సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వరదో’ సాయం
ఒక నదికి వరద వచ్చిందనుకో, అందులో కొట్టుకొనిపోయేవాడు ‘నేను అగ్రకులస్థుడను’అన్నా, ‘నేను పెద్ద ఉద్యోగస్థుడను’అన్నా, ‘నాకు బాగా డబ్బుంది’అన్నా. నేను ‘గొప్ప బలశాలి’నన్నా, ‘నేను గొప్ప అందగాడినన్నా’- వరద వదిలిపెట్టదు. బతికి బయటపడాలంటే ఇవేవీ అక్కరకురావు. ఈత వచ్చి వుంటే చాలు. అట్లాగే సంసార సాగరాన్ని తరించాలంటే ఆధ్యాత్మిక సాధన కావాలి. భగవంతుడిని చేరుకోవాలంటే ఏకాగ్రత నిష్ఠ పట్టుదల కావాలి. పట్టుదల ఉంటే చాలు నేను భగవంతుడిని చూస్తాను అని నమ్మకం ఉంటే చాలు.
విలువైన సాధనాలు
మనిషిని భయం, ఆతురతలు ఎందుకింతగా సతమతం చేస్తున్నాయి? ఇందుకు కారణాలు బాహ్యమైనవా? అంతరంగికమా? ఆత్మను నీవు నిర్లక్ష్యంచేసి దేహం గురించీ, ఇంద్రియ సుఖాల గురించీ తాపత్రయ పడటంవల్లనే యిదంతా జరుగుతూ వున్నది. దేహం ఆత్మ నివాసం. అదే ఒక దేవాలయం. దానిలో అనేక విలువైన సాధనాలున్నాయి. నీవు వాటిని ఉపయోగించుకొని చక్కగా గమ్యం చేరుకోవచ్చు. కాని నీవు వాటి ఉనికినైనా గమనించటల్లేదే? అందుకే వెంటనే మేలుకో! నీ పనల్లా సాధన చేయటమే. ఎన్ని అవాంతరాలు కలిగినా, చలించకు. ఎప్పుడు మృత్యువు సమీపిస్తుందో ఎవరికెరుక? బహుశా అది ఈ దినమేకావచ్చు. ఈ క్షణమే కావచ్చు. కాబట్టి ఆలసించకు. దేహాన్ని జాగ్రత్తగా పోషించినట్లే. అంత జాగ్రత్తతో నీ మనసులోని ఆత్మ విచారమును పోషించుకో.
అంతా బాటసారులే
ఏ పూజా మందిరంలోనైనా, నా పటాన్ని చూడగానే నీ మనసులో ఆరాధనాభావం పెల్లుబకటం లేదా? ఆ యింటాయన అంటే నీకంత సద్భావం లేకపోవచ్చు. అయినా అక్కడ నా పటాన్ని చూడగానే అతడూ. నీవూ కొంత సన్నిహితులు అవుతున్నారు గదా! అలాగే అందరి మనసులో ఆ పరమాత్మే వున్నాడని తెలుసుకో. పూజామందిరంలో నా పటాన్ని చూసినట్లే, అందరిలోనూ నన్ను దర్శించు. సాటివారి పట్ల ప్రేమానురాగాలు పెంచుకో. వారితో సమరసంగా మెలగు. ఈ దీర్ఘయాత్రలో నీకు తటస్థపడే సోదరీ సోదరులతో కలసిమెలసి, పరస్పరం సహాయం చేసికొంటూ, దుర్గమమైన సాధనా మార్గంలో ముందుకు సాగు!
బల స్వరూప్
బలహీనత, తటపటాయింపు. చింత పనికిరావు. ‘అమృతస్యపుత్ర’అన్న పేరు నీకిచ్చినవానికే అది అపచారం. నీవు బలస్వరూపుడవు. ఆ సంగతి నీవు గుర్తించాలి. అలాగే ప్రవర్తించాలి. నీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకు. ఎవరికీ తలవంచకు. నిన్నునీవు పిడికెడు శరీరంగా భావించి కించపరచుకోవద్దు. నీవెవరో తెలుసా? చ్యుతి లేని అనంతాత్మవు. పరమాత్మకు నీకు తేడా లేదు. పరమాత్మవలె నీ నా అనే తేడాలు లేకుండా వ్యవహరించు. ఉన్నది ఒకటే పరమాత్మ. కనుక వారు వీరనే తారతమ్యం చూపించక అందరిలోను ఉన్న పరమాత్మ అంశను చూస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
పాపి, గోపి
మానవునికి మంచి జ్ఞాపకశక్తి వుంది. తెలివితేటలున్నాయి. మంచీ, చెడూ తెలుసుకొనే విచక్షణ వుంది. ముందురాబోయే వాటిని వూహించే శక్తి వుంది. ఇంద్రియ వ్యామోహంనుండి తొలగే సామర్థ్యం వుంది. తానొక ఉన్నత లక్ష్యాన్ని సాధించాల్సివుంది అన్న జ్ఞానం వుంది. అయినా అతడు తన లక్ష్యాన్ని మరిచి విషయవాసనలకు దాసుడై పాపిగా మారుతున్నాడు. అలాకాక, ప్రలోభాలకు లోబడక, అడ్డంకులను అధిగమిస్తూ గమ్యం వైపు వెళ్లే సాధకుడే ‘గోపి’. ఎందుకంటే, బృందావనంలోని గోపికలు అలాంటి సాధన చేసి తరించిన ముక్తులకు చక్కని ఉదాహరణ కదా!
కష్టం లేకుండా కైవల్యం?
తీసుకొంటున్న వేతనానికి తగినంత పని చేస్తున్నామా లేదా అని ఎవరికివారు ఆలోచించుకోవాలి. కుండలు కరిగేటట్లు పనిచేస్తే పళ్లు అరిగేటట్లు తినవచ్చు. కాని, ఇప్పుడదిలేదు. వేసుకున్న ఇస్ర్తి బట్టలు నలిగిపోకూడదు. ఫ్యాన్ క్రింద కూర్చోవాలి. అన్నీ టేబుల్ మీదికి రావాలి అని ఆశిస్తాను. కాలు గడప దాటకూడదు. కాసు ఖర్చుకాకూడదు. కైవల్యం ఉట్టిపడాలంటే ఎలా! ఎక్కడ నుంచి వస్తుంది. ఎంత కష్టం చేస్తామో అంత ఫలం వస్తుంది కదా.
వలలో చిక్కకు
చేపలు పట్టేవారు నదిలో వలవేస్తారు. చేపలు వలవైపు పోతే అందులో చిక్కుకుంటాయి. వల వేసిన వాళ్ళవైపు వస్తే వలనుండి తప్పించుకుంటాయి. ఈ ప్రపంచమే ఒక వల. అదే మాయ. దాని వైపుపోతే అందులో బంధితులవుతారు. ఆ మాయను సృష్టించినవాని పాదాలవైపు నడిస్తే విమోచనం లభిస్తుంది.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది