సబ్ ఫీచర్

రక్తపోటు నియంత్రించే యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి స్పీడ్ యుగంలో, ఒత్తిడితో కూడా జీవనంలో చిన్నవయస్సులోనే రక్తపోటు రావడం మామూలైపోయింది. ఇలాంటి ఉరుకుల, పరుగుల జీవనంలో కూడా చిన్నచిన్న యోగాసనాలను వేస్తూ, దినచర్యను ప్రశాంతంగా మార్చుకుంటే రక్తపోటు అనేది దరిచేరదు. అలాగే ఈ యోగాసనాలను వేయడం వల్ల రక్తపోటు ఉన్నవారికి కూడా అదుపులో ఉంటుంది. అల్లోపతి మందుల కన్నా, యోగా భంగిమలు రక్తపీడనాన్ని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ ఈ యోగాసనాలను అనుసరించడానికి ముందు యోగా నిపుణులను లేదా దీనిపట్ల అవగాహన ఉన్నవారి ద్వారా శిక్షణ పొందడం మంచిది. మరి అవేంటో చూద్దామా..
వృక్ష భంగిమ
ఈ భంగిమను రోజూ అనుసరించడం వల్ల బలంతో పాటు, ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ భంగిమలో లోతైన శ్వాసను తీసుకుని, ముక్కు ద్వారా వదలడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఈ ఆసనం వేయాలంటే.. ముందుగా రెండు కాళ్ళను తాకిస్తూ నిటారుగా నిలబడాలి. తరువాత కుడి కాలును పైకి ఎత్తి, పాదాన్ని నెమ్మదిగా ఎడమ కాలు తొడపై ఉంచాలి. ఇలా అనుసరించే సమయంలో రెండు చేతులను పైకు ఎత్తి నమస్కారం భంగిమలో ఉంచాలి. ఇలా కొన్ని నిముషాల పాటు నిలబడి, లోతైన శ్వాసను తీసుకుని వదలాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చాక ఎడమకాలిని కూడా కుడి కాలి తొడపై ఉంచి ఇలాగే చేయాలి. ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల రక్తపీడనం అదుపులో ఉండటమే కాకుండా శ్వాస వ్యవస్థ, శరీరమూ ఆరోగ్యంగా ఉంటాయి.
విపరీతకరణి
దీన్ని ‘లెగ్ అప్ వాల్ పోస్’ అని కూడా అంటారు. ఈ ఆసనం వల్ల కళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ ఆసనంలో వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళను పైకెత్తాలి. అరచేతులతో వెనకభాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు చేతులు, భుజాలపై ఉండేలా చూసుకోవాలి. తరువాత నెమ్మదిగా కాళ్ళను తిన్నగా వెనక్కి వంచాలి. ఈ ఆసనంలో కొద్ది సమయంపాటు ఉన్న తరువాత రెండు కాళ్ళను మడిచి వెనుకభాగాన్ని నెమ్మదిగా నేలకు తాకించి యథాస్థితికి రావాలి.
నమస్కార భంగిమ
దీన్ని చాలా సులభంగా వేయవచ్చు. ఈ ఆసనంలో మొదటగా కాళ్ళను మడిచి కూర్చోవాలి. రెండు చేతులను నమస్తే భంగిమలో ఉంచి ఛాతి ప్రాంతం దగ్గరగా ఉంచాలి. ఇదే సమయంలో నెమ్మదిగా గాలి పీలుస్తూ వదలాలి.
బాల భంగిమ
ఈ భంగిమలో ముందుగా మోకాళ్ళను మడిచి నేలపై కూర్చోవాలి. అంటే వజ్రాసనంలో అన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా గాలిని పీలుస్తూ తలను నేలకు తాకించాలి. ఈ భంగిమలో మూడు శ్వాసల పాటు అలాగే ఉండాలి. తరువాత తిరిగి గాలిని పీలుస్తూ పూర్వపు స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
శ్వాస
ఈ ఆసనంలో వేలుతో ఎడమ లేదా కుడి నాసికా రంధ్రాన్ని మూసి.. ఒకే నాసికా రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఇలా మార్చి మార్చి రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల గుండె సంబంధిత అవయవాలు, నాడీ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అధిక రక్త పీడనం కూడా నియంత్రణలో ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రాంతంలో కూర్చుని ఎడమ చేతిని, ఎడమ మోకాలిపై ఉంచాలి. కుడి చేతి ఉంగరపు వేలును, కుడి నానికా రంధ్రాన్ని మూసి లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇలా కొద్ది సమయంపాటు ఉన్న తరువాత ఎడమ చేతి ఉంగరం వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి, లోతైన శ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా కనీసం ఐదు నిముషాలు చేయాలి.
ప్రయోజనాలు
ఈ ఆసనాలు వేయడం ద్వారా మెదడు, గొంతు భాగాల్లో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. కళ్లు, ముక్కు, చెవులు, నాలుక భాగాలు చాలా చురుకుగా పనిచేస్తాయి. అంతేకాదు వాపు, శోధ వంటి రుగ్మతల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా అసాధారణంగా పెరిగే టాన్సిల్స్ వంటి వాటిని నివారించవచ్చు. *