సబ్ ఫీచర్

స్మార్ట్ ఫోన్లతో బేజార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌పోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో స్మార్ట్ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరి దగ్గరైనా ఉంటోంది. అదృష్టమో దురదృష్టమో కాని స్మార్ట్ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది. చేతిలోస్మార్ట్ఫోన్ వుంటే చాలు, అందలమెక్కేసినట్లుగా చెలరేగిపోతోంది యువత. ఒక్క యువతే కాదు స్మార్ట్ఫోన్‌కు దాదాపుగా ప్రతిఒక్కరూ బానిసలుగా మారిపోతున్నారు. సిటీలనుండి ప్రారంభమైన స్మార్ట్ఫోన్‌ల వాడకం ప్రస్తుతం గ్రామాలకు ప్రాకి వ్యక్తులను తనకు బానిసలుగా మార్చుకుంది. 4వ జెనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ఫోన్ మరింత స్మార్ట్‌గా జనానికి చేరువైపోయి యువత జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది. ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియాతో యువత ప్రతిక్షణం మునిగితేలుతున్నారు. అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి అంతర్జాలానికి బానిసలుగా మారే ప్రమాదం ఏర్పడింది. గత రెండు మూడు సంవత్సరాలనుండి యువకుల జీవితాలలో అవాంఛనీయ ధోరణి ప్రారంభమైంది. సోషల్ మీడియా వ్యసనానికి బానిసలయ్యాక యువకులు త్వరగా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు అలవాటైపోయిన యువకులు ఒక్కరోజు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే తల్లడిల్లిపోతున్నారు. కొందరిని చూస్తే ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా రాకపోతే సిగ్నల్‌కోసం ఇంటిపైకి ఎక్కి సిగ్నల్ కోసం తాపత్రయపడుతున్నారు. ఎక్కడికి వెళ్తుందో ఈ సమాజం.. అప్పుడప్పుడు భయమేస్తోంది. దీనికి కారకులు ఎవరు? చిన్నపిల్లల చేతిలో కూడా స్మార్ట్ఫోన్ పడగానే పిల్లవాడు ఏడుపు ఆపేస్తున్నాడంటే ఆలోచించండి... విద్యావిధానంలోని ప్రాజెక్టుల పేరుతో పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతోంది. దీనివల్ల ఆలోచనా గుణం మందగించడం, ప్రతిదానికి గూగుల్‌పై ఆదారడటం మామూలైపోయింది. పిల్లల్లో మానసిక స్తబ్దత కూడా పెరుగుతోంది.
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతూ మన ఆరోగ్య విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాం. తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లు లభించడంతో ప్రతి ఒక్కరూ వాటిని క్షణాల్లో కొనేస్తున్నారు. దానికితోడు స్వల్పధరకే అపరిమిత అంతర్జాలం. ఈ రెండింటికి తోడు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లతోపాటు అనేక రకాల ఆప్స్ అరచేతిలో ఆటాడుతున్నాయి. చదువుకునే వయసులో పుస్తకాల పురుగులు కావాల్సిన పిల్లలు.. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు.. బ్యాగులను ఓ మూలన పడేసి ఫోన్ల వాడకంలో మునిగితేలుతున్నారు. ఏ ఫ్రెండ్ ఏం పోస్ట్ చేశాడు? తను పెట్టిన ఫొటోకు ఎంతమంది లైకులు కొట్టారు? ఎంతమందికి షేర్ చేశారు? ఏం కామెంట్స్ పెట్టారు? అని ఫోన్‌లలో వెతుకుతున్నారు. చివరికి తిండి కూడా మర్చిపోతున్నారు. నిద్రకూడా సరిగా పోకుండా అనారోగ్యానికి గురవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. స్మార్ట్ఫోన్ల ప్రపంచంలో విహరిస్తున్న యువత, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, సెక్స్‌పరమైన విషయాలపట్ల స్పందించటంలో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇది మానవాళి మనుగడకు దుష్పరిణామం. యువత మరియు పిల్లల్లోని ప్రవర్తన, ఆలోచనా ధోరణులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత, సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దలపైనే వుంది. విచిత్రం ఏమిటంటే ఫోన్లు చూసుకుంటూ రోడ్డు దాడటం, నడుచుకుంటూ వెళ్ళడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు కోకొల్లలు. రాత్రి పడకగదిలో మంచంకి ఎక్కిన తర్వాత కూడా ఫోన్లతో నిద్ర సరిగా పట్టదు. దాంతో దాంపత్య జీవితాలలో చిచ్చులు, గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు ఆనందంగా గడిపిన జీవితం, ఫోన్ల ప్రవేశంతో దుఃఖసాగరంలోకి నెట్టివేసింది. జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగడానికి సమయం దొరకడంలేదు. శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. పిల్లలకంటే తల్లిదండ్రులే ఈ స్మార్ట్ఫోన్ల వినియోగానికి బానిసలైపోయారు. సరదాగా గడిపే సమయంలో నాలుగో వంతు కూడా పిల్లలతో గడపడానికి సమయం కేటాయించడంలేదు. పరస్పరం కలుసుకుని ముఖాముఖి సంభాషించుకోవటం అనేది జరగడంలేదు. దీంతో అనురాగం, ఆప్యాయతలు, అభిమానం, ప్రేమల విలువలు తెలియడంలేదు.
యువతలో అయితే సెల్ఫీలు తీసుకోవడం పిచ్చిగా మారింది. ఆన్‌లైన్‌లో, ఫోన్ చాటింగ్‌లలో గడిపే యువత నిద్రించే సమయం బాగా తగ్గిపోయింది. నిద్రలేమివల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళడం జరుగుతోంది. ఫలితంగా ఇంతకుముందెన్నడూ లేనివిధంగా తీవ్రమైన వాయకులత, నిస్పృహ, ఒంటరితనానికి లోనౌతోంది యువత. ఈ స్మార్ట్ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. యువత చేతుల్లోకే భావి ప్రపంచం వెళ్ళబోతోంది. కాబట్టి యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. తగిన విధంగా యువతకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సమాజంపైన వుంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి తగ్గట్టు వాడుకోవాలే కాని బానిస కారాదు.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321