సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మయే పరమాత్మ
దేవునికోసం చేసే పూజను ఎంత ప్రేమతో ఎంత శ్రద్ధగాచేస్తామో, మనం చేసే ప్రతిపనీ అంత శ్రద్ధగానూ, అంత ప్రేమతోనూ చేయాలి.
మీరు తినేది ఎవరికోసం? మీలోని ‘నేను’ను తృప్తిపరచటానికే; మంచి బట్టలు వేసుకొనేది ఎందుకోసం? మీలోని ‘నేను’ సంతోషంకోసమే; భర్త భార్యను ప్రేమించేది దేనికి? తనలోని ‘నేను’ సంతృప్తికోసమేగదా! ఇంతకు ఈ ‘నేను’ ఎవరు? ప్రతి వ్యక్తిలోనూ ఈ ‘నేను’ వస్తున్నాడు. ఆ ‘నేను’ ఎవరో కాదు. దేవుడే!
‘ఈశ్వరః సర్వభూతానాం’ - అందరిలోనూ దేవుడు వున్నాడని గీత చెప్పిన దాని అర్థం అదే!
అందరిలోనూ, అంతటావున్న ఆత్మే పరమాత్మ!
త్రిపుటి
ప్రతిరోజూ నీవు భోజనం చేస్తున్నావు. అంటే ఏమిటి? నీలోవున్న జఠరాగ్నిలో ఆహారం వేస్తున్నావు. జీర్ణం అయేందుకు ఆహారాన్ని పచనం చేస్తున్న ఆ అగ్నే భగవంతుడు అంటున్నది గీత. అంతేకాదు, తినువాడు బ్రహ్మమే. తినబడేది బ్రహ్మమే. తినటం అనే పని కూడ బ్రహ్మమే. ఇదే త్రిపుటి.
అందుకనే మనం భోజనం చేయడం కూడా భగవత్కార్యంగానే భావించి ప్రార్థనా పూర్వకంగాచేయాలి. కృతజ్ఞతా పూర్వకంగాచేయాలి. ఇదీ సాధనలో భాగమే.
వౌనం, శౌచం, సహనం
భగవంతుని మాట నీకెలా వినిపిస్తుంది. చుట్టూ యింత గందరగోళం ఉంటే? భగవద్వాణి వినిపించేది వౌనికే. శౌచం పాటించటం ద్వారా నీకు పవిత్రత చేకూరుతుంది. సహనంవల్ల ప్రేమ పెంపొందుతుంది. ఇది నీ యిల్లు, నాది కాదు. నా యిల్లు నీ హృదయమే! కాబట్టే నీవు నీ యింట్లో తప్ప ఎక్కడా భోజనం చేయకు. నాచే పునీతం చేయబడ్డ ప్రసాదానే్న భుజించు.
బాధ గురువు
కొత్తచోట నీ దారికి అడ్డంగా ఒక ఏరు వచ్చిందనుకో. ఆ ఏటిలో కాల్నడవ ఎక్కడ? ఎక్కడ దాటితే క్షేమంగా అవతలి వొడ్డుకు చేరతాము అని ఆలోచించుకోవాలి. స్థానికులను అడుగుతావు ‘దారెటు?’అని. కాని కుంటివాణ్ణో, గుడ్డివాణ్ణో అడుగుతావా? దారి చూచుకొని ఏరుదాటిన వాడే నీకు సరయిన సలహాయిస్తాడు. దానికి పండితుడక్కరలేదు. సాధకుని స్థాయిని గమనిస్తూ, అనుభూతి పూర్వకంగా సలహాయిస్తూ ముక్తిమార్గంలో నడిపించే గురువు కావాలి కాని, శాస్త్ర వచనాలను చిలకపలుకుల్లా వల్లించేవాడూ, ఎవరు దొరుకుతాడా డబ్బు వసూలు చేయటానికి అని చూసేవాడూ తారసిల్లితే ప్రయోజనం లేదు.
ఆరోగ్యం
‘ఆరోగ్యం మహాభాగ్యం’అని పెద్దలు చెబుతున్నారు. ‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’అని శాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలను సాధించాలంటే దానికి సాధనం శరీరమే. కనుక శారీరక ఆరోగ్యం ప్రధానం. ఆరోగ్యం లేకపోతే మనిషి బ్రతుకుతెరువు చెడుతుంది. ఆధ్యాత్మిక సాధనకు అంతరాయం కలుగుతుంది. ఏది చేయాలన్నా ఆరోగ్యం లేనిదే ఏ పనీ సాగదు. అందుకని ముందు పురుషార్థ సాధనమైన దేహాన్ని సరిగా వుంచుకోవాలి.
పదవి బాధ్యతకు గుర్తు
భగవంతుడు మీకు యిచ్చిన సంపదలనూ, హోదానూ, అధికారాన్నీ, తెలివితేటలనూ చూసుకొని పొంగిపోకండి! అవి పరోపకారానికి వినియోగించండి! ఆ ఆస్తికీ, అంతస్థుకూ, అధికారానికీ మీరు కేవలం ధర్మకర్తలు. అవన్నీ ఆయన కరుణకు ప్రతికలు. సేవ చేసేందుకు మీకు దొరికిన సదవకాశాలు. మీకు అప్పగించబడ్డ బాధ్యతకవి గుర్తు.
ఇతరుల లోపాలను ఎంచటం అదేదో ఘనకార్యం అనుకోకండి! మరొకరి పొరపాట్లను సానుభూతితో చూడండి! ఎవరిని గుర్తించైనా మంచి మాటలే వినండి! కొండేలకు చెవి యొగ్గకండి!

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది