సబ్ ఫీచర్

ఇపుడామే స్వర్గలోకపుటిల్లేరమ్మ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నివాళి
*
కాలం గడిచీ ఆయుర్దాయం మెట్లెక్కినకొద్దీ పైకి చూస్తే ఎవరూ ఉండరు. పక్కన కూడా ఎవరూ వుండరు. అంతా ఒంటరితనమే..
- శ్రీమతి సుశీల సోమరాజు
‘‘ప్రియమైన నా బంధుమిత్రులకు, స్నేహితురాళ్ళకు, నేనంటే ఇష్టపడేవాళ్ళకు, చిరాకుపడేవాళ్ళకు, తెలిసీ తెలియనివాళ్ళకు, నా బాధితులకు.. అందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు, ఆశీస్సులు, అభినందనలు. మొత్తానికి అనేక విన్యాసాలు చేసి బయట పడుతున్నాను. డెబ్భైఐదేళళు వచ్చినవాళళు ఆ మాత్రం ఖాయలా పడటంలో పెద్ద విశేషమేమి వుండకూడదు. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యవిషయం మర్చిపోకూడదు. అదీ ఇప్పటి కాండిడేట్ ‘ఇల్లేరమ్మ’ అనే విషయం.. తానిప్పుడు ఏమిచేసినా అది ఘన కార్యమే..’’
ఆగస్టు 16న ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్ పెట్టి ‘‘ఇంకా మూడు పుస్తకాలు సగంసగం దారిలో వున్నాయి. తొందరగా కోలుకుని పూర్తి చేస్తాను తగ్గాక ఇంత బుద్ధిగా వుంటానో వుండనో అందుకే అన్ని రైటింగ్‌లో పెట్టాను. ఎవరైనా గుర్తుచేయచ్చు..’’ అని మనకు చెప్పిన విషయం తాను మరచిపోయారు. అక్కడెవరితోనో ముచ్చట్లు పెట్టడానికి స్వర్గలోకపుటిల్లేరమ్మగా సెప్టెంబర్ 26 తెల్లవారుజామున సాగిపోయారు..
సుశీలగారంటే సాంప్రదాయ వస్త్ధ్రారణలో ఉన్న ఓ ఆధునిక స్ర్తీ. ఆధునిక శాస్తవ్రేత్త అయిన ఓ సంప్రదాయవాది. ప్రతినిత్యం మనలో ఒకరిగా ఉంటూ ఒక పెద్దదిక్కుగా సరదా సంభాషణలు చేసే ఆత్మీయ నేస్తం. ఎంతో నిరాడంబరంగా కనిపించే ఈమె ఒక ఇండస్ట్రియలిస్ట్.. ఒక శాస్తవ్రేత్త.. ఒక రచయిత్రి.. అనువాదకురాలు అందరినీ ఆదరించే గొప్ప గృహస్థురాలు, సంగీతాభిమాని, సామాజిక సేవిక - ఇలా ఇన్నిరకాల విషయాలలో జీవన సారళ్యత సాధించిన మాన్యురాలు మన సోమరాజు సుశీలమ్మ.
రసాయనశాస్త్రంలో తొలి మహిళా శాస్తవ్రేత్త: డాక్టర్ సోమరాజు సుశీల 1945లో పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో జన్మించారు. అందరికీ క్లిష్టతరమైనటువంటి రసాయన శాస్త్రంలో రాజస్థాన్ లోని జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ పట్టానందుకున్నారు. విజయవాడ మెరిస్టెల్లా కాలేజ్‌లో లెక్చరర్‌గా కొంతకాలం పనిచేసారు. రంగారావు గారితో వివాహానంతరం కెమిస్ట్రీలో ‘సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ’ అన్న అంశంపై పరిశోధన చేసారు. పుణె విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. పుణెలో 8 సంవత్సరాల పాటు నేషనల్ కెమికల్ లాబరేటరీలో శాస్తవ్రేత్తగా పనిచేశారు.
పారిశ్రామికవేత్త: దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఒక పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచన చేసారు. దానికోసం హైదరాబాద్‌కి చేరుకున్నారు. ‘‘్భగ్యనగర్ లేబొరేటరీస్’’ అనే అని చిన్నతరహా పరిశ్రమను హైదరాబాద్‌లోని బాలానగర్‌లో 1974లో ప్రారంభించారు. ఇందులో సుశీలగారు పరిశోధన చేసిన ‘్ధర్మిస్టర్స్’ తయారు చేసేవారు. అప్పటిదాకా భారత వాతావరణ శాఖకు అవసరమయిన ఈ ధర్మిస్టర్స్‌ను అమెరికా నుండి దిగుమతి చేసుకునేవారు. తరువాత నలభై యేళ్ళపాటు వీరు నిర్వహించిన ఈ లేబరేటరీ నుండే కొనుగోలు చేసేవారు. భారతదేశంలోనే ధర్మిస్టర్స్ తయారుచేసిన ప్రధమసంస్థ సుశీలగారిదే. ఆ తరువాత తరువాత ఈ సంస్థలోనే వీరు మైక్రో న్యుట్రీయంట్ ఫెర్టిలైజర్స్‌ని కూడా తయారు చెయ్యడం ప్రారంభించారు. వ్యవసాయానికి అవసరమయిన జింక్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషక పదార్థాలను ఆర్గానిక్ చిలేటేడ్ రూపంలో తయారు చేసేవారు. ఆలిండియా మాన్యుఫాక్చర్ అసోసియేషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్న ఘనత వీరిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి టెక్నోక్రాట్ ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా, శాస్తవ్రేత్తగా, పలు అవార్డులను అందుకున్నారు.
తొలి పుస్తకం: ఈ పరిశ్రమ నిర్వహణ సమయంలో పనివారితోనూ, బ్యాంక్ వారితోనూ పెట్టుబడి విషయంలో లాభాల విషయంలోనూ ఇలా అడుగడుగునా ఎదురయిన అనుభవాల సమాహారమే ‘‘చిన్న పరిశ్రమలు- పెద్ద కథలు.’’ ఒకరకంగా ఇది గోడు వేళ్లబోసుకోవడమే అంటారామె. కొత్తగా ఒక వ్యాపారాన్ని నిర్వహించడానికి పూనుకున్న ఆ విషయాలన్నీ ఒక డైరీలా రాసుకుంటుండేవారు. వ్యాపార విషయాల్లో తానూ ఎదుర్కొన్న అనుభవాలకు సున్నితమైన హాస్యాన్ని జోడించి కథలుకథలుగా ఆసక్తికరంగా చెప్పిన విషయాలు ‘‘చిన్న పరిశ్రమలు- పెద్ద కథలు’’ ఆమె తొలి కథల పుస్తకంగా రావడం జరిగిపోయింది. అంటే సోమరాజు సుశీల గారి విద్యార్థిదశ నుంచో ఏ యవ్వన దశలోనో కాకుండా ఆమె యాభయ్యవ దశకంలో అడుగిడినాక ఈ రకంగా సాహిత్యపు తొలి అడుగులు పడ్డాయి.
ఇల్లేరమ్మ కథలు: ఆ తర్వాత ఆమె సాహిత్య ప్రపంచానికి ఓ అందమయిన కానుకగా ‘ఇల్లేరమ్మ కథల’ను అందించారు. ఇందులో ఇల్లేరమ్మ తానె. చిన్నారి తన చెల్లెలే.. వీళ్ళ అమ్మాయి శైలజ కూడా ఇందులో పాత్రధారే. తన చిన్ననాటి అనుభవాలకు హాస్యస్ఫోరకమైన కథనం జోడించి రాసిన రచన ఇది. పాఠకులే కాక బాపురమణ లాంటివారు, శ్రీరమణగారి లాంటివారు ఎందరెందరో ఆమె రచనలకు అభిమానులయిపోయారు. పెళ్లి పందిరి తర్వాత ఆమె దీపశిఖ, పెళ్లి పందిరి అనే మరో రెండు కథల సంకలనాలు వెలువరించారు. ఇందులోని ప్రతీ కథ ఒక్క వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ఆసాంతం ఆసక్తికరంగా ఉండి చదువరులను కట్టిపడేస్తాయి. మరో గొప్ప రచన ముగ్గురు కొలంబస్‌లు. దీని శీర్షికే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులోని కథలు అమెరికా జీవితానికి అద్దం పడతాయి. జాయింట్ ఎఫర్ట్ పెట్టే ఆమె శ్రీవారు రంగారావుగారు ఒక కొలంబస్ గానూ, డ్రైవింగ్ ఫోర్స్‌గా తానూ ఒక కొలంబస్ గానూ.. అత్తగారు వెదర్ ఫోర్‌కాస్ట్ చేసే మరో కొలంబస్ గాను అభివర్ణిస్తారు. సంపాదన కోసం అర్రులుజాస్తూ యువతను అమెరికాలకు విదేశాలకు పరుగులు పెట్టిస్తున్నది మనమే అంటారామె. బ్రౌన్ అకాడమీ వందమంది ఆంధ్రుల జీవిత చరిత్రలను ఒక పుస్తకంగా వెలువరిస్తున్న సందర్భంలో సుశీలగారిని ప్రముఖ శాస్తవ్రేత్త అయిన నాయుడమ్మ గారి జీవితచరిత్రను రాయమని అడిగారు. అడిగి తెలుసుకున్న విషయాలనూ.. పలు ప్రాంతా లు పర్యటించి తెలుసుకున్న విషయాలను క్రోడీకరించి నాయుడమ్మ గారి జీవితచరిత్ర రాశారు. అయితే తాను రాసిన పుస్తకం కన్నా తర్వాత వచ్చిన పుస్తకాలు ఇంకా సమగ్రంగా ఉన్నాయని ఆమె అంటారు. డాక్టర్ సోమరాజు సుశీల తాను ‘రాష్ట్ర సేవికా సంస్థ’ సభ్యురాలు. సత్ సంఘాలలో తాను వౌసిజీ అని ఎంతో గౌరవంగా పిలుచుకునే లక్ష్మీబాయి కేల్కర్ అంటే అపారమయిన ప్రేమా గౌరవాలు కలవారు. ‘లక్ష్మీబాయి కేల్కర్’ గురించి ఓ పుస్తకం రాద్దామని అనుకున్నారు. కనీసం మరాఠీలో ఆమెపై వచ్చిన పుస్తకాలను అనువాదమయినా చేద్దామనుకున్నారు. మరాటి పుస్తకంలో లేని ఎన్నో గొప్ప విషయాలు తనకు తెలుసని వాటిని కూడా అందులో క్రోడీకరించి ఆమెపై మంచి పుస్తకం రాయాలని అనుకున్న ఆశ అలా ఉండిపోయింది. బయోగ్రఫీ ఆఫ్ సిస్టర్ నివేదిత, రామ సేతు ప్రాముఖ్యత పుస్తకాలను వ్రాసారు. ఒక రచయితగా పౌరురాలిగా సమాజాన్ని బాగా పరిశీలించిన వ్యక్తిగా అనేక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు సుశీలగారు. సోషల్ కాజ్ అనే సామజిక సేవా సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరించి ఎన్నో కార్యక్రమాలు చేసారు. అబ్బూరి ట్రస్ట్ నాద వినోదిని ట్రస్ట్ వంటి సంస్థలకు కార్యదర్శిగా ఉన్నారు. పలు రేడియో టీవీ కార్యక్రమాల్లో గెస్ట్ స్పీకర్‌గా వ్యవహరించారు. అపరాజితా సేవా ట్రస్ట్, రాణి రుద్రమదేవి ట్రస్ట్లకు దశాబ్దకాలంగా అధ్యక్షురాలిగా ఉన్నారు. తన రచనలద్వారా పాఠకులకు ఎంత చేరువయ్యారో సామాజిక మాధ్యమం ద్వారా చాలామందికి ఆమె ఆప్తురాలయ్యారు. ఆమె పోస్టింగ్ కోసం ఎదురుచూసే అభిమానుల పరంపర పెరిగిపోయింది.
ఆమె కవిత్వం చాలా తక్కువగా రాసినప్పటికీ.. ప్రయాణం అని స్వగతం లాంటి కవనం ఎంతమందిని కదిలించిందో.. ఎన్నో వాస్తవాలను జోడించిన ఆ కవిత మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎంతోమంది దానిలోని వాస్తవానికి కదిలిపోయారు.. వారి నిష్క్రమణకు దిగ్భ్రాంతికి గురయిన ఎంతో మంది ఆ కవితనే మననం చేసుకున్నారు. నిజానికి సుశీల గారు ఆరోగ్యవంతులై ఇవ్వాళో రేపో ఆమె మళ్ళీ మనతో ముచ్చటిస్తారు అనుకున్నాం. అంతలోనే ఎంతో హాయిగా ఓ ప్రభాత వేళ ప్రశాంతంగా నిశబ్దంగా నిష్క్రమించారు. ఈ నిష్క్రమణం ఆమె కుటుంబానికే కాదు సాహిత్యానికి, మిత్రగణానికి, బంధువర్గానికి తీరని లోటు.

- సమ్మెట ఉమాదేవి, 9849406722