సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువే శిష్యుడు
మహర్షుల హృదయోద్యాన వనాలలో మొలకెత్తే విత్తనం ప్రేమ. మొగ్గ తొడిగేది ధైర్యం. ఫలిస్తున్నది ప్రశాంతి. సత్యాన్ని దర్శించటంకోసం వారెంత సాధన చేశారో! తమకు తోచినదానే్న సత్యంగా ప్రవచిస్తూ వారు బూటకాలు చేయలేదు. దానితో తాము ఈ భూమిపై అవతరించిన లక్ష్యం నెరవేరిందని చంకలు కొట్టుకోలేదు. వారు ప్రవచించిన సత్యం వల్లనే భారతదేశం శతాబ్దాలుగా ప్రపంచానికే గురువుగా వుంటూ వచ్చింది. ఇప్పుడో! అటువంటి గురువు ఎవరెవరినుంచో పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది. అంతేకాదు, వారిచ్చే కితాబులకు మురిసి, గర్వంతో ఘనంగా తలెత్తుకొని తిరుగుతూ వుంది.
అన్యోన్యత
స్ర్తిల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవటానికి పురుషులు ప్రయత్నించాలి. పురుషులయొక్క మనోభావాలను స్ర్తిలు కూడా అర్ధం చేసుకోవాలి. అన్యోన్య అవగాహన వలననే చక్కటి ఆనందమయమైన జీవితాన్ని ఇరువురూ గడపగలుగుతారు. అయితే ఈనాడు ఆనందమయమయిన సంసారమును కోరుకోవటం లేదు. ఎవరికి వారు ఆనందమయమయిన సంసారం కన్న తమ, తమ పట్టుదలలే ప్రధానం అనుకుంటున్నారు.
పూజనీయ మహిళ
ఈ దేశంలో సంస్కృతిని పట్టుదలగా పరిరక్షించుకొనే వారు మహిళలే. మగవారిని నైతిక పథంలో నడిపిస్తున్నది వారే. ఆధ్యాత్మిక చింతనను వారిలో రేకెత్తించేదీ మహిళలే. మహిళల హృదయాలు సుతిమెత్తనగా వుంటాయి. కరుణా రస పూరితంగా వుంటాయి. ఆకలిగొన్న వారి పట్లా, యిబ్బందులలో వున్నవారి పట్ల వారికి జాలెక్కువ. అందుకే, ఈ దేశంలో స్ర్తిలు పూజనీయులయారు.
భార్యాభర్తలు
భార్య భర్తా పక్కపక్కన నదిలో కొట్టుకొని పోతున్న రెండుకర్రముక్కల లాటివారు. కాసేపు రెండు ముక్కలూ పరస్పరం కలిసి పోతుంటాయి. ఇంతలో నదీ ప్రవాహం వాటిని విడదీస్తుంది. మళ్లీ కాసేపటికి కలుస్తుంటాయి. రెండూ సముద్రంలోకి నదితోపాటు కొట్టుకొనిపోయేవే. కాస్త ముందో, వెనుకో, అంతే!
అందుకే అవి విడిపోతే విచారించాల్సిన పనిలేదు. అది సహజంగా జరిగే సంగతే!
స్ర్తి జన్మ ధన్యం
అనంతమైన ఈ జగత్తునందు, అసంఖ్యాకములయిన జీవరాసులలో మానవుడు అత్యంత ఉత్తముడు. మానవ జన్మలో స్ర్తి జన్మ మరింత ఉత్కృష్టమైనది. స్ర్తి జన్మ ఉత్తమమైనదని చెప్పుటకు అనేక విధములైన తార్కాణాలున్నాయి. కౌసల్య గర్భమున జన్మించిన రాముడు దేవుడుగా ఖ్యాతి నొందలేదా? సీతా మహాసాధ్వి పెంపకము చేతనే గదా కుశలవులు అంతటి ఘనులైనారు? వీరశివాజి అంతటి ఘనతను పొందటానికి కారణం అతని తల్లి జిజియాబాయే గదా! గాంధీ మహాత్ముడు అంతటి ఘనతను, పేరుప్రఖ్యాతులను పొందటానికి కారణం అతని తల్లి పుత్తలీబాయి పెంపకమే గదా! ఈ విధంగా జగత్తునందు అనేక మంది మహనీయులు, మహర్షులు, వీరులు, ధీరులు, శూరులు సర్వులూ స్ర్తి గర్భము నుండి ఆవిర్భవించినటువంటి వారే.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.