సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సున్నా తీసేయ్
మోక్షసాధనకు ఉపయోగపడే జ్ఞానాన్ని మనిషి ఎలా సంపాదించుకోగలుగుతాడు? ప్రార్థన వల్ల; ప్రేమ వల్ల; దైవానుగ్రహం వల్ల; కేవలం మంచి పనులు చేయడం వల్ల గమ్యాన్ని చేరలేవు. భగవంతుడిని చేరేందుకు కేవలం మంచి చేస్తే చాలదు. భగవంతుడు అంటే ది0, ద్జ్జిలో జ ఎక్కువ ఉంది. నీలో కలిగే కోరికయే ఆ సున్నా. ఫలాపేక్షయే ఆ సున్నా . కీర్తి కాంక్షయే ఆ సున్నా. య్యజూ లోంఛి ఆ సున్నా పోతే మిగిలేది ద్యిజూ కోరిక, ఫలాపేక్ష, కీర్తి కాంక్ష లేకండా సేవ చేయాలనీ, మంచి పనులు చేయాలనీ తలచే స్వార్థం లేని పరమార్థ తత్వమే ఆ పరమాత్తతత్వం. జీవితం +కోరిక = మనిషి; జీవితం-కోరిక= దేవుడు.
గుళ్లకు వెళ్లినపుడు చూస్తావు. కానీ భగవద్దర్శనానికి తయారుగా ఉన్నావా? నమ్రతతో వెళ్లు. నీ గుండెలో ప్రేమను నింపుకొని వెళ్లు. పరిమళ భరితమైన హృదయ పుష్పాన్ని తీసుకొని వెళ్లు. ఆశ, అసూయ ,అహంకారాల కాలుష్యం సోకని మనోఫలాలను తీసికొని వెళ్లు. మనోవాక్కాయ కర్మలచే మాధుర్యాన్ని వర్షించు. భగవంతుని యోజన ప్రకారమే నీ సేవలను భగవంతునికి అర్పించు.
సృష్టి తానే. సృష్టికర్త తనే అయిన పరబ్రహ్మాన్ని దర్శించడానికి సేవ కన్న ఉత్తమ విధానం లేదు. సహస్రముఖంగా ఉన్న సమాజపు సహస్రనామాలూ, సహస్ర పాత్రలు ధరించి జగన్నటకాన్ని నిర్వహించే భగవంతునే తెలుపుతాయి. బహుజీవులలో వుంటే జీవాత్మ పరమాత్మయే అమూల్యమైన ఈ సత్యాన్ని గ్రహించు. పాటించు. సమాజాన్ని సేవించి తరించు.
సేవ ఒక ప్రత్యేకత
మీ ప్రక్కన కూచున్న వాళ్లు దుఃఖిస్తుంటే మీరు సంతోషంగా గడపగలరా? దగ్గరలో ఒక చంటి పిల్ల బాధపడుతూ అదే పనిగా ఏడుస్తున్న చాలు, మీకు కంటి వెంట నీళ్లు వస్తాయి. ఎందుకని? రెంటికీ మధ్య కనబడని అనుబంధం ఉంది. మనిషికొక్కనికే సానుభూతి చూపటం తెలుసు. ఇతరుల ఆనందాన్ని చూసి తానూ ఆనందించగలగటం అతనికే చేతనవుతుంది. ఇతరులు బాధపడుతుంటే తానూ బాధపడతాడు. మిగిలిన జంతువుల కన్నా అతడు ఒక అడుగు ముదుకు వేసిన కారణం అదే. మానవునికి ఒక్కనిగకే సేవ తెలుసు. అదే అతని గొప్పతనం ప్రత్యేకతా కూడా.
సేవా దీక్ష
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సంగాలను ఎలా వదిలించుకోవాలో నేర్చుకునేందుకు వచ్చారు. ఇక్కడకు వచ్చేవారందరికీ సేవ చేయండి. సేవ చేసేటపుడు ఒక్కొక్క సారి మీరు వానలో తడవవలసి రావచ్చు. తడవండి. ఫరవాలేదు. భయపడనకకర్లేదు. మీరు సేవ చేస్తుండగా మృత్యువు పలకరించినా ఆగవద్దు. తుదిక్షణం వరకూ సేవను కొనసాగిస్తూనే ఉండండి. అంతటి దీక్షా, పట్టుదలా మీలో ఉంటే భగవంతుడా మృత్యువును కూడా మీ సేవా మార్గానికి అడ్డురానీయడు.
ఆనందమే నా ఆహారం
మీరు నేనేం చేస్తున్నానో చూడండి. ఒక్క క్షణమైన వృథా చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండండి. మీలో మీరు అనుకుంటుంటారు. స్వామికి ఇది విశ్రాంతి నిలయం. స్వామికి ఇపుడు నిద్రపోతుంటారు. అని కానీ నాకు విశ్రాంతి ఎక్కడ? నిద్ర ఎక్కడ? మీరంతా నిస్సంగత్వాన్ని పెంపొందించుకోవాలి. దైవ చింతనలో కాలం గడపాలి. అప్పటివరకు నాకు విశ్రాంతి లేదు. నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఒక్క క్షణం ఊరికే కూచోను. ఆపనంతా మీ కోసమే. మీ సంక్షేమం కోసమే. సదా సేవే సదాశివ!
నేను చేసుకోగల పనులన్నీ నేనే చేసుకుంటాను. నాకు మీసేవలు అక్కర్లేదు. నా పనులు మరొకరిచెప్పను. ఎందుకని ? నావలెనే మీరంతా వొకరిపై ఆధారపడకుండా ఎవరి పని వారు చేసుకోవాలనే అనుభవం సంపాదించుకోవాలనే.
నేను మేనేజర్నా? సెక్రటరీనా? ప్రెసిడెంట్‌నా ? చైర్‌మన్‌నా ? ‘నువ్వది చేయి అది చేయి.’ అని నన్నాజ్ఞాపించే వారెవరైనా ఉన్నారా? అదీ ఇదీ చేస్తే నాకైమన్నా వొరుగుతుందా? అయినా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోను చిన్నచిన్న విషయాలను కూడా నేనే స్వయంగా చూసుకుంటుంటాను. స్జేజీ, వేదిక, టార్పాలిన్లు, షెడ్లు వాటర్ టాంకులు , పంపులు, - ఏదైనా సరే అన్నీ నేను పర్యవేక్షిస్తుంటాను. నేను నిష్క్రియగా ఉంటే లోకవృత్తం ఎలా నడుస్తుంది. నేనే సూత్రధారిని. నేను మీకు దారి చూపేవాడిని.నేను ఆదర్శంగా ఆచరించి చూపుతున్నాను. మీరు ఇక్కడికి వచ్చేవారికి సేవ చేస్తే నాకు ఆనందం. ఆనందమే నా ఆహారం.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది