సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజి తెలివి
నేను హాస్టిల్‌కు వచ్చినప్పుడు ‘సాయిగీత’ (ఏనుగు) అరచుకుంటూ వచ్చింది. కంటి ధార కారుస్తూ, అరుస్తూవచ్చింది. నా కారు వెనక ఎనభై కార్లు వచ్చాయి. నా కారు శబ్దం విని అరచుకుంటూ నాదగ్గరకే వచ్చింది. ఎంత తెలివి! ఎంతటి మేధాశక్తి! మంచి తెలివితేటలుగల మానవుణ్ణి చూచి వీడివి ఏనుగు తెలివి తేటలురా! అంటారు. ‘గజ తెలివి’అంటారు. ఏనుగు చాలా తెలివితేటలు కలిగినటువంటిది. విఘ్నేశ్వరునకు గజ శిరస్సు పెట్టటానికి కారణమేమిటంటే, తెలివైనటువంట వాడని ప్రజలకు చాటి చెప్పేందుకే! అందుకు ఏనుగు తలను ఒక చిహ్నంగా పెట్టారు.
గణపతి
గణపతిని బుద్ధి వినాయకుడనీ, సిద్ధి వినాయకుడనీ పిలుస్తారు. విఘ్న గణాలకు ఆయన అధిపతి. కనుక గణపతి అంటున్నాము. మనిషి తన జీవితంలో ఎన్నో విఘ్నాలను ఎదుర్కోవలసి వుంటుంది. ఆ విఘ్నాలను తొలగించమని మనం వినాయకుని వేడుకుంటాం. ఏ నోము నోచినా, ఏ వ్రతం చేసినా ముందు పూజించేది గణేశుడినే. ఆయన శ్రేష్ఠత్వాన్ని గమనించే, పరమేశ్వరుడు ఆయనకు గణాధిపత్యం యిచ్చాడు.
అమనస్కం
గణ....పతి. ‘గ’అనగా బుద్ధి ‘ణ’అనగా విజ్ఞానము. బుద్ధికి, విజ్ఞానమునకు అధిపతి అయినటువంటివాడే ‘గణపతి’! గణనాధుడు కావటం చేతకూడా ఇతనికి గణపతి అని పేరువచ్చింది. సర్వగణములను కూడనూ తన హస్తముతో ఆడించి, పాడించి, ఊగించేటటువంటి తత్త్వముకలవాడు కనుకనే అతనిని ‘గణపతి’ అన్నారు.
ఇతనినే ‘వినాయక’అంటారు. అనగా ఇతనికి నాయకుడెవ్వరూ లేరు. అతనే సర్వ స్వతంత్రుడు. అందరికీ నాయకుడున్నాడు. అందరికీ ఒకవిధమైన అధిపతి వున్నాడు. కాని వినాయకునకు నాయకుడు లేడు. మనసున్న వానికే నాయకుడు. మనసు లేనటువంటివానికి నాయకుడెక్కడ? అనగా మనస్సునకు అతీతమైనటువంటి తత్త్వమే వినాయకత్వము.
బృహత్ కరోమి!
గణపతికి తల్లులు ఇద్దరు- గౌరి, గంగ. మీకో?- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ-నలుగురు తల్లులు. వారిని గౌరవించండి! మీరు చేసే పనులవల్ల వారికి చిన్నతనం కలగకుండా చూచుకోండి!
అన్యాయం, అక్రమం, అసత్యం, అనాచారం- ఈ నలుగురమ్మలకూ ఎన్నడూ దత్తుపోకండి!
విశాల హృదయంతో మానవులందరినీ మీ కుటుంబంగా స్వీకరించండి! అంతేకాదు, పక్షులూ, జంతువులూ, కీటకాలూ, మొక్కలూ, చెట్లూ- ప్రాణికోటి అంతా విశ్వకుటుంబంలో భాగమే!
అందుకే వేదంలో ‘బృహత్ కరోమి’’అని ప్రార్థన వుంది. మనలను మనం విస్తృతపరచుకొందాం! అత్యంత విస్తారమైనది బ్రహ్మమే! ‘బ్రహ్మం’అన్న పదం కూడా ‘బృ’(అంటే విస్తరించటం) అనే ధాతువు నుంచి పుట్టినదే!

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.