సబ్ ఫీచర్

మోధీ దౌత్య విజయ పరంపర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభేదం.. వివాదం కారాదంటూ రెండ్రోజుల చైనా-్భరత్ అగ్ర నాయకుల శిఖరాగ్ర సమావేశం ‘చెన్నై సంబంధం’తో ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీచేసేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ సంకల్పం చెప్పుకున్నారు. గత ఏడాది వుహాన్‌లో ప్రారంభమైన స్నేహగీతం సహకార రాగం ఆధారంగా 16 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇది పూర్తిగా మోదీ దౌత్య విజయం. అక్కడ కశ్మీర్ ప్రస్తావన శూన్యం.. ఇంతకుమించిన దౌత్య అద్భుతం ఏముంటుంది? డోక్లాం ‘దాదాగిరి’ వుహాన్ మాటామంతీతో మటుమాయం, కశ్మీర్ కల్లోలం మాముల్లపురం భేటీతో కనుమరుగు. ఈ దౌత్య సందేశం.. నవశకానికి ఆరంభం. ఇరుదేశాల స్నేహబంధానికిది అద్దం... సానుకూల పరిణామం... సముద్ర తీర ప్రాంతం... సుందర దృశ్యం... ఇరు దేశాల స్నేహగీతం పల్లవులు నిర్మించిన పట్టణం సాక్షిగా ప్రపంచం మొత్తం చెవియొగ్గి విన్నది. ఈ శతాబ్దపు అపురూప ఘట్టంగా కొందరు జేజేలు పలికారు. ఇరు దేశాల నాయకుల మధ్య కరచాలనం, కెమిస్ట్రీ నిలుస్తుంది కలకాలం. ప్రజలనుద్దేశించి వారుచేసిన అభివాదం ఆద్యంతం అపురూపం.. ఉభయ దేశాలకిది ప్రయోజనకరం. చర్చలు ఫలవంతంతో మారిన ఇరు దేశాల మైత్రీ చిత్రపటం. ఢిల్లీ-బీజింగ్‌ల బంధం అజేయం. ఇది శుభపరిణామం. తలపోసినవన్నీ ఏడాదిలోగా కార్యరూపం దాల్చాలన్న నిర్ణయం నిరుపమానం...
తొలిరోజు మహాబలిపురం.. పల్లవరాజుల పట్టణం... శుక్రవారం సాయం సంధ్యా సమయం... ఆహ్లాదకర వాతావరణం, నిర్మలమైన ఆకాశం... కొంచెం దూరంలో ఘోషిస్తున్న బంగాళాఖాతం... జిన్‌పింగ్, మోదీ ఆత్మీయ సమావేశం... ఓ అద్భుత సన్నివేశం.. ఇరు దేశాల స్నేహగీతం... ఓ సరికొత్త అధ్యాయం... అందుకు సాక్షిగా ఆలయ ప్రాంగణం... గుడి గోపురం...
ఇరువురి మనసులు దోచిన సుసంపన్నమైన శిల్పం... సాంస్కృతిక కార్యక్రమం, కనువిందు చేసిన కళాకారుల నైపుణ్యం... భరత నాట్యం రామాయణ ఘట్టం... అదో అరుదైన దృశ్యం. భారతీయతకు దర్పణం... ఆకాశంలో చంద్రోదయం... మోదీ ద్రావిడ శైలీ ఆహార్యం... జిన్‌పింగ్- మోదీ నవ్వుల హారం- ఓ సరికొత్త విశ్వాసం...
అర్జునుడి తపోప్రాంత శిల్పం... పంచరథ దర్శనం... సందర్భం ఏదైనా ఇరువురి నేతల కరచాలనం... స్నేహానికి ప్రబల నిదర్శనం. సహస్రాబ్దాలుగా ఇరు దేశాలను కలుపుతున్న సముద్రతీరం... సాంస్కృతిక బంధం సజీవం... సరికొత్త చరిత్రకిది సంకేతం... సన్నాయి మేళాల స్వాగతం... శాకాహారం జిన్‌కు పది కాలాలు గుర్తుండే జ్ఞాపకం... ఉత్తరీయం మోదీ సరికొత్త ఆహార్యం. సుహృద్భావం, సౌహార్ద్రం, అభివృద్ధి, ఆశాజనక వాతావరణం ఇదే మంత్రంగా సాగిన మంతనాలు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతో ముగిసిన కార్యక్రమం.
కాగా, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తామే హక్కుదారులమని అనుకుంటున్న భారత మావోయిస్టుల కార్యాచరణ మరోలా ఉంది.
మారణహోమం!
మావోయిస్టుల మూల సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నరేంద్ర మోదీతో రెండురోజుల మాటామంతీ శిఖరాగ్ర సమావేశం సుహృద్భావ వాతావరణంలో, సముద్ర తీర ప్రాంతమైన మామల్లాపురంలో కొనసాగుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దెడ గ్రామంలో మావోయిస్టులు పరికి కిష్టయ్య (27) అనే ఆదివాసిని అతి కిరాతకంగా నరికి చంపారు. అతని భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమెను సైతం నరికి చంపేందుకు ప్రయత్నించగా ఆమె పక్కకు తప్పుకుందని వార్తలొచ్చాయి. భార్యముందే భర్తను నిర్దాక్షిణ్యంగా నరికి చంపడానికి కారణం... కిష్టయ్య పోలీస్ ఇన్‌ఫార్మర్ అట..! ఆ నెపంతో ఇప్పటివరకు వందలాది ఆదివాసీలు, ఇతరులను మావోలు పొట్టనపెట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ఆదివాసీల రాష్ట్రం, వెనుకబడిన ప్రాంతం, భౌగోళికంగా అననుకూలమైనది. మావోయిస్టులు దీన్ని ఆసరా చేసుకుని, తమ స్థావరాలు ఏర్పరచుకుని ఇన్‌ఫార్మర్లపేర ‘మూలవాసుల్ని’ ఖతంచేస్తే అదెలా ఆమోదనీయమవుతుంది? అదెలా అంగీకారమవుతుంది? అదెలా నాగరికమవుతుంది?
ఏ విలువలు పట్టకుండా విశృంఖలంగా తమకు గిట్టని వారిని, తమ ‘హుకుం’ పాటించని వారిని, తమ పార్టీకి సహకరించని వారిని ‘ఖతం’ చేస్తూ ఉంటే ఎవరి కోసం ఈ పోరాటం? అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా? వారి ఆవాసాలకెళ్లి, వారి నేలపై కాలుమోపి, వారిచ్చిన తిండి తిని, వారిచ్చిన ‘లెవీ’ తీసుకుని వారినే నరికి చంపడానికి మించిన దారుణం ఇంకొకటి ఏముంటుంది?
గత నెలాఖరులో మావోలు ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లాలో ముగ్గురు పౌరుల్ని కాల్చిచంపారు. డీజిల్ ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురిని పొట్టనపెట్టుకున్నారు. ఆ ట్యాంకర్‌ను పేల్చేశారు. అదే రోజు సుకుమా జిల్లా దుబ్బకుంట అటవీ ప్రాంతంలో ‘ఇన్‌ఫార్మర్ల’ నెపంతో ఇద్దరు ఆదివాసీ యువకులను కాల్చి చంపారు. ఇలా ఒకే రోజు ఐదుగురు ఆదివాసీ పౌరులను మావోలు ‘ఖతం’ చేశారు. విప్లవ పార్టీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఆదివాసీలకు దక్కిన బహుమానమా ఇదా? చైనా విప్లవ 70వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నవేళ వారికి అందిన ‘కానుక’నా ఇదా? ఏమిటీ ‘ఖతం’ కార్యక్రమం వెనుక దాగిన మతలబు?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన ప్రతినిధి బృందంతో ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నప్పుడు అక్కడ ఆయనకు గిరిజన సాంప్రదాయ నృత్యంతో స్వాగతం లభించింది. ఛత్తీస్‌గఢ్‌లో చైనా సిద్ధాంతాన్ని తలపై పెట్టుకున్న మావోలు మాత్రం గిరిజనుల, ఆదివాసీల మృత్యువుకు స్వాగతం పలికారు. ఇదెంతటి విషాదం?
డోక్లాం, కశ్మీర్ లాంటి క్లిష్టమైన సమస్యలను సైతం పక్కనపెట్టి మనసువిప్పి మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు, అదే పాయలోంచి వచ్చిన భారత మావోయిస్టుల చర్యలకు ఎంతటి వ్యత్యాసం?... కమ్యూనిజం... మావోయిజం వర్తమానంలో ఎలా రూపాంతరం చెందాయో జిన్‌పింగ్ మహాబలిపురం పర్యటన... శిఖరాగ్ర సమావేశం తెలియజేస్తోంది. పెట్టుబడులు -వాణిజ్యం, సముద్రయానం, సాంకేతిక పరిజ్ఞానం ఇలా పలు అంశాలు చర్చనీయమని చాటిచెబుతుండగా, తమ దేశం రావాలని మోదీకి సాదర స్వాగతం పలికిన చైనా విజ్ఞత, రాజకీయ పరిపక్వత భారత మావోయిస్టుల్లో ఏ కోశానా కనిపించవు. రాజకీయ విజ్ఞత, పరిపక్వత, సమకాలీన పరిస్థితుల అంచనా, అధ్యయనం ఇవేవీ పట్టకుండా విప్లవం పేర పేద ప్రజలను-ఆదివాసీలను అంతమొందించడం ఏ విధమైన సిద్ధాంతమవుతుంది?
ఓవైపు మావోయిస్టుల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటనల్లో విప్లవ పార్టీ స్వర్ణోత్సవాలు, చైనా విప్లవ వార్షికోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిస్తూ ఈ మరణ మృదంగం మోగిస్తూ ఉండటం విషాదం గాక ఏమవుతుంది?
ఇదిలా ఉంటే హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఇటీవల విలేఖరులతో మాట్లాడుతూ, నగరంలో 23 ‘ముసుగుసంస్థల’ను ముందు పెట్టుకుని మావోయిస్టులు చాపకింద నీరులా పనిచేస్తున్నారని, ఆ సంస్థల ఆటకట్టిస్తామని ప్రకటించారు. తెలంగాణ విద్యార్థి వేదికకు చెందిన కీలక వ్యక్తులను అరెస్టుచేశారు. వారివద్ద మావోలు ప్రైవేట్ విద్యాసంస్థలకు రాసిన హెచ్చరిక- బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆ పార్టీ దాని అనుబంధ సంఘాల వల్ల ప్రజలకు ఒరిగిందేమిటి? శూన్యమనే సమాధానమొస్తోంది. వేలాది మంది కార్యకర్తల శ్రమ, శక్తి, సమయం, నైపుణ్యం, ధనం ఇలా నిరర్ధకం కావలసిందేనా? ఎక్కడో అక్కడ దీనికి భరతవాక్యం పలికాలికదా? ఆదివాసీల హత్యలు ఆగాలి కదా? చైనాకు దీటుగా అభివృద్ధి జరగాలి కదా?...

-వుప్పల నరసింహం 99857 81799