సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుడు
శివుని బిల్వదళాలలో అర్చిస్తారు. (దళం అంటే ఆకు అని అర్థంకాదు. మూడు ఆకులు కలసిన రెమ్మను దళం అంటారు.) ఆయన ఈ మూడు లోకాలలోనూ నిండివున్నాడు. మూడుకాలాలలోనూ నిండి వున్నాడు. ప్రకృతి సిద్ధంగా కలిగే మూడు గుణాలలోనూ నిండివున్నాడు. ఆయన మూడురకాల దుఃఖాలనూ పొగొడతాడు. ఆయన కన్న వేరు లేదు. ఆయనే వరదుడు. ఆయన అమృతమూర్తి అంతా శివస్వరూపులే. సాధకుడు శివతత్వాన్ని అర్థం చేసుకొని తరించాలి.
లింగం
నిరాకారంనుండి సాకారంలోకి ఆవిష్కరించబడిందే లింగం. అది భగవన్మూర్తి. ఇతర ఆకారాలన్నీ లింగంలో లయించాయి.
భగవత్సంకల్పంవల్ల ఆవిష్కరించబడ్డదే రుూ ప్రకృతి. ఆయన శక్తికీ, బలానికీ, సామర్థ్యానికీ అది తార్కాణం. ఆయన లీలకు నిదర్శనం.
శివుడు పురుషుడు శక్తిప్రకృతి. శివునికన్నా, శక్తిఅన్నా, ఆత్మఅన్నా, ఆత్మ స్వరూపుడన్నా అన్నీ ఆయనే.
జీవిత పరమార్థం
‘అహం దేహాస్మి’-నేనే దేహాన్ననుకోవడం అహంకారం. ‘అహం జీవాస్మి’- నేనే జీవుడను అనుకోవడం మమకారం. ‘అహంబ్రహ్మాస్మి’ అనుకోవడమే దివ్యత్వం. ‘తత్వమసి’అనగా ‘ఆ బ్రహ్మపదార్థం నీవే’అని అర్థం. ఆ సంగతిని గుర్తించడమే మానవ జీవిత పరమార్థం.
రథోత్సవం
ఈ శరీరమే దేవుని రథం. అందులో వూరేగే దేవుడే ఆత్మ. దానికి లాగేది కామక్రోథాదులు. వెళ్లేది కోరికల బజారు వెంట. గెలుపు. ఓటమీ. సుఖము, దుఃఖము; లాభం, నష్టం; ఈ ద్వంద్వాలే ముందు నడుస్తూ కోలాటంవేసేవాళ్ళు.
రథోత్సవం చూసేవాళ్లలో ఎందరో ‘అబ్బా! ఈ రథం ఎంత బాగుంది? ఎంత ఎత్తుంది? -అనే చూస్తారు. దాని అలంకారాన్ని మెచ్చుకుంటారు. మరికొంతమంది కోలాటంవేస్తున్న వాళ్ళను చూస్తుంటారు. రథంలో కూర్చొని ఊరేగుతున్న ఆత్మవేపు చూసేవాళ్లేరి? అసలు ఈ ఊరేగింపంతటికీ మూలం. ఆధారం, మకుటాయమానం అదే గద!
ఆత్మదర్శనం చేయటమే మానవుని జీవితపరమార్థం.
పోస్ట్‌మాన్
భగవంతుడు ఒక పోస్టుమాన్ వంటివాడు. ఈ పోస్టుమాన్ ఒక ఇంటిలో ఒక జాబు ఇస్తాడు. మరొక ఇంటిలో వేరొక జాబుఇస్తాడు. మొదటి జాబువచ్చిన ఇంటివారు ఘొల్లున ఏడుస్తారు. రెండో ఇంటిలో వారు ఫక్కున నవ్వుతారు. వారు నవ్వటానికి, వీరు ఏడవటానికి కేవలం పోస్టుమానాకర్త? కాదు... వారికి వచ్చిన జాబులే కారణం. కనుకనే మంచి చెడ్డలనేవి భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేస్తే వారికి అవి తాను అందిస్తున్నాడు. ఏడ్చేది, నవ్వేది మీ యొక్క ప్రవర్తనల ఫలితమువల్లనే. ఇతను కేవలం సాక్షీభూతుడు.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల - కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది