సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవే సాధనం
తోటివారికి సాయపడు. ఈదేశంలో జన్మించిన మహర్షులెందరో ఈ సంగతి చాటారు. అవతారమూర్తులు ఈ ఆదర్శాన్ని పాటించి చూపారు. రాముని బంటుగా మారటమే హనుమంతుని జన్మకు ధన్యత చేకూర్చింది. శ్రీకృష్ణుణ్ణి అంతా భగవానునిగా భావించేవారు. ఆయన సర్వజ్ఞుడు. సర్వవ్యాపి. సర్వ వరదుడు. అయినా ఇతరులకు సేవ చేయాలనీ ఆయనకు ఎంతో ఉత్సాహం. ఆసక్తి రాజసూయ యాగం జరిగే సమయంలో ధర్మరాజు దగ్గరకు వెళ్లి తనకేదైనా పని ఇమ్మని అడిగాడు. ఏ పనయినా సరే ఆఖరుకు భోజన పందిళ్లల్లో ఆకులు ఎత్తివేసి శుభ్రం చేసే పని ఇచ్చినా చాలు అని పరమాత్మ అర్థించాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి రథ సారథిగా పనిచేశాడు. జగత్ప్రభువు మరొకరి రథాన్ని తోలటమా? ఎంతవింత? పగలంతా రథం తోలేవాడు. యుద్ధం విరమించగానే గుర్రాలను నదికి తోలుకొని వెళ్లి శుభ్రంగా కడిగి, వాటి గాయాలకు మందు రాచేవాడు. మేతవేసి.. నీళ్లు పెట్టేవాడు. కళ్లాలను రథ సామగ్రినీ యుద్ధంలో దెబ్బతిన్నాయేమో చూసి మర్నాటి కోసం మరమ్మత్తు చేసి పెట్టుకొనేవాడు. సేవ ఎలా చేయాలో స్వయంగా చేసి చూపిన ఆదర్శ వ్యక్తి ఆయన.
మీరు ఏ మనిషికి సేవ చేసినా అది నాకే చెందుతుంది. ఏ జంతువుకు, పక్షికి సేవ చేసినా అదీ నాకే చెందుతుంది. సేవ అత్యుత్తమ సాధన అని చాటాడు శ్రీకృష్ణుడు.
రామ దూత
ఆంజనేయుడు రాముని దూత. దూతలు మూడు రకాలు. యజమాని మాటలను అర్థం చేసుకోని వారొకరు. వారికి తన పనేమిటో తెలియదు. తెలుసుకోవాలన్న తొందరా ఉండదు. చేసుకొని రమ్మన్న పనిని చెడగొట్టుకుని రగలరు కూడా. రెండవ రకం తమకు చెప్పిన పనిని చెప్పినంత వరకే చేస్తారు. మక్కికి మక్కి మనుషులు. మూడోరకం తమకు అప్పగించిన పనినీ దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొని అనుకొన్న పని పూర్తయ్యేదాక పట్టువిడవకుండా పాటుబడుతారు. హనుమంతుడు మూడో రకానికి చెందినవాడు.
హనుమ శ్రద్ధ
సీతనువెదకమని హనుమంతుని పంపినప్పుడు అతడు ఏ మాత్రం తటపటాయించలేదు. వెంటనే రామును ఆజ్ఞను తలదాల్చి వెళ్లాడు. తనకు అప్పజెప్పిన పనిని నెరవేర్చాడు. తనకు మార్గమధ్యంలో కలిగే అవాంతరాలను తలచుకొని జంకలేదు. తనకంతటి ముఖ్యమైన పనిని అప్పగించారని గర్వించనూలేదు. సావధానంగా స్వామి అజ్ఞను విన్నాడు. సాకల్యంగా అర్థం చేసుకొన్నాడు. శ్రద్ధాసక్తులతో పాటించాడు. సాఫల్యాన్ని సాధించగలిగాడు. రామదూత అని పేరొందాడు. శాశ్వత కీర్తిని సంపాదించాడు.
మీరూ రామదూతలు కావాలి. స్థిర చిత్తాన్ని సాధించండి. సుమధుర భావాలు సుమధుర భాషులు కండి. మీరు చేసే ప్రతి పనీ ఇది స్వామికి ప్రీతి దాయకమేనా అని ఆలోచించి మరీ చేయండి.
దేవునికి దగ్గర దారి
ప్రేమ సేవగా రూపొందాలి. ఆకలయిన వానికి అన్నం పెట్టటం సేవ. అనాథలకు ఆసరా ఇవ్వటం సేవ. రోగికి సపర్య చేయటం సేవ.
ఏసుక్రీస్తు అలా స్వయంగా సేవ చేసేవాడు. కరుణతో నిండిన హృదయం భగవంతున ఆలయం. పేదవారిని చూసి ఏసు చలించిపోయేవా. ఆయనను ఆరాధిస్తున్నాను కానీ ఆయన బోధలను విస్మరిస్తున్నారు. ఎక్కడ చూసినా అట్టహాసాలు, ఆడంబరాలూ, అలంకారాలూ , శుష్క ప్రదర్శనమూ , ఊకదండుడు ఉపన్యాసాలు! ప్రేమ లేదు. సేవ లేదు. ఉత్త నిష్క్రియ ఆదర్శాలను ఏకరువు బెట్టటంలో అంతా హీరోలే. ఆచరణ దగ్గరకు వస్తే అంతా జీరోలు! కరుణను పెంచుకోండి. ప్రేమయే జీవం. సేవయే సాధనం. దేవునికి దగ్గర దారి ఇదే.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది