకుండాచేసే మిత్రుడెవ్వరు? కడపటికి తల్లియైన, తండ్రియైన, భార్యయైన, భర్తయైన కూడనూ స్వలాభాపేక్ష నిమిత్తమై ప్రేమిస్తున్నారు. స్వలాభాపేక్ష రహితమైన మిత్రుడు జగత్తునందు కానరాడు. స్వార్థరహితమైన ఫలాపేక్ష రహితమైనట్టి సేవను ఆచరించేవాడు భగవంతుడు ఒక్కడే. అతనినే ‘సుహృత్’అన్నారు. అనగా ప్రాణమిత్రుడు. భగవంతుడు ఎట్టి ఫలితాన్ని ఆశించడం లేదు. ఎట్టివిధమైన స్వార్థము అతనియందు ఉండదు.
ఎక్కువ తక్కువలు
దైవత్వం అనేక విధాలుగా భాసిస్తుంది. ఒకదానికన్నా మరొకటి ఎక్కువనో, తక్కువనో అనటం తప్పు. రాముని కన్న కృష్ణుడు ఎక్కువనీ, విష్ణువుకన్నా శివుడు ఎక్కువనీ, లేక మరో విధంగానో ఎక్కువ తక్కువలు లెక్కించటం నీ ఆలోచనలను విష పూరితం చేస్తుంది. అది నీ సాధనకు భంగం కలిగిస్తుంది. నీ ఆత్మ సంగతే నీకు తెలియదుకదా! పరమాత్మను గురించి నీకేం తెలుసు? నీకు తెలియని, నీకు అర్థంకాని సంగతులపై తగుదునమ్మా అని తీర్పు చెప్పబోతున్నావే- ఎంత అజ్ఞానం? నీకు రాముడూ తెలియదు. కృష్ణుడూ తెలియదు. క్రీస్తూ తెలియదు. అందుకని వౌనం వహించి అందర్నీ సమానంగా ఆరాధించటం ఉచితం. అందరూ ఆ దైవానికే ప్రతీకలు కదా!
దేవునికి పరిమితులు
మానవుడు ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని రూపాలతో కొలిచినా, భగవంతుడొక్కడే. అజ్ఞానంచేత కొంతమంది మూర్ఖంగా ఫలానా పేరుగలవాడే భగవంతుడని వాదిస్తుంటారు. అంతకన్నా దారుణం, తాము చెప్పిన పేరుకాక యింకే పేరుతోనూ భగవంతుని పిలవరాదని వారు ఖండితంగా చెబుతారు. సత్యసాయి సంస్థలతో మీ అందరికీ సంబంధం ఉంది. మీరెవ్వరూ అలాంటి మొండివాదన చేయకండి! మీ మతం, మా మతం వేరని ఎవరితోనూ వాదించవద్దు. అందువల్ల సర్వవ్యాపి అయిన దేవునికి మీరు పరిమితులు పెట్టినట్లవుతుంది.
ఇంకా ఉంది