సబ్ ఫీచర్

హాయిగా విహరిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా సెలవులు వచ్చాయ. అందరూ సరదాగా అలా అలా తిరిగొద్దా మను కుంటు న్నారా? విహారయాత్రకు వెళ్తున్నారా? అయితే లగేజీ సర్దుకునే విషయంలో కొన్ని మెలకువలు పాటించాలి. దీనివల్ల తెలియని ప్రాంతానికి వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. హాయిగా మనసుకు నచ్చిన ప్రాంతాల్లో విహరించి రావొచ్చు.
* కుటుంబ సభ్యులందరూ విహారయాత్రకు వెళుతుంటే అందరి దుస్తులూ ఒక బ్యాగులో కాకుండా రెండు, మూడు బ్యాగుల్లో సర్దాలి. అప్పుడే లగేజీ మోయడం తేలికవుతుంది. అలాగే బట్టలు సర్దేటప్పుడు ఏ ఏ వస్తువులు ఎకడెక్కడ ఉన్నాయో అందరికీ చెబితే.. వస్తువులు కనిపించడం లేదనే గందరగోళం ఉండదు.
* ఎక్కడికైనా వెళ్లేటప్పుడు లగేజీ ఎంత తక్కువగా ఉంటే అంత హాయిగా ప్రయాణం చేయవచ్చు. అనవసరమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు. దుస్తులు, ఆభరణాలు, మేకప్ వస్తువులు.. ఇలా ఏవైనా సరే.. లెక్కలేసుకుని సర్దుకుంటే బాగుంటుంది.
* ముఖ్యంగా చిన్నపిల్లలతో బయటి ప్రదేశాలకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా స్వెటర్‌లు, మంకీ క్యాప్‌లు, షాల్స్ తీసుకెళ్లడం మరిచిపోకూడదు. ఎందుకంటే చల్లని గాలులు ఎప్పుడు, ఎక్కడ మొదలవుతాయో తెలీదు.
* ఎండకాలంలో చెమటకాయలు, చెమటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వెట్ టిష్యూ పేపర్లు, ఫేస్‌వాష్‌లు తప్పకుండా వెంట ఉంచుకోవాలి. ఎక్కడైనా సులువుగా ముఖం, చేతులూ కడుక్కునే అవకాశం ఉంటుంది.
* కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావొచ్చు. అక్కడ మీరు వేసుకునే మందులు దొరక్కపోవచ్చు. కాబట్టి తలనొప్పి, జలుబు, జ్వరం, మోషన్స్.. వంటి వాటికి సంబంధించిన మాత్రలు దగ్గరుంచుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు కంగారు లేకుండా ఉంటుంది.
* వెళ్లే అన్ని ప్రాంతాల్లో భోజనం దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఒకవేళ దొరికినా కూడా ఆ ప్రాంతపు ఆహారం మనం తినలేకపోవచ్చు. కాబట్టి ఇంటినుంచే మీరు తినే చిరుతిళ్లు తీసికెళ్తే అవసరానికి ఉపయోగపడతాయి.
* జలపాతాల దగ్గరికి వెళుతున్నప్పుడు అందులో స్నానం చేయాలనిపిస్తుంది. అందుకని స్విమ్మింగ్ దుస్తులు కూడా పెట్టుకోవాలి.
* బయటి ప్రదేశాలకు వెళుతున్నప్పుడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బంతా ఒకేచోట ఉంచకుండా రెండు, మూడు చోట్ల పెట్టి ఉంచాలి. ఒక బ్యాగు పోయినా ఇంకోచోట ఉన్న డబ్బు మనల్ని కాపాడుతుంది. అలాగే వేరే ప్రాంతాలకు వెళుతున్నప్పుడు పూర్తిగా క్రెడిట్, డెబిట్ కార్డులపై ఆధారపడకపోవడమే మేలు. అదనంగా కొంచెం నగదు కూడా పెట్టుకోవడం మంచిది.