సబ్ ఫీచర్

ఆయన మాటే.. ఓ ముచ్చట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిబాబు సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో రావి కొండలరావుకు ఒక్క డైలాగూ లేదు. కారణం -అతని భార్య సూర్యకాంతం. భర్త పాత్రలో ఎవరున్నా ఆమె ముందు నోరెత్తే ధైర్యం ఎవరికి ఉంటుంది. అందుకే -రావికి చివర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది. అది ‘ఏవయ్యా! మాట్టాడవు’ అని ఆవిడంటే.. ‘ననె్నప్పుడైనా మాట్లాడనిచ్చావా’ అంటారు.
ఆ సీన్‌లో రావి ఎక్స్‌ప్రెషన్ చూసి సూర్యకాంతం ఫక్కున నవ్వేశారట.
సిల్వర్ స్క్రీన్‌మీదే కాదు -లైఫ్ స్క్రీన్‌మీదా రావితో మాట్లాడం ఓ హాయైన విషయం. సందర్భానికి తగిన ఎక్స్‌ప్రెషన్ ఆయన ముఖంమీద పలికేసరికి -మనకు నవ్వొస్తుంది. సినిమా మనిషే కాదు, చాలా సరదా మనిషి చెప్పే ఆ ముచ్చట్లు ఈవారం కూడా.

‘శ్రీ కృష్ణార్జున విజయం’ సినిమాలో ఓ పాటను డ్యాన్స్‌మాస్టర్ శ్రీను దర్శకత్వంలో ఊటీలో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, రోజా జోడీపై సాగే పాటకు దాదాపు 30మంది జూ.ఆర్టిస్టులు కావాలి. డ్యాన్స్‌మాస్టర్ శ్రీనుకు అంతమంది ఎక్స్‌ట్రా ఆర్టిస్టులు దొరక్కపోవడంతో, కొంతమంది మగాళ్లకే ఆడవేషాలు వేయించి పాటను పూర్తిచేశారు. ఆ డ్యాన్సర్లు -ఇటొచ్చేయండి.. ఇక్కడ ఈ స్టెప్ వేయండి.. అంటే ఆడవేషాలు వేసిన మగవారు తమని గుర్తుపట్టకుండా మ్యానేజ్ చేయడం చాలా గొప్ప విషయమని చెబుతారు రావికొండలరావు. వేషాలు వేసినోళ్లకు, షూటింగ్‌లోవున్న రావికి, ప్రొడక్షన్ మేనేజర్ తాండవ కృష్ణ, డ్యాన్స్‌మాస్టర్ శ్రీనుకు తప్ప మరెవ్వరికీ మగవాళ్లు ఆడవాళ్ల వేషాలతో నృత్యాలు చేస్తున్నారని తెలీదు. తెలిస్తే ఎక్కడ షూటింగ్ ఆగిపోతుందని భావించి.. మిన్నకుండిపోయారు. ‘సినిమా అంటే ఇలాంటి విచిత్రాలు తప్పవుమరి. కానీ, ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది డ్యాన్స్‌మాస్టర్ శీను ధైర్యాన్ని’ అంటారు రావి.
చిత్తూరు నాగయ్యను అంతా నాన్నగారూ అని పిలుస్తారు. అలా ఆయనకు పిల్లలులేని లోటు తీరేశారు అప్పటి ఆర్టిస్టులు. ఆయనంటే నిజంగానే అందరికీ నాన్నలాంటి గౌరవం. యోగి వేమన సినిమా చూసినప్పటినుంచి ఒక్కసారైనా ఆయన్ని చూడగలనా అనుకునేవాడ్ని. ఓసారి విజయవాడలో నాగయ్యను చూసిన వ్యక్తిఉన్నాడని తెలిసి, కనీసం ఆయన్ని ముట్టుకుని ఆనందిద్దామని వెళ్లొచ్చిన వీరాభిమాని నేను. అంతగా అభిమానించిన ఆయనకు స్నేహితుడిగా ‘మరపురాని కథ’ చిత్రంలో నటించటంతో నా జన్మ ధన్యమైపోయింది. ఆ చిత్రంలో నాగయ్యను ఓరకంగా కమాండ్ చేసే పాత్ర అది. ‘అలా కూర్చోవయ్యా.. ఇప్పుడు నీ కూతురును చూసుకోవడానికి అబ్బాయి వస్తాడు.. చూడు’ అంటూ అజమాయిషీ చేసే పాత్ర. ఆ పాత్రను తమిళంలో సహస్రనామం ధరించారు. ఆ పాత్రకు కాస్త సంగీతం పిచ్చి ఉంటుంది. కూని రాగాలు తీస్తుంటాడు. ఇక్కడ విశేషమేమంటే.. సెట్‌లోనే నాగయ్య దగ్గర ఓ రాగం నేర్చుకుని పాడే ప్రయత్నం చేశా. ‘అఠాణా’ రాగంలో ఉండేలా నాగయ్య చిన్న హమ్మింగ్‌ని అప్పటికప్పుడే నేర్పించారు. ఆ హమ్మింగ్‌తోనే పాత్రను పండించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు రావి. ‘ఎక్కడ నేను.. ఎక్కడ ఆయన.. ఆయనను నువ్వు అని పిలవడం నా అదృష్టం’ అంటారాయన. నా చిన్నప్పుడు పోతన, వేమన చిత్రాలు చూసినప్పుడు నా వయస్సు 17 ఏళ్లు. మా అన్న సినిమా చూసి వచ్చి చాలా బాగుందని చెప్పడంతో మరుసటిరోజు సినిమాకు వెళ్లాను. మళ్లీ వెంటనే రెండో ఆట కూడా చూశాను. అలా స్కూలుకు సెలవున్నప్పుడు కుదిరేది కాదు కానీ, స్కూల్‌కు వెళ్లినపుడల్లా క్లాసులు ఎగ్గొట్టి మ్యాట్నీలకు వెళ్లి ఎన్నిసార్లు ఆ సినిమా చూశానో నాకే తెలియదు అని అంటారు రావి. యోగి వేమన చిత్రంలో ‘అజ్ఞానినైన నాకు జ్ఞానబోధ ప్రసాదించండి’ అని తనముందు ప్రత్యక్షమైన ఓ యోగిపుంగవుడిని బతిమాలుతారు నాగయ్య. ఆయనెవరో కాదు, నాగయ్యకు నిజ జీవితంలో గురువైన రాయప్రోలు. నటనలో ఓనమాలు దిద్ది డైలాగ్ ఎలా చెప్పాలి, డిక్షన్ ఎలా వుండాలి అని నేర్పిన గురువే ఆయన అని గొప్ప విషయం చెప్పారు రావి. ఇప్పటికీ ప్రపంచంలో వచ్చిన ‘వరల్డ్ క్లాసిక్స్’ చిత్రాల జాబితాలో ‘యోగి వేమన’ ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
పాతాళభైరవి చిత్రంలోని పద్మనాభం పాత్రను గుర్తు చేసినపుడు -చెప్పుకోదగ్గ దర్శకుడు కెవి రెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రావి. పాతాళభైరవిలో పద్మనాభం పోషించిన సదాజపుడి పాత్రకు ఎప్పుడూ ముఖంమీద తెర ఉంటుంది. జపం చేసుకుంటూ ఉంటాడు. ఆ తెర ఎందుకు పెట్టారలా? అని అడిగినపుడు -చివర్లో హీరో స్నేహితుడు అంజిగాడు సదాజపుడిగా వేషం మార్చి మాయలఫకీరును మోసం చేస్తాడు. ఆ తెర ఉండబట్టే మాయల ఫకీరు సదాజపుడే వచ్చాడనుకుంటాడు. అది చిత్రానికి కీలకమైన సన్నివేశం. కనుక సదాజపునికి ఆ తెర వేయడానికి కారణాన్ని తెలిపారు కెవి రెడ్డి. అలాగే పెద్దమనుషులు చిత్రంలో ఓ కారు ఎప్పుడూ ఆగిపోతూ వుంటుంది. దాన్ని పాత్రలు తోసుకుంటూ వెళతాయి. ఇదెందుకు చేశారంటే, అది కూడా కథలో భాగంగా క్లైమాక్స్‌లో వస్తుంది కనుక అప్పటికప్పుడు కారు ఆగిపోయిందంటే ప్రేక్షకులు ఒప్పుకోరు కనుక మొదటినుంచీ ఆ కారుకి ఆ ఇబ్బంది వుందని చూపడంతో సన్నివేశం పండింది. కనుక కథ ముగింపులో కావాల్సిన విషయాలను ప్రేక్షకుడికి మొదటినుంచే అలవాటు చేయడం కెవి రెడ్డి టెక్నిక్ అంటారు రావి.
అమరసందేశం చిత్రం మొదట కెవి రెడ్డి దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. కానీ కుదరలేదు. అమర్‌నాథ్ నటించిన అమర సందేశం చిత్రం బాగా ఆడకపోయినా దర్శకత్వంలోవున్న మెరుపులను గమనించి ఆదుర్తి సుబ్బారావును ఎంపిక చేశారు తోడికోడళ్లు చిత్రానికి. దర్శకులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు తాము నటించి చూపి ఆ విధంగా చేయమంటారు. కొందరు మీకొచ్చింది నటించమంటారు. నటించాక అలా కాదు, ఇలా చేయండని సవరిస్తారు. కొంతమంది ఐదారు వర్షన్స్‌లో నటింపజేసి చివరికి ఒకదాన్ని ఓకెచేసి టేక్ తీసుకుంటారు అంటూ తన అనుభవంలో దర్శకుల తీరును వివరించారు రావి కొండలరావు.
ఓసారి ఎన్టీఆర్ దర్శకత్వంలో వరకట్నం చిత్రంలో నటిస్తున్నా. ఆయన ముందుగా ఇలా చేయాలని నటించి చూపిస్తారు. అందులో చిన్న మార్పు జరిగినా ఒప్పుకోరు. చెప్పింది చెప్పినట్టుగా నటించాలంతే. అప్పటికి డైలాగ్ చెబూతూ.. హాస్యంగా నడుస్తూ వచ్చే సీన్‌కు పదహారు టేకులు తీసుకున్నా. ఎన్టీఆర్‌కు నచ్చడం లేదు. దాంతో చాలా ఇబ్బందిపడిపోయా. అదే షాట్‌లోవున్న సత్యనారాయణ, రాజనాల అరటిపళ్లు తింటూ కనిపిస్తారు. 16 టేకులు నేను తీసుకోవడంతో ఇద్దరూ 16 అరటిపళ్లు తినాల్సి వచ్చింది. దాంతో వాళ్ల కడుపులు భారమయ్యాయి. ‘ఇంక మావల్ల కాదు. మేం అరటిపళ్లు తినలేం’ అంటే ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదు. ‘ఖచ్చితంగా తినాల్సిందే బ్రదర్. లేకపోతే సీన్ బాగా రాదు’ అంటున్నారు. తినడానికి ఇబ్బందిపడుతున్న ఇద్దరూ నన్ను పిలిచి ‘ఏదో ఆయనకు నచ్చినట్టు చెయ్యవయ్యా బాబూ. మా పరిస్థితి అర్థం చేసుకో’ అని బతిమాలారు. 16వ టేక్ కూడా ఓకే కాలేదు. నాలో టెన్షన్ మొదలైంది. మిక్కిలినేనిని పొగుడుతూ ఛాతిపై చెయ్యి వేసుకుంటూ రావాలి. అదీ సీన్. ఒక్కోసారి ఎన్టీఆర్ కుడివైపు చెయ్యివేసి నటిస్తే, రావికొండలరావు ఎడమవైపు వేశారు. దాన్నీ ఆయన వదల్లేదు. చేతులు వేస్తే డైలాగ్ రావడంలేదు. డైలాగ్ వస్తే నడవడం కుదరడం లేదు. ఇక నా వల్లకాదు, అరగంట బ్రేక్ ఇవ్వండి అన్నగారు’ అని అడిగేశాను ఎన్టీఆర్‌ని. ఆయన ఓకె చేశారు. ఎందుకు చేయలేకపోతున్నానని మదనపడిపోయాను. అరగంట తరువాత మళ్లీ షాట్ రెడీ అయింది. ఈసారి చాలా జాగ్రత్తగా చేయడంతో ఫస్ట్ షాటే ఓకె అయిపోయింది. అయితే ఈ చిక్కంతా ఎందుకొచ్చిందంటే, ముందురోజు పంపించిన స్క్రిప్ట్‌వల్ల. స్క్రిప్ట్‌లో మొదటి సీన్ తీస్తారనుకొని కంఠతాపట్టి సిద్ధమయ్యాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి రెండో సీనే మొదటగా చిత్రీకరించారు. మొదటి సీన్ తరువాత చేశారు. ఈ తిరుగుడుకంతా ఇదీ కారణం’ అంటూ నవ్వేశారు రావి. ‘తర్వాత రోజు మళ్లీ వరకట్నం షూటింగ్. మా ఆవిడ అడిగింది ‘ఏంటీ ఈరోజు వెళ్లటంలేదా’ అని. అమ్మో, ఆ షూటింగ్ తలచుకుంటే జ్వరం వచ్చేటట్టుందే బాబూ’ అన్న డైలాగ్ గుర్తు చేసుకుంటూ నవ్వేశారాయన. ‘కెవి రెడ్డి దర్శకత్వంలో నేను చేయకపోయినా ఆయన ఎలా చేస్తారో నాకు తెలుసు. కె విశ్వనాధ్ కూడా ముందుగా ఎలా చేయాలో చూపి మనల్ని నటించమనేవారు. బిఎన్ రెడ్డి మనం చేసినదానికి మార్పులు చేర్పులు చేసి చెప్పేవారు. ఆయన చెప్పింది ఐదారు రిహార్సల్స్ అయిపోయాక టేక్ చేసేవారు. కె రాఘవేంద్రరావుతో పనిచేయడం హాయిగా ఉండేది. అంతా ఫ్రీడం. కోగంటి జగ్గారావు అనే నటుడు ఉండేవాడు. ఆయన అర్థరాత్రి చిత్రంలో నేను విలన్ అయితే, నా పక్కన నిలబడే రౌడీలా నటించారు. ఓసారి ఆయన్ని దాసరి నారాయణరావు దాదాపు నెలరోజులపాటు కాల్షీట్ అడిగారు. అనె్నందుకండీ అన్నాడతను. ఈ చిత్రంలో నువ్వే ప్రధాన విలన్. అనేక సన్నివేశాలుంటాయి అని చెప్పారు దాసరి. అమ్మో అన్ని సీన్లు డైలాగులు ఉంటే నేను నటించనండి అని చెప్పేశారాయన. అదేంటయ్యా బాబూ అందరూ అలాంటి అవకాశం కావాలనుకుంటే, నువ్వొద్దంటావేంటి? అని అడిగారు. ఊరికే ఇలా నిలబడి ఒకటి రెండు డైలాగులంటే చెప్పగలను కానీ ఇన్ని రోజులు, ఇన్ని డైలాగులు నావల్లకాదని చేతులెత్తేశారు జగ్గారావు. ఆయననే ఓసారి బి విఠలాచార్య చిత్రంలో మాంత్రికుడిగా చేశాడు. డైలాగ్ చెప్పమంటే కష్టం కదా. అందుకే ఇక విఠలాచార్య ఏదో విధంగా సినిమా పూర్తిచేయాలని, ఇప్పుడు కొత్త నటీనటులు చేస్తున్న డైలాగ్ డెలివరీ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు... అంటూ పద్ధతినే 14, 15 దాకా చెప్పించారు. కెమెరాను లాంగ్ షాట్‌లో పెట్టి ఆ సీన్‌ను చిత్రీకరించారు. తరువాత జగ్గారావు లిప్ మూవ్‌మెంట్స్ తగినవిధంగా విలన్ డైలాగులు రాసుకున్నారు. అలావుంటాయి ఒక్కొక్క సినిమా నటుల విశేషాలు.
విజయప్రభ అనే సినిమా పత్రికలో కొన్ని విశేషాలను రాసేవారు రావికొండలరావు. అందులో ఓసారి నటుడు లింగమూర్తి గూర్చి వ్రాయాల్సి వచ్చింది. హిందీలో కేరెక్టర్ ఆర్టిస్టు యాకూబ్-నవాబ్ ఎంత గొప్పవారో వాళ్ళిద్దరూ కలిపితే లింగమూర్తి అంత గొప్పవాడు అని రాశారు. అది చూసి లింగమూర్తి ఎంతో ఆనందపడిపోయారు.

-సరయు శేఖర్, 9676247000