సబ్ ఫీచర్

పర్యావరణ సమతుల్యత లోపిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణం దెబ్బతింటున్నందున ప్రకృతి విపత్తులు పేట్రేగి పోతున్నాయి. ఇది కేవలం ఒక్క దేశానికి పరిమితం అయన అంశం కాదు. విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రథమ కారణం. మానవాళి అడుగడుగునా అనుసరిస్తున్న ప్రకృతిపరమైన విధ్వంసంతో నిత్యప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. భూభాగంపై నిత్యం పెరుగుతున్న జనాభా వల్ల కీడు జరుగుతోంది. ప్రకృతి వనరులను ధ్వంసంచేసి అందులో తమ లబ్ధికోసం మానవాళి అర్రులు చాస్తోంది.
భూమి ఉన్నమేరకే ఉంటుంది. కానీ నిత్యం పెరిగి విస్తరించే అవకాశమే లేదు. అడవులను విచక్షణా రహితంగా తెగనరికి పంట భూముల విస్తీర్ణం, పరిశ్రమల స్థాపనకు కొంతమేర, ఖనిజ, ఇంధన వనరులను తవ్వి వెలికితీస్తున్నందున అడవులు, కొండకోనలు ధ్వంసవౌతున్నాయి. ఖనిజ, చమురు, సహజవాయువుల నిక్షేపాలు భూ అంతర్భాగంలో కొంతమేరకే నిక్షిప్తమై ఉంటాయనే వాస్తవాల్ని మానవులు గ్రహించాలి. వెసులుబాటు లేకుండా ఖనిజాలు వెలికితీస్తూపోతుంటే భవిష్యత్ తరాలకు మన సంపదలు మిగులుతాయనే నమ్మకం అంతంత మాత్రమే. పచ్చదనంతో పరిఢవిల్లే అటవీ సంపదను కోల్పోతే, వాటిని తిరిగి తీసుకురాగలిగిన వెసులుబాటుకు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుందని మానవాళికి తెలిసినా స్వార్థ చింతనతో వృక్షాలను తెగనరికి ధ్వంస రచనకు పూనుకొంటున్నారు. అడవులు నశించి పచ్చదనం పరిఢవిల్లకపోవడంవల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని కర్బన ఉద్గారాలు పేరుకుపోయి ప్రకృతి సహజసిద్ధమైన గుణాన్ని కోల్పోయి, భూతాపం విపరీతంగా పెరిగిపోయి విధ్వంసకర ఉపద్రవాలకు ఆలవాలవౌతున్నాయి. రోజురోజుకూ ఇబ్బడి ముబ్బడిగా కాలుష్య కారకాలు వాతావరణాన్ని ఆక్రమించడంవల్ల పరిశ్రమల కాలుష్యాలు, రసాయనిక కర్బన ధాతువులు, ప్లాస్టిక్ భూతం భూతలాన్ని అతలాకుతలం చేయడంతో వ్యర్థాల అనర్థాలతో అతివృష్టి, అనావృష్టి, వంకలు, వాగులు, నదులు పొంగి పొర్లి నదుల పరివాహక, పల్లపు ప్రాంతాల ఊర్లకు ఊర్లు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు జలసముద్రాలవుతున్నాయి. తుఫాను బీభత్సాలతో కోట్లకు కోట్లు రూపాయల పంట నష్టాలు, కూలిన వృక్ష సంపద, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలీకమ్యూనికేషన్లు, జల విలయంలో మానవ నష్టాంతోపాటు మూగజీవాలు కడతేరి ఆస్తి నష్టంతో కునారిల్లుతున్న వైనం మానవ తప్పిదాలకు పరాకాష్ఠ.
సముద్రాల పర్యావరణాన్ని ప్రమాదల పాలుచేస్తున్న కర్బన కాలుష్యానికి కళ్ళెం వేయకపోతే సముద్ర మట్టాలు ఊహకందని రీతిలో పెరిగి తీర ప్రాంతాలలోని మహానగరాలను కుల్లగించబోయే మహాజల ప్రళయం విధ్వంసాన్ని ఐక్యరాజ్యసమితి ముసాయిదా నివేదికను త్రోసిపుచ్చలేనిది. భూతాపానికి మంచుకొండలు కరిగి కొండ చరియలు జారిపడి పరవళ్ళు త్రొక్కే జలవిలయాన్ని అడ్డూ అదుపూ ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ విపత్తులో ప్రధానంగా చైనా, అమెరికా, ఐరోపా, భారత్‌లకు తీవ్రత అధికంగా ఉంటుందని ఆ ముసాయిదా హెచ్చరించింది. పెరగనున్న సాగర జలాల మట్టాలతో ముంబయ, చెన్నై, కొచ్చి వంటి మహానగరాల పాలిట మృత్యువై కబళించే పెను ప్రమాదం ఉందని హెచ్చరించింది.
శాస్ర్తియ ఆధునిక విజ్ఞానం చంద్ర మండలంపై, ఇతర గ్రహాంతరాలకు వెళుతున్న ఈ తరుణంలో ప్రకృతిపరంగా మానవాళి చేస్తున్న అపరాధాలకు నిష్కృతిగా పర్యావరణ వైపరీత్యాలు ఎదుర్కొనక తప్పనిసరి పరిస్థితులు నెలకొంటున్నాయి. నదుల ద్వారా భూతలంలో వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయి సముద్రంలో జలచరాలు మృత్యువాత పడి నశిస్తున్నాయి.
రసాయన కాలుష్యాలు, పరిశ్రమల నుండి వెలువడే ధూమం, భూముల సారవంతానికి విచ్చలవిడిగా వినియోగించే రసాయనిక ఎరువుల శకలాలు, కర్బన ఉద్గారాలు పెచ్చుమీరుతున్నాయ. విశ్వమంతటా పర్యావరణం గరళం కార్చిచ్చు విస్పోటనాన్ని చల్లార్చేందుకు పర్యావరణ సమతుల్యతకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ప్రజలు ఏకత్రాటిపై నిలబడి, రానున్న విలయానికి అడ్డుకట్టవేసేందుకు పూనుకోవాలి.

-దాసరి కృష్ణారెడ్డి 98853 26493