సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామనుస్మర
‘మామనుస్మర’- ‘ఎప్పుడూ ననే్న స్మరించు’ అన్నారు భగవాన్ గీతలో.
ఎప్పుడూ ఆయననే స్మరిస్తూ ఏ పనిచేసినా అది ‘పూజనమే’అవుతుంది.
అన్ని పనులనూ ఆయనకర్పితంగా చేయాలి. ఆయనే నీ వూపిరి అయినప్పుడు ఆయనలో లీనం కాగలుగుతావు.
సాధనల లక్ష్యం
శాస్త్రాలకు అంతులేదు. సాధనలు లెక్కలేనన్ని అవకాశం మృగ్యం. సమయం తక్కువ. జీవిత సంగ్రామంలో రుూ అడ్డంకులను ఎదుర్కొని తరించవచ్చు. అయితే అందుకు ప్రేమ నీ ఆయుధం కావాలి. ముక్తే అన్ని రకాల సాధనల లక్ష్యం. అదే అన్ని అవకాశాలనూ వినియోగించుకొని, అమూల్య కాలాన్ని వెచ్చించి సాధించుకొనే పురుషార్థం.
ఎవరిదారి వారిది
నీ వయసెంత? నీ హోదా ఏమిటి? నీ వృత్తి ఏమిటి? నీ ఆధ్యాత్మిక సాధన స్థాయి ఏమిటి? నీ జీవిత పరమార్థం ఏమిటి? ఈ విషయాలన్నిటినిబట్టే నీవెలా నడచుకోవాలో నిర్దేశించబడింది.
జీవిత సంగ్రామంలో ధైర్యాన్ని కూడదీసికొని ముందుకుపోయేందుకు ఎవరికి తగిన మార్గాన్ని వారెంచుకుంటారు. కనుక ఇంకొకడేం చేస్తున్నాడు? అని తప్పులెంచి ప్రయోజనంలేదు. అలాటి పోచికోలు కబుర్లతో నీ సమస్యలను దాటవేయలేవు.
ఎవరి దారి వారిది. ఎవరి దైవంవారిది. ఎవరి మతంవారిది. నీవు చేయవలసిన పనిని నీవుచేయి. వదిలిపెట్టకు. ఇంకొకరికి చెప్పిన పనిని నీవు వెళ్లి నెత్తిన వేసుకోవద్దు.
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం అంటే ఏమిటి? నలుగురూ కలిసి భజన చేయటం ఆధ్యాత్మికమా? జపం, ధ్యానం ఆధ్యాత్మికమా? పూజలూ, వ్రతాలూ, ఉపవాసాలూ, ఆధ్యాత్మికమా? తీర్థయాత్రలు ఆధ్యాత్మికమా? ఇవేవీ ఆధ్యాత్మికంకావు. ఆధ్యాత్మిక సాధనకు ఇవన్నీ దోహదం కలిగిస్తాయి. ఆధ్యాత్మికం అంటే అసలర్థం వేరే ఉంది. రెండు పనులను చేయటం, కనీసం చేసేందుకు ప్రయత్నం చేయటం ఆధ్యాత్మికం అనుపించుకుంటుంది. ఆ రెండు పనులూ ఏమిటో తెలుసా? జంతు ప్రవృత్తిని మనిషి మానుకోవడం మొదటిది. దైవంతో తాదాత్మ్యం చెందటం రెండవది.
అంతర్లీనం అనంతం
నువ్వులలో నూనె ఉండినట్లుగా, పాలలో వెన్న ఉండినట్లుగా పువ్వులలో సుగంధ పరిమళం యిమిడి వుండినట్లుగా, ఫలములో మధురమైన రసం వుండినట్లుగా, కర్రలో అగ్ని వుండినట్లుగా, ఈ యావత్ ప్రపంచమునందును కూడనూ భగవంతుడు అంతర్లీనమై ఉన్నాడు.
దివ్యత్వమైనటువంటి ఆత్మతత్త్వమును గుర్తించుటకు అనేక విధములైన ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. పాలను పితికినంత మాత్రమున మనకు వెన్న లభ్యముకాదు. నువ్వులను చేతిలో వుంచుకున్నంత మాత్రమున తైలము మన చేజిక్కదు. వాటిని చేయవలసిన రీతిలో కొన్ని ప్రక్రియలు సలిపినప్పుడే, నువ్వులలో వున్నటువంటి తైలము, పాలలో వున్నటువంటి వెన్న మనకు లభ్యమవుతాయి. అదే విధముగానే సర్వత్రా వుండినటువంటి భగవత్‌తత్త్వము లభ్యముకావలెననిన అనేక విధములైన సాధనలు చేయవలసి వస్తుంది.
కృషిచేసి ఋషివి కా!
ఇక్కడ కొంతమందికి సందేహము కలగవచ్చును. సర్వులయందునూ ఉండినటువంటి భగవంతుడు మాకు ఎందుకు కనిపించడు. దీనికి కారణమేమిటి? ఈ కారణమును తెలుసుకోవటానికి శ్రద్ధ్భాక్తులతో పరిశోధన చేసినప్పుడు, తప్పక భగవంతుడు మనకు కనిపిస్తాడని యోచిస్తున్నామే కాని, దానికి తగిన కృషిమాత్రం మనం చేయటంలేదు. తట్టలోనున్న పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పనిపెట్టాలి. పురుష ప్రయత్నం లేకుండా భగవంతుడు సాక్షాత్కరించాలి అంటే ఏ రీతిగా సాక్షాత్కరిస్తాడు?

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది