సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిష్ఠ
మానవుడు జన్మించింది ఎందుకు? తిని తిరగటానిక్కాదు. తీరిగ్గా నిదురించటానికీ కాదు. యమనియమాలతో, శమదమాలతో సాధనచేసి తనలోని దైవత్వాన్ని సాక్షాత్కరింప చేసికోటానికి. వ్యక్తి అంటే ఏమిటి? వ్యక్తంచేసే వాడే వ్యక్తి. ఏమిటి ఆయన వ్యక్తంచేసేది? శక్తిని. తనలోని దివ్యశక్తిని. తనకు స్ఫూర్తినిచ్చే శక్తిని వ్యక్తం చేసుకోవాలి. అందుకే మానవునికి శరీరాన్నీ, బుద్ధినీ యిచ్చింది. అతడు మనోనిగ్రహంతో తనలోని శక్తిని వ్యక్తపరచి, అదుపులో వుంచుకొని, ప్రయోజనాత్మకంగా వినియోగించుకొనాలి. ధర్మం, నిష్ఠ, కర్మ యిందుకు సాధనాలు. ధర్మాన్ని పాటించాలి, కర్మాన్ని ఆచరించాలి-అన్న నీతి, దీక్ష, సత్ప్రయత్నం ఇవే నిష్ఠ.
సాధన అవసరం
కనె్నంత ఉంది? మహావుంటే, ఒకటో, రెండో అంగుళాలంత! అయినా ఆ కన్ను లక్షల కొలది మైళ్లదూరంలో వుండే నక్షత్ర మండలాన్ని చూడగలుగుతోంది. కాని, పాపం, అది తననుతాను చూసుకోలేదు!
మనిషి కూడా అలాగే. అతని తెలివి అమోఘం. ఇతరుల పని పాటలను చక్కగా విశే్లషించగలడు. వాళ్ల తప్పులనూ, లోపాలనూ ఎత్తి చూపగలడు. కాని తన లోపాలు తెలుసుకోలేడు. తన అంతరాత్మను దర్శించలేడు. సాధన వల్లనే అది సాధ్యం.
కళ్లెందుకు?
మనకు కళ్లెందుకు? ఏదిబడితే అది చూడటానికా? కాదు. కైలాసనాధుని కన్నుల నిండా నింపుకోడానికి. పవిత్ర స్థలాలను దర్శించటానికి. అందరిలోనూ, అంతటా సత్ పదార్థాన్నీ, దైవాన్నీ సందర్శించటానికి. అదీ భగవంతుడు మనకు కళ్లిచ్చిన కారణం.
పరుల తప్పులను వెదకటానికీ, ఎన్నటానికీ మనకు ఆయన కళ్లివ్వలేదు. బజార్ల వెంట తిరగటానికీ, చూడరాని సినిమాలన్నీ చూడటానికీ ఆయన కళ్లివ్వలేదు.
తమస్సు- తపస్సు
కంటిలో శుక్లం వుంటే దృష్టి మందగిస్తుంది. శుక్లాన్ని తీసేయండి! చక్కగా కనుపిస్తుంది.
మిమ్మల్నిమీరు కించపరుచుకుంటే మీరు మరుగుజ్జులౌతారు. న్యూనతాభావాన్ని వదిలేయండి! మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపులుగా, నిత్యస్వరూపులుగా, ఆనంద స్వరూపులుగా గుర్తించండి! అప్పుడు మీరేం చేసినా అదే అర్చనవుతుంది. ఒక యజ్ఞవౌతుంది. మీ యింద్రియాలు మీ పతనానికికాక ప్రగతికి దోహదం చేస్తాయి. మీలోని తమస్సును తపస్సుగా మార్చుకోండి!
తపస్సనగా ఏమిటి? మనయందున్న దివ్యత్వాన్ని మేల్కొల్పడమే తపస్సు. ఇది ఎప్పుడు మేల్కొంటుంది? మనలో ఉండినటువంటి సత్వరజస్తమో గుణములను ఏకత్వము గావించినప్పుడే తమస్సు మారిపోయి తపస్సుగా రూపొందుతుంది.
జీవిత ఖైదు
పరమాత్మ సముద్రమయితే నీ ఆత్మ అందులో చెలరేగే ఒక అల లాంటిది. సముద్రం వేరు, అల వేరు కాదు. కాని నేరుగా కనిపిస్తున్నాయి. ఆ రెంటి మధ్యా సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోటంలోనే జీవిత పరమార్థం వుంది. ఆహార నిద్రా భయమైధునాల వంటి కార్యక్రమాలు పశుపక్ష్యాదులకు కూడా సామాన్య ధర్మమే. మానవ జన్మ విశిష్టత ఆత్మదర్శనమే.
పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా పశుపక్ష్యాదులలాగా పొట్టపోసికొనే తాపత్రయమే అయితే జీవితం వృథాగాగడచిపోతుంది. మళ్లా ఇంకొక జీవిత ఖైదు (జన్మ) తప్పదు.
బంప్స్ అండ్ జంప్స్
ఎప్పుడు చూసినా నీవు బంప్స్ అండ్ జంప్స్‌లతో సతమతమవుతున్నావు. నీవు జపం చేయాలని కూర్చుంటావు. చేతిలో జపమాల తిరుగుతుంది కాని, మనస్సు బజారులో వ్యాపారం చేస్తుంటుంది. ఈవిధంగా నీవు కాలాన్ని వ్యర్థం చేయవద్దు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీ ఇంటి పనులు నీవు చేసుకో. అవి కూడా భగవంతుని పనులేనని భావించుకో! నీవు ఇల్లు ఊడ్చే సమయంలో ‘‘నా హృదయంలోని అశుద్ధాన్ని ఊడుస్తున్నా అనుకో! నీవు చపాతీ వత్తే సమయంలో ‘‘నా హృదయాన్ని విశాలం చేసుకుంటున్నాను’’ అనుకో! నీవు కూరగాయలు తరిగే సమయంలో ‘‘నా దుర్గుణాలన్నింటిని కోసివేస్తున్నాను’’అని భావించుకో!

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల - కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది