సబ్ ఫీచర్

సత్సంబంధాలు పెంచుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నతల్లిపై, జన్మభూమిపై మమకారం మాటల్లో చెప్పలేనిది. ఒకవేళ ఎవరైనా చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా చెప్పగలిగేది అణువంత! మిగిలి వుండేది ఆకాశమంత. ఇదే విషయం తెలుగుని ప్రేమించి, తెలుగుని ఆరాధించే భాషాప్రియులకూ వర్తిస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగైన జీవితం కోసం కలలు కనడం, ఆ కలలు నిజం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తూ తగిన రీతిలో విజయాలు సాధించేవారు మరెందరికో స్ఫూర్తిప్రదాతలు కూడా!
భాషాజ్ఞానం ఎంత సంపాదించినా, శాస్త్ర విజ్ఞానం ఎంతగా సమకూర్చున్నా నిత్య జీవితంలో సుఖశాంతులకోసం ప్రయత్నించడం విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు చేస్తున్న పనే! అందుకు తెలుగువాడు మినహాయింపు కదా. చదువు ఎంత అంగడి సరుకుగా మారిందో చదువుకి తగిన ఉద్యోగాల ఎందరిని ఏ మేర వరిస్తున్నాయో, ఊరిస్తున్నాయో, అందినంత మేర పచ్చ కాగితాల పారవశ్యం మాటెలా వున్నా సంసారవంతమైన సమాజ నిర్మాణం కనుచూపు మేర కనిపించకపోగా వర్తమానం కన్నా గతం వేయిరెట్లు మెరుగ్గా కనిపించడమంటే అనాగరిక సమాజంలో నాగరికులుగా చెలామణి అవుతున్న తీరు సిగ్గు కలిగిస్తే, ఇంకా కాస్తో కూస్తో సంస్కారం మిగిలివుందనుకోవచ్చు. అలాకాక సంస్కారాన్ని, నాగరికతను నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేసేవారిని మనుషులని అనుకోగలమా? మనుషులరూపంలో వున్న మానవ మృగాలనుకోవాలా? తమ స్వార్థంకన్నా, తమ అవసరాలు, కోరికలకన్నా మానవ సంబంధాలు, దేశాభిమానం ముఖ్యమని మరచిపోతే ఎలా?
అధికారం, ధనం, పాండిత్యం- తాను ప్రయోజనం పొందుతూ ఎదుటి ప్రయోజనాలకు భంగం కలిగించనంత వరకూ బాగానే వుంటుంది. వాటిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూడగలిగితే మరింతగా బాగుంటుంది కాని ప్రజలనే విస్మరించి, పైపై వేషధారణలతో సమాజాన్ని మభ్యపెట్టేవారు రెండు మంచి మాటలు చెబితే చాలన్నట్లు నిస్సిగ్గుగా భారీ కానుకలతో, అంతకుమించిన తాయిలాలతో వారిని ప్రసన్నం చేసుకోవాలనేకునేవారు ప్రజాద్రోహులు, దేశద్రోహులే తప్ప ప్రజాసేవకులనిగాని, సమాజ సంక్షేమం కోరేవారని భావించే అవకాశం ఎంతమాత్రం లేదు.
అవసరాలు లేని మానవ జీవితాన్ని ఎవరైనా ఊహించగలరా? ఆహారం, వస్త్రం, ఇల్లు కనీస అవసరాలని అందరికీ తెలుస్తున్నా వాటిని సగటుమనిషి అందుకోలేనంత ఎత్తున వుంచి వ్యాపారం పేర ప్రతిక్షణం మోసం జరుగుతూనే వుంది. వీటి పరిస్థితే ఇలా వుంటే మిగతా అనవసరమైన వాటి పేర మరెంత మోసం జరుగుతున్నది ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ చూస్తున్నదే. అత్యధికులు ప్రతినిత్యం అనుభవిస్తున్నదే. విచారించదగిన విషయమల్లా అనుభవాల్లోంచి గుణపాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా భవితవైపు అడుగులు వెయ్యలేకపోవడమే.
నిజమే! ఒకనాడు విలాసమనుకున్నది నేడు కనీసావసరంగా మారింది. అలాగని అందరికీ అది అందుబాటులో వుంటుందని చెప్పలేం. అవసరం, కోరిక, విలాసం- వీటిమధ్య వ్యత్యాసం సుస్పష్టం! ఏది అవసరం? ఏది అనవసరమని ఆలోచించగలవారికి అవసరాల్లోనే కొన్నింటిని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. కనీసం కొన్నింటిని వాయిదా వేసుకునేలా చూడొచ్చు. కనీస కోరికలను సైతం పరిమితం చేసుకునే ముందుచూపున్నవారికి విలాసాల జోలికి వెళ్లే అవసరమే వుండదు. పరిమితులు విధించుకున్నచోట కొన్ని అసౌకర్యాలు అనివార్యమైనా అనవసరమైన ఖర్చులు కాని, వాటివల్ల పెరిగే మానసిక భారాలు వుండవు కాక వుండవు.
ఏది అవసరం? ఏది అనవసరమని బంధు మిత్రుల్లో ఎక్కువమంది చెప్పడానికి ఇష్టపడకపోవడానికి కారణం- ఆ విషయాన్ని వినేవారు స్వల్పమని, దాన్ని ఆచరించాలనుకునేవారు మరీ స్వల్పమని! అంతటితో ముగిసిపోక ఉచిత సలహాల గోలెందుకని పైకి అనేవారు కొందరైతే, ఇంకొందరు లోలోపల విసుక్కుంటారు. తడిస్తేనే కాని గుడిసె కప్పాలనుకునే చందంగా ఎవరు సిద్ధమైనా ప్రయోజనం మాట అటుంచితే చేతులు కాలాక ఆకులు పట్టుకునే తీరే కదా!
ఏది అవసరం? ఎంత మేరకు అవసరమన్నది ఎవరికివారు స్వానుభవంతో నేర్చుకోవలసిందే. ఇంట్లో తల్లిదండ్రులు ఏది ఏ మేరకు అవసరమనుకుంటున్నది పరిశీలన ద్వారా పిల్లలకు అవగాహన కలిగే అవకాశముంది. సాటి మనిషిపట్ల సదభిప్రాయం కలిగినవారు తెలిసినవారి ద్వారా కాని, తెలియనివారిని సైతం పరిచయం చేసుకొని తమకు కావలసిన సమాచారాన్ని పొందడమే గాక అనుమానాలను సైతం తీర్చుకోవడంలో ముందుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా మనిషికీ మరో మనిషికీ మధ్య సత్సంబందాలు నెలకొల్పడంలో మరింత ముందుంటారు.

-డా కొల్లు రంగారావు