సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవోభవ!
బిడ్డలయొక్క బ్రెడ్డు, ఫుడ్డు, హెడ్డు, దుడ్డు- అంతా తల్లిదే. కనుకనే మొట్టమొదట ‘మాతృదేవోభవ’ అన్నారు. పిల్లలను పెంచి పోషించడానికి అవసరమైన వాటన్నింటిని సమకూరుస్తాడు తండ్రి. ఆయనను ‘పితృదేవోభవ’ అన్నారు. కనుక మొదట తల్లి. తరువాతనే తండ్రి.
సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు అన్నింటిలోను స్ర్తి పేరే మొదట రావటానికి కారణమేమిటి? స్ర్తి ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని నీవు సాధించి, ప్రకృతి అనుగ్రహమును పొంది, తదుపరి పరమాత్మను పొందు! ఈ ప్రకృతి అనుగ్రహమునకే నోచుకోలేని వాడు పరమాత్మ అనుగ్రహమునకు ఏ విధంగా నోచుకోగలడు?
తల్లి తండ్రిని చూపిస్తుంది. తండ్రిని చూపించే అధికారం తల్లికి తప్ప మరెవ్వరికీ లేదు. అప్పుడు తండ్రి గురువును చూపిస్తాడు. ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. ఇదే సరియైన ప్రాచీన సంప్రదాయం.
వజ్రమా? పేపర్ వెయిటా?
తులసీదాస్ చెప్పాడు: ‘రత్నంయొక్క విలువ తెలిసినవాడే దానికి తగిన బందోబస్తును ఏర్పాటుచేసి పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు.’ వజ్రము యొక్క విలువ తెలియని మూర్ఖులు టేబుల్‌పైన పేపర్‌వెయిట్‌గా పెట్టి దానిని అలక్ష్యం చేస్తుంటారు. అదే విధముగ మానవత్వంయొక్క విలువను తెలిసినటువంటివాడు. దీనిని బజారులో మసిబొగ్గులకు అమ్ముకోవటానికి ప్రయత్నించడు. కనుక మొట్టమొదట మానవత్వమంటే ఏమిటి? దీని విలువ ఏమిటి? అనేటటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పగలరు? వారికే లేవు ఆ గుణములు! పిల్లలకు ఏమినేర్పగలరు? కనుక మొట్టమొదట తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి.
ప్రేమించు, సేవించు
‘మీపట్ల నాకెంతో భక్తివుంది’అంటూ అనేకులు నిత్యం నా దగ్గరకు వస్తుంటారు. కాని తాముచేసే పనులు నాకు సంతోషం కల్గిస్తున్నాయా అని చూడరు. మీ పిల్లలకు, విద్యార్థులకు ఆదర్శంగా వుండేట్లు మీరు నడుచుకుంటున్నారా? అలా చేసే తల్లిదండ్రులనూ, ఉపాధ్యాయులనూ చూస్తే నాకు ఆనందంగా వుంటుంది. వారిపై నా కరుణ ప్రసరిస్తుంది.
నేను సూచించిన ప్రకారం క్రమశిక్షణతో, సేవాభావంతో నడుచుకోవటమే నా అనుగ్రహాన్ని చూరగొనేందుకు మార్గం. నీ తోటివారిని ప్రేమించు, సేవించు: నా ప్రేమను పొందగలవు.
ఆజ్ఞలు వద్దు, ఆస్తి కావాలి
‘నా యిష్టం వచ్చినట్లు నేనుచేస్తా’-అంటాడు కుర్రవాడు. తండ్రి మాట వినడు. కాని తండ్రి ఆస్తిలో వాటా మాత్రం కావాలి అబ్బాయిగారికి. అలాగే, భగవద్గీత ఏమిటి? భగవానుడు స్వయంగా మానవాళికి ఇచ్చిన ఆదేశాల సంపుటి. ఆయన ఆజ్ఞలను మనం శిరసావహించం కాని ఆయన కృపమాత్రం మనపై వర్షించాలి అంటాము.
సాయి మాట
మబ్బు పట్టినప్పుడు మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపులో మబ్బు కూడా కనిపిస్తుంది. అలాగే విద్యను జ్ఞానం ప్రకాశింపజేయాలి. సాయి చెప్పే రుూ మాట సత్య మార్గం.
గురువు
నీ అసలు పేరేమిటో నీవు మరచిపోయావు. నీకు సంబంధించిన ఎన్నో అమూల్య విషయాలు నీ ఎరుకలోనుంచి జారిపోయాయి. అయినా ఆ లోపాన్ని నీవు గమనించనే లేదు. జనన మరణాలనే రుగ్మతతో బాధ పడుతున్నావు. దీనికి సరయిన డాక్టరెవరో తెలుసా? గురువే! ఆయన యిలాటి జబ్బులు నయంచేయటంలో చేయి తిరిగినవాడు. అలాటి గురువు నీకు లభించకపోతే, భగవంతుని ప్రార్థించు. ఆయన తప్పక నీకు దారి చూపుతాడు.
తల్లిదండ్రులే ఆదర్శం
తల్లిదండ్రులు సరిగా వుంటే పిల్లలు బాగుంటారు. సీత మహాసాధ్వీమణురాలు కాబట్టే లవకుశులు లోకానికెంతో ఆదర్శవంతులైన బిడ్డలుగా రూపొందారు.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది