సబ్ ఫీచర్

అన్యోన్య దాంపత్యం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి..’ అంటూ స్ర్తి ఎలా ఉండాలో చెప్పారు. మరి పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదా.. ఇదీ కొందరి ప్రశ్న.
‘కార్యేషు యోగీ, కరణేషు దక్షః / రూపేచ కృష్ణః క్షమయా తు రామః / భోజ్యేషు తృప్తః సుఖ దుఃఖ మిత్రం / షట్కర్మ యుక్తః ఖలు ధర్మనాథః’- అని పురుషుడు ఎలా ఉండాలో కూడా చెప్పారు. అయితే.. ఎందుచేతనో యిది ప్రాచుర్యంలో లేదు గానీ, స్ర్తి పురుష సమానత్వమే కాదు నాటి నుంచి ‘యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా’ అనేలా స్ర్తి గౌరవించబడుతుంది. ఆ గౌరవంతోనే వివాహ సమయాలలో ‘్ధర్మేచ, కామేచ, నాతి చరామి’ అని పురుషుల చేత చెప్పిస్తారు. జీవితంలోని ప్రతి విషయంలోనూ స్ర్తితోనే కలిసి నడుస్తాను.. అని దాని అర్థం. నిజ జీవితంలో.. ఆ జంట ఒకటై అన్యోన్యంగా దాంపత్య జీవిం గడిపినపుడే వివాహ వ్యవస్థకు అర్థం, పరమార్థం.
దాంపత్యం అంటే..
భార్యాభర్తల అన్యోన్యత!
‘దర్పణం’ అంటే.. అద్దం! అద్దంలో మన ప్రతిబింబం ఏ రీతిలో కనబడుతుందో, మనని మనం స్పష్టంగా ఎలా చూడగలమో, ఎలా చూస్తామో అలాగే దాంపత్య దర్పణంలో ఇతరులు అంత స్పష్టంగానూ భార్యాభర్తల జీవితాలను, నడవడికను, వారి అన్యోన్యతను లేదా వారి కయ్యాలను, ప్రవర్తనలను అంత స్పష్టంగా చూడగలుగుతారు. అందరూ చూసేదీ చూడగలిగేదీ కనిపిస్తున్న భార్యాభర్తల జీవితాల్నే.
ఇది దాచినా ఎవరికీ చెప్పకూడనిదీ, చెప్పరానిదీ, చెప్పము, చూపించము అనుకున్నా- భార్యాభర్తల అన్యోన్యతలూ తగవులూ ఎదుటివారికీ, చుట్టూ వున్నవారికి తప్పనిసరిగా టీవీ సీరియల్‌లా, సినిమా రీలుగా కనిపిస్తూనే వుంటాయి. దర్పణంలో మనని మనమే కాక ఇతరులను ఎలా చూస్తామో, ఎలా చూడగలుగుతామో, అలాగే బాహ్య దర్పణంనుండి ఇతరులూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. అందుకని దాంపత్యం అనేది మనకు కాక చూపరులకీ ఆనందంగా, ఆదర్శంగా, ఆహ్లాదంగా అగుపించాలనే కానీ విందుగా, వినోదంగా, వింతగా, వెక్కిరించేలా అగుపించకూడదు.
చాలామంది భార్యాభర్తల్లో పెళ్ళై ఏళ్ళు గడిచినా వారిమధ్య ఐక్యత, అవగాహన, పరస్పర సహకారం ఏవీ కనిపించవు. ఎప్పుడూ ఏదో విషయంలో అరుచుకోవడం, పోట్లాడుకోవడం ఆనక ఒకరిమీద ఒకరు పడీ, ఆడా మగా మొగుడూ పెళ్ళాం అనే తేడాలు ఏవీ చూపించుకోక సమ ఉజ్జీల్లా ఘర్షణపడుతూంటారు. ఆఖరికి రోడ్డున పడుతుంటారు. అల్లరి పాలవుతుంటారు. ఆఖరికి వారి జీవితమే నవ్వులపాలవుతోంది. ఇదా దాంపత్యం.. అంటే?
వినడానికి చెప్పుకోవడానికి ఎంత అసహ్యంగా వుంటుంది. ఇది బాహ్యదర్పణంలోంచి అందరూ చూస్తూ విందు వినోదం గల్పించే దాంపత్యం కాదా! ఇలాంటి దాంపత్యాలను చూసి ఎవరు హర్షిస్తారు? ఎవరు ఆనందిస్తారు? మరి అందరికీ ఆదర్శం అనిపించగలిగే ‘దాంపత్యం’ అంటే ఎలా వుండాలో మీరే ఆలోచించండి! ముందు మన కళ్ళెదుట కనిపిస్తున్న ఆదర్శ దంపతులను చూసి నేర్చుకోండి! జీవితమంతా భార్యాభర్తలు అన్యోన్యంగా గడపాలంటే ‘దాంపత్యం’లో కొన్ని సర్దుబాట్లు తప్పనిసరి.
మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలకాలం ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. అభిప్రాయాలు, అభిరుచులు ఇద్దరూ పంచుకుంటూ చిలకా గోరింకల్లా కలిసిమెలిసి ఉండాలి. అన్యోన్యత, ప్రేమానురాగాలు.. పెళ్ళైన కొత్తలోనే ఉంటాయని.. రాను రాను ఈ ముచ్చట్లన్నీ.. కనరుమరుగవుతుంటాయని చాలామంది అంటూంటారు. నిజానికి పిల్లలు, బాధ్యతలు, అవసరాలు.. ఇలా పెరిగేకొద్దీ భార్యాభర్తలమధ్య అన్యోన్యతకు కాస్త దూరం పెరుగుతుంది. ఒత్తిడి, రకరకాల పనుల కారణంగా.. ఇద్దరూ ఒంటరిగా గడపడానికి సమయం దొరకదు. దీంతో విభేదాలకు దారితీయచ్చు. కాబట్టి.. ఎలాంటి అవసరాలు వచ్చినా.. ఎన్ని పనులు భుజానికేసుకున్నా.. భార్యాభర్తలమధ్య ప్రేమానురాగాలకు కొరత రాకుండా అన్యోన్యంగా దాంపత్య జీవితం గడపడానికి మనలోని అలవాట్లను, నడవడికలను మార్చుకోవాల్సిందే! కొన్ని సలహాలు, సూచనలను పాటించాల్సిందే! మీకు పెళ్ళై ఎన్ని ఏళ్ళయినా ఒకరికొకరు మనసెరిగి సర్దుబాటుతో కలిసిమెలిసి మెలిగితే ఎప్పుడూ కొత్త జంటలా కనిపిస్తారు.
దాంపత్య జీవితంలో చిటపటలు, చిరుబురులు, చిలిపి తగాదాలు, సరససల్లాపాలు, సంసారంలో సరిగమలు లాంటివి ఎన్నో ఆసక్తికరమైన సంగతులుంటాయి. వివాహంతో రెండు శరీరాలు మాత్రమే కాదు, రెండు మనసులు కూడా ఒక్కటవుతాయి. దీంతో దంపతులిద్దరూ జవితాంతం అలా ఒకే మనస్సులా మారి జీవిస్తారు. ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా, సుఖం దుఃఖం కలిగినా ఇద్దరూ షేర్ చేసుకుంటారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకొంటే బంధం బలపడుతుంది. ప్రతిఒక్క విషయం ప్రేమగా చర్చించుకోవాలి. కావాల్సిన సలహాలు, సూచనలు చెబుతూ ఉండాలి. అలాగే స్వీకరించాలి కూడా. అపుడే ఇద్దరిమధ్య ప్రేమ శాశ్వతం అవుతుంది. ఎలాంటి సమస్యలున్నా వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుం ది. ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరగటమే తప్ప తగ్గిపోదు.
దంపతులిద్దరూ పనిచేసేవారు అయితే ఇద్దరూ అన్నింటినీ షేర్ చేసుకోవాలి. అంటే.. రెంటు, బిల్స్, ఇతర ఖర్చులు, పిల్లలు, ఇంటి పనులు బాధ్యతలతో కూడినవి అన్నమాట. ఈ విషయంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భావన రాకూడదు. ఇద్దరూ సమాన ధోరణితో వ్యవహరించాలి. కెరీర్, దాంతోపాటు కుటుంబ సభ్యుల బాగోగులు కూడా ముఖ్యమని వారు భావించాలి. కుటుంబ సభ్యుల సౌకర్యం, వీలు అంతా ఓకే అనుకుంటేనే కెరీర్ చూసుకోవాలి. కుటుంబంలో అందరూ ఎలాంటి కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా కుటుంబాన్ని వదలకూడదు. సమస్యలన్నీ ఎదుర్కొని ప్రేమతో భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితం సాగిస్తుంటేనే ఆదర్శ దాంపత్యం అంటారు. ఇలా నడుచుకొన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా. ఈ క్రమంలో దంపతులు ఇద్దరూ కొన్ని మార్గదర్శక సూత్రాలను తమ దాంపత్య జీవితంలో పాటిస్తే దాంతో లైఫ్ ఈజీ అవుతుంది. ఆదర్శ దంపతులుగా ఉండవచ్చు.
దంపతులన్నాక ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటారు. వారిని తమవారుగా వారు భావించాలి. యువతి తల్లిదండ్రులను యువకుడు, యువకుడి తల్లిదండ్రులను యువతి తమ సొంతవారిలా భావించి చూసుకోవాలి. దీంతో దంపతులమధ్య ఎలాంటి స్పర్థలు రావు. ఇంటికి సంబంధించిన ఏ విషయమైనా ఇద్దరూ మనది అని భావించాలి. అందుకు స్పందించాలి. కేవలం ఒక్కరు మాత్రమే అలా భావించరాదు. ఏ సమస్య వచ్చినా దంపతులిద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి. అది చిన్న సమస్య అయినా సరే. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. దంపతులమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. వస్తే అది విడిపోవడానికి దారితీస్తుంది. పడకగది అంటే శృంగారానికి మాత్రమే వాడాలి. ఇతర ఏ విషయాలను చర్చించరాదు. ఆఫీసు, ఇల్లు, కుటుంబ సభ్యులు.. ఇలా ఏ విషయాన్నయినా అక్కడ చర్చింరాదు.
దంపతులన్నాక అపుడప్పుడు పలు విషయాల్లో ఇద్దరికీ ఏకాభిప్రాయం రాకపోవచ్చు. అంతమాత్రాన గొడవ పడకూడదు. ఒకరి అనిప్రాయాన్ని మరొకరు తప్పనిసరిగా గౌరవించాలి. ఆహారం విషయంలోనూ ఖచ్చితంగా ఉండాలి. ఒకరికి నచ్చినవే వండి తినరాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకుని అందుకు అనుగుణంగా తమకు ఇష్టమైన రుచులను ఆస్వాదించాలి. కొన్నిసార్లు పలు విషయాల్లో దంపతులిద్దరూ తీవ్రంగా స్పందిస్తుంటారు. అలా జరుగకూడదు. దంపతులిద్దరూ గౌరవించుకోవాలి. ఎలాంటి రహస్యాలు లేకుండా, అనుమానాలకు తావివ్వకూడదు. పెళ్లి అనే బంధాన్ని నిలబెట్టే రెండు స్తంభాలు నమ్మకం, విశ్వాసం. దంపతులమధ్య ఇవి లేకుంటే మాత్రం దాంపత్యం కూలిపోతుంది. అనుమానం అనేది పెనుభూతం. దాన్ని దరిదాపుల్లోకి రానీయకూడదు. అప్పుడే వారి జీవితం బాగుంటుంది.
కొన్ని సందర్భాలలో గొడవైనప్పుడు ఆవేశంలో మాటలు దొర్లి, కోపాన్ని పెంచుకుని, మనస్పర్థలతో కాపురానికి నష్టం కలిగించుకోవద్దు. భార్యాభర్తలమధ్య గొడవలు ఎంత సహజమో, పరిష్కారం కూడా అలానే జరిగిపోవాలి.
భార్యాభర్తలమధ్య సారీలు ఉండకూడదు కానీ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ‘సారీ’ చెప్పడానికి సంకోచించవద్దు. ఒక్క ‘సారీ’ జీవితానే్న మార్చేస్తుంది. శివపార్వతుల్లా ఆదర్శంగా భార్యాభర్తలిద్దరూ నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆనందకర జీవితాన్ని అనుభవించవచ్చు.

-కంసుడు 94926 66660