సబ్ ఫీచర్

‘కులమతాల విభజన’ రాజ్యాంగ సమ్మతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగాన్ని (భారతీయ సంవిధాన్) ఆమోదించి 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇదొక చారిత్రక సందర్భం. అలనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన ‘డ్రాఫ్టింగ్ కమిటీ’ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా ప్రతిని ఆమోదిస్తూ 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. పవిత్రమైనదిగా, ఉత్కృష్టమైనదిగా, శక్తివంతమైనదిగా భావిస్తున్న మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
సర్వసత్తాక, సోషలిస్టు, సెక్యులర్, గణతంత్ర ప్రజాస్వామ్య నవ నవోనే్మష భారతదేశంగా ఆనాడు ఆవిర్భవించింది. 1935 నాటి ‘్భరత ప్రభుత్వ చట్టం’ కాలగర్భంలో కలిసిపోయి, సరికొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిందని ప్రపంచానికి మన దేశం చాటి చెప్పింది. ప్రపంచంలో మానవ జీవన విధానంలోని మీగడనంతా పోగేసి, శ్రేష్ఠమైన, సమున్నతమైన, సరికొత్త ‘సంవిధాన్’ ఉషోదయం వెలుగులు ఆసేతు హిమాచలం పరచుకున్నాయని పరమ సంతోషంతో భారత్ ప్రకటించుకుంది.
ఆ రాజ్యాంగానికి లోబడి మనం జీవించాలని ‘వుయ్ ది పీపుల్..’ అని చెప్పుకున్నాం. అంతకుముందున్న భారత ప్రభుత్వ చట్టం, అనుచానంగా వస్తున్న సంప్రదాయ ఆదేశాలు, విధానాలు, పద్ధతులు రద్దయ్యాయి. జాతి,కుల,మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా పౌరులందరికీ నూతన రాజ్యాంగం ప్రాథమిక హక్కులను, బాధ్యతలను కల్పించింది. ఈ రాజ్యాంగం మాత్రమే మనల్ని శాసిస్తుంది. ఆధునిక రాజ్యాంగం అమలులోకి వచ్చాక, వేల సంవత్సరాల భారత ప్రజల జీవన విధానం కొత్త మలుపు తిరిగింది. విప్లవాత్మక మార్పు సంభవించింది. దేశం సరికొత్త సంధ్యా వెలుగులను ముద్దాడింది.
ఇంత సమున్నతమైన, అద్భుతమైన, అమోఘమైన రాజ్యాంగం అమలులోకి వచ్చాక దానికి కట్టుబడి పౌరుల ప్రవర్తన ఉందా? ఇది కోటి రూకల ప్రశ్న! మంత్రులైనా, అధికారులైనా, రాజ్యాంగాన్ని పరిరక్షించేవారైనా, ‘కస్టోడియన్స్’ అని భావించేవారైనా వారి వ్యవహారాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయా? అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయమిది, ఆత్మశోధనకు పూనుకోవలసిన సందర్భమిది.
అంబేద్కర్ చర్య సరైనదేనా?
భారత రాజ్యాంగానికి ఊపిరిపోసిన బి.ఆర్.అంబేద్కర్ తొలి రోజుల్లోనే కులం-మతం పేర ప్రజల మద్య విభేదాలు సృష్టించడం, విభజన మంత్రాలు జపించడం విజ్ఞత అనిపించుకుంటుందా? రాజ్యాంగానికి అతని చర్యలు స్ఫూర్తినిచ్చాయా? అని ఇపుడు తప్పక అంతఃశోధన జరగాలి. సమాధానం చెప్పుకోవాలి. ఆ తరువాత ఆ దారిలోనే ‘కట్టు’ తప్పడం పెరిగింది. లొసుగులను ఉపయోగించుకునే చాతుర్య ప్రదర్శన హెచ్చింది. ఈ వైఖరి సర్వోన్నత రాజ్యాంగాన్ని ఎలా గౌరవించడమవుతుంది? గుండెల మీద చెయ్యేసుకుని ప్రతివారూ తమను తాము ప్రశ్నించుకోవలసిన సందర్భమిది.
దేశంలోని అన్ని జాతులకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సమాన గౌరవం రాజ్యాంగం అందిస్తోందని చెప్పుకున్నాక, ఇకపై అదే సర్వోన్నత అధికారం గలదని త్రికరణ శుద్ధిగా ప్రకటించుకున్నాక, భావోద్వేగాలతో లోకమంతా చాటింపువేశాక- కులం -మతానికి పెద్దపీట వేసి మాట్లాడటం, వ్యవహరించడం ఏ రకంగా విజ్ఞత అనిపించుకుంటుంది?
దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు సహాయ సహకారాలు అందించడం పౌరుల ప్రాథమిక విధి అని రాజ్యాంగంలోని ‘పౌరుల ప్రాథమిక బాధ్యతలు’ శీర్షిక కింద రాసుకుని, వాటిని తలపై పెట్టుకుని ప్రతిజ్ఞ చేశాక- గతంలో గాని, వర్తమానంలో గాని జరుగుతున్న విచ్ఛిన్న, విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టే సంఘటనలు.. ఆందోళనలు.. ఉద్యమాలు ఇంత బరితెగింపుగా ఎలా జరుగుతాయి? ఇలా జరిగితే రాజ్యాంగాన్ని ప్రజలు గౌరవిస్తున్నట్టవుతుందా? అవన్నీ ప్రాథమిక హక్కుల ఆధారంగా జరిగాయని చాలా సులువుగా చాలామంది అంటూ ఉంటారు. హక్కులు ఎప్పుడూ బాధ్యతల్ని బలిచేయరాదన్న విషయాన్ని విస్మరించి మాట్లాడితే అది క్రమశిక్షణ అవదు, అప్పుడు అరాచకం తప్పదన్న స్పృహ లేకపోతే ఎలా?
1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది, 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానుసారమే ఆ ఎన్నికలు జరిగాయి. అందులో పాల్గొని అంబేద్కర్ ఓటమి పాలయ్యారు. ఆయన స్థాపించిన ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’ పరాజయం పాలైంది. ఆ విషయాన్ని ఆయన, అతని అభిమానులు తట్టుకోలేకపోయారు. క్రమంగా ఆయనలో ఆక్రోశం పెరిగింది. అదికాస్త 1956లో బద్దలైంది. ఆ ఏడాది అక్టోబర్ 15న నాగపూర్‌లో దీక్షాభూమిలో ఐదు లక్షలమంది దళితులతో కలిసి అంబేద్కర్ ‘మతం’ మార్చుకున్నారు. ఆనాటి ప్రసంగం, వాతావరణం ఏరకంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనది? కులం పేర, మతం పేర అది దేశంలో విభజన తీసుకురావడమే కదా? దేశ సమగ్రతకు, సమైక్యతకు, సుహృద్భావ వాతవారణానికి ఒక పౌరుడిగా, మేధావిగా, పాలనా ఆర్థిక రంగ నిపుణుడిగా ఆ చర్య ఎలా దోహదం చేసినట్టయింది?
రాజ్యాంగం పురిట్లోనే దాని మరణానికి ఇలా బీజాలు వేయడం ఏ విధంగా గౌరవనీయమవుతుంది?
మనుస్మృతి, అగ్రవర్ణాల పెత్తనం, దాష్టీకం లాంటి పదాలు, మాటలు రాజ్యాంగం అమలులోకి వచ్చాక మృతప్రాయమైనవి. 1935లో చేసుకున్న చట్టాలే సమాధి అయ్యాయని ప్రకటించుకున్నపుడు వేదకాలం నాటి ‘మనుస్మృతి’ గూర్చి రెండవ పారిశ్రామిక విప్లవం విస్తృతమయ్యాక అంబేద్కర్ లాంటి మేధావి అలా మాట్లాడటం విషాదకరం. తాను రాసిన రాజ్యాంగానే్న ఆ విధంగా తానే గౌరవించలేదనిపిస్తోంది. అలా ప్రాసంగికత లేని అంశాలను, పదాలను పట్టుకుని ప్రజలను పక్కదోవ పట్టించడం ఏ విధంగా ఆమోదయోగ్యం అవుతుంది?
సర్వసత్తాక, సోషలిస్టు, సెక్యులర్, గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని అందించిన రాజ్యాంగానికి మతమార్పిడి చర్య శక్తిని అందించినట్టయిందా? లేక దాన్ని నిర్వీర్యం చేసినట్టయిందా? ప్రతి ఒక్కరూ తప్పక ప్రశ్నించుకోవలసిన తరుణమిది!
‘దీక్షాస్థలి’లో అంబేద్కర్ ప్రసంగించే నాటికి ఈ నేలపై ‘మనుస్మృతి’ ఎక్కడ వుంది? ఉన్నదల్లా ఆయన రాసిన ‘స్మృతి’ మాత్రమే. అందులో ప్రజలందరూ సమానులని స్పష్టంగా పొందుపరిచాక, అది అమలులో వున్నాక లక్షలాదిమంది ప్రజలను ‘మతమార్పిడి’కి ప్రోత్సహించడం, అందుకు తాను నాయకత్వం వహించడం రాజ్యాంగ స్ఫూర్తిని ఇనుమడింపజేస్తున్నదా?
అమెరికా-బ్రిటన్ సమాజాలను అతి దగ్గరగా చూసి, ఆనాటి పారిశ్రామిక విప్లవాలు తీసుకొచ్చిన సామాజిక ఆర్థిక మార్పులను సూక్ష్మంగా పరిశీలించి, సమాజంలో సమూల మార్పులకు సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) ఉపకరిస్తోందని గ్రహిచిన నాయకుడు మతం మారడం వల్ల సమానత సాధ్యమని, సాంత్వన చేకూరుతుందని విశ్వసించడం విడ్డూరం!
ఫ్రెంచి విప్లవం మొదలుకుని, బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలోని మేలిమిని గ్రహించి, కమ్యూనిజం సైతం పేదలకు ఉపకరించదని పేర్కొన్న అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరణతో సాంత్వన కలుగుతుందని, సమానత ఒనగూరుంతుందని ప్రకటించి, ఉపన్యాసాలు చేసి ఎందరినో ఆకర్షించడం పురోగమనమవుతుందా? తిరోగమనమవుతుందా?
1934లో అంబేద్కర్ ఒక రైల్వే ప్లాట్‌ఫాంపై స్టేషన్ మాస్టరు నిరాదరణ, ఓ బండివాడి సహాయ నిరాకరణ లాంటి సంఘటనలు చవిచూడవచ్చు. అయితే దీక్షాస్థలిలో మతమార్పిడి సమయానికి అంబేద్కర్ రాజప్రాసాదం లాంటి ఇంట్లో ఎంతోమంది సహాయకులు, సేవకులతో గడిపారు. ఈ గుణాత్మక మార్పు అందరి జీవితాల్లో వచ్చేందుకు పాటుపడాల్సింది పోయి మత మార్పిడికి ప్రోత్సహిస్తే అదెలా సమకాలీన జ్ఞానమనిపించుకుంటుంది? మత మార్పిడివల్ల సమత ఎలా సాధ్యమవుతుంది?
అది లగాయతు దేశంలో సామరస్యం కన్నా అసంతృప్తికి, అశాంతికి, ఘర్షణకు, విద్వేషాలకు ఊపిరిలూదేవారి సంఖ్య పెరిగింది. ‘ప్రాథమిక హక్కులు’ పేర చివరికి దేశాన్ని ముక్కలు చేసేవారు బయలుదేరారు. ఓ చెంప దేశ సమైక్యతకు, సమగ్రతకు, సర్వసత్తాకతకు భంగం కలిగించబోమని రాజ్యాంగంపై నమ్మకంతో (అప్రకటిత) ప్రతిజ్ఞ చేసి ఇలా దేశ విచ్ఛిన్నత కోసం పగలు రాత్రి పాటుపడటం ఏ రకంగా ఆమోదనీయం? ఏ విధంగా ఆహ్వానించదగ్గ అంశం?
పొరుగు దేశం చైనా అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతూ అగ్రదేశంగా ఉబికివస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించే ప్రణాళికలు రచిస్తుంటే.. భారతదేశంలోని కొందరు ఇంకా ఇలా దేశ విచ్ఛిన్నతకు పాల్పడుతూ, రాజ్యాంగ విరుద్ధ, ప్రాథమిక బాధ్యతలను కాలరాస్తూ ఇంకా కులం, మతం దగ్గరే తచ్చాడుతూ ఉంటే- ఎప్పటికి దేశ ప్రజల దృష్టికోణం మారుతుంది? ఇంకెప్పుడు రాజ్యాంగబద్ధ పాలన కొనసాగేలా ఒత్తిడి తీసుకొస్తాం?
రాజ్యాంగ ‘కస్టోడియన్స్’, పాలకులు పక్కదారి పట్టినా సరైన దారిలోకి తీసుకొచ్చే ‘చర్నాకోల’ను రాజ్యాంగం పౌరలకు ఇచ్చిందన్న విషయం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. సందర్భానుసారంగా సవరణలతో రాజ్యాం గం పదికాలాలు పరిమళాలు వెదజల్లాలని ఆశిద్దాం!

- వుప్పల నరసింహం 99857 81799