సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విటమిన్-జి
జీవితంలో సుఖంకలిగితే పొంగిపోతారు. దుఃఖం కలిగితే కుంగిపోతారు. అలా కాకుండా అన్నిటినీ సమదృష్టితో చూడటమే నిస్సంగత్వం. దానివల్ల శాంతి చేకూరుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆకాశంలో పక్షులూ, విమానాలూ, మేఘాలూ తిరుగుతుంటాయి. అయినా వాటి సంచారంవల్ల ఆకాశానికి ఏమీకాదు. మన మనస్సును కూడా ఆకాశంలా దేనికీ చలించకుండా సమరదృష్టితో మెలగేటట్లు చేయాలి.
శరీరానికన్నా మనసుకు పోషణ అవసరం. లేకుంటే సుస్తీచేస్తుంది. డాక్టర్లు విటమిన్ల లోపంవల్ల జబ్బులొస్తాయంటారు. నేను ‘విటమిన్-జి’ (జి అంటే గుడ్) లోపం అంటారు. నేను సూచించే చికిత్స నామజపం. దేవుని పేరు తలచుకోండి! ఆయన ప్రశస్తిని మననం చేయండి! ఆయన కరుణను కొనియాడండి! విటమిన్-జి! అదే ఔషధం!
ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం, మంచి అలవాట్లు-ఇవి చికిత్సలో మూడింట రెండొంతులు. మిగతా మూడోవంతు మెడిసిన్!
నామం నా కోసమా?
నా ప్రసంగాలను ముగించేముందు నేను భజన కీర్తనలను పాడుతుంటాను. ఎందుకు? మిమ్మల్ని ‘నామస్మరణ చేయండి’-అని ప్రబోధించటం కోసమే!
ఒక ఐ.ఏ.యస్. ఆఫీసర్ గారున్నారు. ఆయన తన పిల్లలకు చదువు చెప్పటానికి పలకమీద ఓనమాలు రాస్తాడు. అంటే, ఆయన ఓనమాలు దిద్దుకుంటున్నాడని ఎవరైనా అనుకుంటారా? ఉహూ! అలాగే, సాయి భజనచేసేది సాయికోసం కాదు. మీకు ‘సాధన’నేర్పటానికి. నలుగురూ కలిసి పెద్దగా నామసంకీర్తన చేయండి! మనోబలాన్ని పెంపొందించుకోండి! చిత్తశుద్ధిని సాధించండి! చైతన్యవంతులుకండీ! నామాన్ని అంటూ, వింటూ మీతోటి వారినికూడా నామామృతాన్ని పానం చేయనీయండి!
ఇంటింటికీ భగవన్నామాన్ని కొనిపోండి! ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి యిల్లూ భగవన్నామంతో మారుమ్రోగేలా చేయండి! నిత్యం ఉషోదయం భగవన్నామంతో పునీతం కావాలి! రామ, కృష్ణ, ఈశ్వర, సాయి- ఏపేరైనా ఫరవాలేదు. అన్ని పేర్లూ ఆయనవే.
ప్రకృతిలో అన్నీ ఆయన స్వరూపమే! కొమ్మా, రెమ్మా, ఆకూ, ఆలమూ, పిందే, ఫలమూ-అన్నీ ఆయనే! అన్నిటినీ ప్రేమతో తడుపు. వాటి రంగు ఏదైనా, రుచి ఏదైనా, రూపం ఏదైనా అవన్నీ దేవుని రూపమే!
అంతా ప్రేమలో కలసి మెలసి జీవించండి! అంతా శాంతి, సహనాలతో మెలగండి! సేవా తత్పరతతో పనిచేయండి!
ఆగని యాత్ర
కర్తవ్యమే దైవం. సేవయే పూజ. అని మీరు వినే ఉంటారు. మీరెక్కడో అడవిలో ఉన్నట్లే భావించి ఏకాగ్రతతో ధ్యానం చేయటం, రెండుచేతులా ఉన్నట్లే భావించి ఏకాగ్రతతో ధ్యానం చేయటం, రెండు చేతులా సమాజ సేవ చేయటం, పవిత్రకారాయలు పదిమందికీ ప్రయోజనం కలిగించే పనులు చేయి. అయితే ఏదో ఫలితం కలుగుతుందనే ఆశతో కాదు. నేను ఈ మంచి పని చేస్తున్నా అనే అహంకారంతోను కాదు.
దివ్యమైన గమ్యాన్ని చేరుకొనేందుకు చేపట్టిన తీర్థయాత్రయే జీవితం. ప్రతిక్షణం ప్రయోజనకరంగా పవిత్రంగా జీవించు. నీ కార్యక్షేత్రం అయిన ఈ భూమి కర్మక్షేత్రవౌతుంది. ధర్మక్షేత్రవౌతుంది.
గమ్యం ఒకటే
ఇంకొకరిని ద్వేషించకుండా జీవించు. పరుల తప్పులను ఎన్నకుంటా బ్రతుకు. పుణ్యం చేయలేకపోతేపోనీ. కనీసం పాపం చేయకు. అదే గొప్పసేవ! పరస్పర విభేదాలను కాదు చూడాల్సింది, నీవీ ఇతరులవీ భావాలు, విధానాలు ఎక్కడ కలుస్తున్నాయో గమనించు. జాతి, కులం, మతం, దేశం వేరైనా మానవులంతా ఒకటే. అందరిగమ్యం ఒకటే.
సాయి ఉద్యమం
ప్రపంచమంతటా గల మానవాలి హృదయాలను ప్రకాశవంతం చేసూత వచ్చిన భారతదేశపు కీర్తి పతాకం సాయి ఉద్యమంతో కొత్తగా రెపరెపలాడుతోంది. రానున్న కాలంలో భారతదేశానికి మహోజ్వలమైన భవితవ్యం కలగటం కోసం సాయి ఉద్యమాన్ని సరయిన సేవా విధానంలో ముందుకు తీసుకొని పోవలసిన బాధ్యత మీ అందరిది. ఒక్క నిప్పురవ్వ కార్చిచ్చును రగుల్కొల్పుతుంది. ఒక్క ఇంజను ఎన్ని రైలు డబ్బాలనో లాగుకొని పోతున్నది. ఆటోమేటిక్ లైట్ల (తమంత తాముగా వెలుగుతూ ఆరిపోతూ ఉండే దీపాలు) విధానాన్ని ఏర్పరిచిన వ్యక్తిలాగా ప్రపంచంలోని నేటి రేపటి సమాజాలనన్నిటినీ సాయి తన సంకల్పంతో సృష్టిస్తున్నాడు. నడిపిస్తున్నాడు.
జీవితం రెండు రెక్కల పక్షివంటిది. ప్రేమ, సేవ అనే రెండు రెక్కలను మనం ధరించాలి. రక్కలతో పక్షి పైకివిధంగా ఎగరుతున్నదో ప్రేమ సేవల చేతనే ఉన్నతస్థాయిని పొందాలి. ఇందులో ఏ రెక్కపోయినా గమ్యమును చేరలేము.
ఇంకా ఉంది

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.