సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా ఆయన పిల్లలే
దేవుడిని ప్రపంచంలోని ఏ భాషలో పలిచినా ఆలకిస్తాడు. మూగవారి వౌన భాషయినాసరే! ఆయనకు కోపం, విచారం ఉండదు. అవి నీకు మాత్రం ఎందుకు? ఒక్కోసారి తొందరలో నీ నాలుకను నీవే కోరుక్కుంటావు. అందుకు నీ దంతాలపై నీవు కోపపడుతున్నావా? రాయి తీసుకొని పండ్లూడగొట్టుకుంటున్నావా? నాలుకా నీదే, పండ్లూనీవే. నినె్నవరయినా కొట్టారనుకో; నీవూ, నిన్ను ‘కొట్టినవారు- ఇద్దరూ దేవుని అంగాలేకదా! ఆయనకు మాత్రం కోపం ఎలా వస్తుంది? అంతా ఒకటే అన్న భావనను పెంపొందించుకో. ద్వేషాన్ని వదిలేయి. భగవంతుడు నీ మనసులో ఏముందో చూస్తాడు. నిర్మలంగా వున్న హృదయాలు ఆయన కృపను తేలికగా అందుకోగల్గుతాయి. అందర్నీ తనవారుగా భవించే విశాల హృదయులుగా ధన్యులు. తన పిల్లల్లో కొందరిని నీవసహ్యించుకొని, గేటవతలకు నెట్టివేయటం ఆయనకిష్టవౌతుందా?
అంగుష్ఠం
మన చేతియందు గల ఐదు వ్రేళ్ళలో బొటన వ్రేలు దైవము. చూపుడు వ్రేలు జీవము. మిగిలిన మూడు సత్వ, తమో, రజో గుణములు. ఈ గుణములతో కలిసి వున్నంతవరకు జీవుడు దైవత్వమును పొందలేడు. జీవుడు దైవత్వమును పొందవలెననిన త్రిగుణాలనూ వదలాలి. కావుననే జపసమయంలో చూపుడు వ్రేలు, బొటనవ్రేలు ప్రధానముగా వుంటాయి. అంగుష్ఠమన్నింటికంటే ప్రధానము. అది లేనిచో మిగిలిన వేళ్లుండియు నిష్ప్రయోజనము. అందుకే ఏకలవ్యుని బొటన వేలునే ద్రోణుడు గురుదక్షిణగా కోరాడు.
దివ్య దృష్టి
భగవంతుని లీలలు అద్భుతం! వాటి అర్థాన్ని గ్రహించటానికి నిర్మలమైన మనస్సు కావాలి. లౌకిక దృష్టి చాలదు.
అందుకే విశ్వరూపాన్ని చూసినప్పుడు ఆ మహాద్భుత తేజాన్ని దర్శించటానికి దివ్యదృష్టిని కూడా అర్జునుడికి ప్రసాదించారు భగవానులు.
అద్భుత లీలలు
శ్రీకృష్ణుడు తానవతార పురుషుడనన్న సంగతిని తన లీలల ద్వారా క్రమక్రమంగా వెల్లడి చేశాడు. అన్ని అవతారాల్లోనూ, యిలానే జరిగింది.
జనం వాస్తవానె్నంత గ్రహిస్తున్నారూ, ఆమోదిస్తున్నారూ అనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు చూచుకొంటూ వుండేవాడు.
తన అవతారతత్వాన్ని ప్రజలకు తెలియజేయటానికి ఆయన అనేక లీలలు చేశాడు. ఆయన లీలలన్నీ మానవమాత్రులకు అసాధ్యమైన అద్భుతాలే!
నాడేకాదు. నేడూ అంతే!
పాడి, పంటా
ఈరోజుల్లో ప్రతి దానికీ ‘రైతు, కూలీ’ అంటుంటారు. ఈ రెండు వర్గాలకూ కృష్ణావతారంలో ఎంతో మన్ననా, మర్యాదా లభించాయి.
రైతును అన్నదాత అన్నారు. తిండి గింజలను పండించే వారికన్నాకూడా, పొగాకువంటి కేష్ క్రాప్స్ వేసేవారు ఇవాళ మోతుబరి రైతులుగా ఎక్కువ మన్నన పొందుతున్నారు. మన దృష్టిఅంతా విదేశీ మారకద్రవ్యం పైనే వుంటుందాయె! అందుకని మనకేం కావాలో దానిని పండించటం మానేశాం. బయటి దేశాలవాళ్లేం కొంటారో ఆలోచించి, ఆ పంటే వేస్తున్నాం.
పాలు, పెరుగు, వెన్న- యిలాటివి ఎంతో బలం. కృష్ణుడికి అవి ఎంతో యిష్టం. బలరాముడు కృష్ణుని సోదరుడు. కృష్ణునివలె ఆయనా అవతార పురుషుడే! బలరాముని ఆయుధం హలం, అంటే నాగలి! ఇదంతా ఎందుకంటే, మనవాళ్లు పాడికీ, పంటకూ మొదటినుంచీ ఎంత ప్రాధాన్యం యిచ్చారో తెలుసుకొనేందుకే!
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల - కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది