సబ్ ఫీచర్

సిరియాలో ఆగని మృత్యుఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రరాజ్యాల విస్తరణాధిపత్యం, ఆటవిక యుద్ధోన్మాదం నేడు ‘ప్రపంచ రాజకీయ నీతి’గా చెలామణీ అవుతోంది. సిరియా ఈశాన్య ప్రాంతం నుంచి అమెరికా సైన్యం ఉపసంహారం, కుర్దిష్ మిలిటోయాపై టర్కీ దా డులు, మళ్లీ అమెరికా ఆంక్షల కారణంగా కాల్పుల నిలుపుదల వంటి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నిస్సహాయ పౌర జీవన విపత్కరతకు అద్దం పడుతున్నాయి. తమను ఆశ్రయించిన చిన్న దేశాలకు ఆర్థికంగా, రక్షణ పరంగా శక్తియుక్తులు అందించటం సంపన్న దేశాలకు పరిపాటి. దీంతో ఇరుగుపొరుగు శత్రు దేశాలతో- ‘పెద్దన్న’ల అండచూసుకొని యుద్ధోన్మాదం తలెత్తుతోంది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాధిపతులు అత్యాధునిక ఆయుధ సంపత్తి సమకూర్చుకోవటంలో పోటీపడుతున్నారు. దీంతో సార్వభౌమాధికారం, రక్షణ, రాజకీయ ప్రయోజనాలు, ఉగ్రవాద బీభత్సం, మతోన్మాదుల అరాచకత్వం, అంతర్గత తిరుగుబాట్ల విషయంలో ప్రతి దేశం అప్రమత్తం కావలసి వస్తోంది.
‘ఐసిస్’కు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దు గెరిల్లాల ఆధ్వర్యంలోని సిరియా డెమొక్రటిక్ ఫోర్స్‌కు అమెరికా ఇన్నాళ్లు బాసటగా నిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధం అంతమయ్యేవరకు సిరియా సహా పశ్చిమ ఆసియాలోని అధిక భూభాగం ఇస్తాంబుల్ పాలిత ఒట్టొమన్, ఖిలాఫత్ అధీనంలో వుండేది. తరువాతి దశాబ్దాలలో టర్కిష్ జాతీయతా గుర్తింపు తలెత్తి బలపడింది. టర్కీకి ముస్లిం ప్రపంచంతో ప్రోత్సాహం లభిస్తోంది. టర్కీ జనాభాలో నాల్గవవంతు అంటే సుమారు 20 మిలియన్ కుర్దు జాతీయులు అభివృద్ధికి నోచుకొని సౌత్ ఈస్ట్‌లో ఉండడంతో వారిలో అనేక సంఘర్షణలు రగులుకొని పీకేకే పార్టీ ఏర్పడింది. ఇరాన్, ఇరాక్, సిరియాలలో కూడా అతి తక్కువ జనాభాగా కుర్దులు వుండటం, కాలక్రమేణా కుర్దుస్థాన్ ఏర్పాటు ఆశయం తీవ్రవాదంగా రూపొందింది. ఇరాకీ కుర్దులు కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వంగా బాగ్దాద్‌తో బాంధవ్యం నెలకొల్పారు. ఇస్లామిక్ స్టేట్ వినాశన ఆశ యం, అంతర్యుద్ధం, ఉగ్రవాదం సిరియా సంక్షోభానికి కారణమవుతున్నాయి. సిరియా, ఇరాక్‌లలో కుర్దిష్ తిరుగుబాటు టర్కీ-సిరియా సరిహద్దు రణరంగమైంది. ఇటీవల అమెరికా నార్త్ ఈస్టరన్ సిరియా నుంచి, ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దిష్ మిలిటియాకు సైన్యం మద్దతు ఉపసంహారం, టర్కిష్ అధ్యక్షుడు ఇర్టోగన్‌కు, కుర్దిష్ ఫైటర్‌లను అణచివేయటానికి, మిలటరీ వైమానిక దాడుల మారణ సమరానికి అవకాశం కల్పించింది. సిరియాలో ఏళ్ల తరబడి కొనసాగిన సివిల్‌వార్ కారణంగా 3.6 మిలియన్‌న్ల మంది శరణార్థులుగా టర్కీలో తలదాచుకొంటున్నారు. వైపిజి రక్షణలో వున్న సిరియన్ కుర్దిస్థాన్‌కు, తమ దేశ సరిహద్దు ప్రాంతంలో సేఫ్‌జోన్ ఏర్పాటుచేయటం, ప్రస్తుత ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’ సంకల్పమని టెర్రర్ కారిడార్ లేని శాంతియుత సరిహద్దుల ప్రశాంతత నెలకొల్పటం ఈ పాశవిక మారణదాడుల లక్ష్యమని టర్కీ అధ్యక్షుడు ఇర్డోగన్ అంకారాలో ప్రకటించాడు. సిరియా అధ్యక్షుడు బఫార్ అస్సాద్ మరొక అగ్ర సంపన్న రాజ్యం రష్యా కనుసన్నలలో వుండటంతో రష్యా అధ్యక్షుడు పుతిన్, టర్కీ దాడులు, ఇస్లామిక్ స్టేట్ పునరుజ్జీవానికి మళ్ళీ కారణం కావచ్చునని ప్రకటించటం విశేష వార్తాంశం.
ఎఎఫ్‌పి నివేదిక ప్రకారం సిరియా సంక్షోభం ప్రస్తుత దశాబ్దంలో అత్యంత విషాదఘట్టంగా, అమానుష మానవ సంహారంగా ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇంతవరకు 3,50,000 క్రూరంగా హతం కాగా, జనాభాలో సగంపైగా శరణార్థులుగా టర్కీ, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టుల్లో తలదాచుకొంటున్నారు. 2018 ఫిబ్రవరి నాటి లెక్కల ప్రకారం 13,000 మంది ఉరి తీయబడగా, నిర్బంధంలో 17,700 మంది మరణించగా, 5 లక్షల మంది ఖైదీలుగా, 60,000 మంది అమానుష హింసకు ప్రాణాలు కోల్పోయారు. పతనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆకలి, అనారోగ్యం, దారిద్య్రం పౌరులను నిరంతరం పీడిస్తోంది. 23 మిలియన్ జనాభాలో 6.1 మిలియన్ పౌరులు దేశంలో అంతర్గతంగా ప్రవాస శిక్షలు అనుభవిస్తుంటే 5.4 మిలియన్ ప్రజలు దేశం నుంచి పారిపోయారు. రసాయనిక ఆయుధాలు, సరిన్, క్లోరిన్ వంటి ప్రమాదకర విషవాయువులతో బాంబుదాడులు నిస్సహాయులైన మహిళలు, పిల్లలు మృత్యువు ముంగిటకు చేరడం అక్కడ పరిపాటి.
2011లో రగుల్కొన్న సిరియా అంతర్యుద్ధం నిత్యాగ్ని గుండంగా ఆరని కాష్ఠంగా మానవ మహా విషాద మృత్యుఘోష ప్రతిధ్వనింపచేస్తోంది. సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు ఇరాన్‌కు అనుకూలుడైన సిరియా అధ్యక్షుడు అస్సద్ పతనాన్ని కోరుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లు అక్కడ రాజ్యాధికారం మారాలని తిరుగుబాటుదారులకు మద్దతుగా వున్నాయి. అస్సాద్ తొలగింపు సాధ్యం కాక పోగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆధిపత్య దిశలో పావులు కదుపుతోంది. నిస్సహాయ జనహననమే లక్ష్యంగా అస్సద్ ఎంత అనైతిక అరాచకంతో వ్యవహరిస్తున్నా, రష్యా కాచుకొంటోంది. రసాయనిక ఆయుధాలు వినియోగిస్తున్న సిరియాపై ఆంక్షలు విధించాలన్న అమెరికా తీర్మానాన్ని 2017 ఫిబ్రవరిలో రష్యా, చైనాలు వీటో చేశాయి. 1300 టన్నుల పైగా రసాయనిక ఆయుధాలు అమ్ముల పొదిలో చేర్చుకొన్న సిరియా ఐఎస్ ఉగ్రవాదుల గుప్పెట్లోకి వెళితే అంతర్జాతీయ విలయం పొంచి వుంది. అగ్ర దేశాధిపతుల కంటి తుడుపు చర్యలు, ఓదార్పు ప్రకటనలు ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోగా ఊహకందని మృత్యుబీభత్సాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పటికైతే రాజకీయంగా సంక్షోభాన్ని పరిష్కరించగల అవకాశాలు లేవు. ఒకప్పుడు అమెరికా, సోవియట్ యూనియన్‌ల ప్రచ్ఛన్న ద్వేష విద్వేషాల సమర ఉన్మాదానికి ఆఫ్ఘానిస్థాన్ రంగస్థలిగామారిన విధంగా అగ్రదేశాల పోరులో సిరియా అల్లాడుతోంది. ఇందుకు అమెరికా, రష్యా, ఇరాన్, ఐరోపా దేశాలన్నీ బాధ్యత వహించాల్సిందే. అంతర్జాతీయ ఒప్పందాలు, ఆంక్షలు, ఐరాస శాంతి ప్రతిపాదనలు.. సిరియాకు ఉపశమనం కలిగించగలవా?

-జయసూర్య 94406 64610